E-Paper
Advertisement

ఖాకీ డ్రెస్‌కి, క్రైమ్ సామ్రాజ్యానికి మధ్య సాగే రక్తపాతం… ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ అండ్ మైండ్ గేమ్ థ్రిల్లర్

ఖాకీ డ్రెస్‌కి, క్రైమ్ సామ్రాజ్యానికి మధ్య సాగే రక్తపాతం… ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ అండ్ మైండ్ గేమ్ థ్రిల్లర్
Advertisement

Political Crime Thriller: అడవులను తన అడ్డాగా మార్చుకున్న ఓ డెకాయిట్… అతని వెనుక రాజకీయ నాయకుల అండ… మరోవైపు ఎలాగైనా అతన్ని పట్టుకోవాలనుకునే నిజాయతీ గల పోలీస్ అధికారి. కానీ ఈ వేటలో అడుగడుగునా కులం, రాజకీయం, అవినీతి అడ్డుపడితే ? చట్టాన్ని నమ్ముకున్న అధికారి గెలుస్తాడా ? లేక అడవుల్లో తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నేరస్థుడిదే పైచేయి అవుతుందా ? అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రల్లో నటించిన Ghamasaan ఇదే ఉత్కంఠభరితమైన కథతో సాగుతుంది. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది ? అనేది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే… 

కథ బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని అడవులు, లోయల నేపథ్యంలో మొదలవుతుంది. మహారాజ్ అనే భయంకరమైన డెకాయిట్ అక్కడ తన ముఠాతో కలిసి భయాన్ని రాజ్యమేలేలా చేస్తుంటాడు. ఓ పెళ్లి వేడుక సమయంలో పెళ్లి కొడుకు తండ్రిని కిడ్నాప్ చేసి చంపడంతో అతని క్రూరత్వం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. రోజులు గడిచే కొద్దీ అతని ప్రభావం మరింత పెరుగుతుంది. స్థానిక రాజకీయ నాయకులు కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం మహారాజ్‌ ను ఉపయోగించుకుంటూ అతనికి అండగా నిలుస్తారు.

Advertisement

ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రభుత్వం STF అధికారి ఆదిత్య సింగ్‌ ను రంగంలోకి దింపుతుంది. నిజాయతీకి పేరున్న ఆదిత్య తన బృందంతో బుందేల్‌ఖండ్ అడవుల్లోకి వెళ్తాడు. అక్కడ మొదలయ్యేది సాధారణ పోలీస్ ఆపరేషన్ కాదు. మహారాజ్ అడుగుజాడలను వెతుకుతూ ముందుకు వెళ్లే కొద్దీ, అతని వెనుక పెద్ద రాజకీయ వ్యవస్థ పని చేస్తోందని ఆదిత్యకు అర్థమవుతుంది. అడవుల్లో డెకాయిట్లతో పోలీసుల మధ్య నడిచే వేట మరింత తీవ్రమవుతుంది.

ఒకవైపు మహారాజ్ తన ప్రాంతంపై పట్టు నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటే, మరోవైపు ఆదిత్య అతన్ని చట్టం ముందు నిలబెట్టాలని పట్టుదలగా ఉంటాడు. కానీ కుల సమీకరణాలు, అవినీతి అధికారులు, రాజకీయ జోక్యం ఈ పోరాటాన్ని మరింత సంక్లిష్టం చేస్తాయి. మహారాజ్‌ కు అణగారిన వర్గాల్లో ఉన్న ఆదరణ కూడా ఆదిత్యకు పెద్ద సవాలుగా మారుతుంది. అతన్ని కేవలం ఓ నేరస్థుడిగా చూస్తే సరిపోదని, అతని చుట్టూ ఏర్పడిన వ్యవస్థను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారి గ్రహిస్తాడు. చివరి వరకు సాగిపోయే ఈ పోరాటంలో చట్టం గెలిచిందా ? మహారాజ్ సామ్రాజ్యం కూలిపోయిందా ? అన్నదే సినిమా క్లైమాక్స్.

తెలుగులో ఏ ఓటీటీలో చూడొచ్చు ?

Advertisement

‘ఘంసాన్’ సెప్టెంబర్ 11 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. టిగ్మాన్షు ధూలియా దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌ లో అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ కీలక పాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం ఓటీటీలో ఒరిజినల్ హిందీ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ మాత్రమే ఉన్నాయి. తెలుగు ఆడియో అందుబాటులో లేదు. డెకాయిట్ కథలు, పోలీస్ ఆపరేషన్స్, పొలిటికల్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌ తో సాగే ఈ ఇంటెన్స్ థ్రిల్లర్ ను మిస్ అవ్వొద్దు.

Read Also: ఖైదీలపై డేంజరస్ మైండ్ ఎక్స్‌పెరిమెంట్స్… మైండ్ బెండింగ్ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

Tags

Related News

ఐఏఎస్ ఆఫీసర్ తీర్చుకున్న షాకింగ్ ప్రతికారం… ఊహకందని పొలిటికల్ రివేంజ్ థ్రిల్లర్

వింత వైరస్ దాడితో సర్వనాశనమైన ప్రపంచం… తెలుగులోనే ఈ స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

విలన్‌తో అమాయకపు అమ్మాయి బాడీ స్వ్యాప్… భయపెట్టే కామెడీ రోలర్‌కోస్టర్ రైడ్

సినిమా ప్రపంచం వెనుక ఉన్న అసలు రంగులు… నవ్వులతో పాటు కన్నీళ్లు పెట్టించే వినోదాత్మక ప్రయాణం

జోజు జార్జ్ ఊచకోత తెలుగులోనే… నిమిషానికో మలుపు ఉన్న మలయాళం హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్

ప్రేయసిని మర్చిపోవడానికి వెళ్లిన హీరోకు షాకింగ్ ట్విస్ట్… ట్రెక్కింగ్‌లో ఎక్స్ ఎంట్రీతో ఊహించని మలుపు

కుటుంబ బంధాలను సైతం బలితీసుకునే పొలిటికల్ యాక్షన్ డ్రామా… విశాల్ గ్యాంగ్ స్టర్ డ్రామా స్ట్రీమింగ్ తెలుగులో

Big Stories

Advertisement
×