Ranbir Kapoor: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ కూడా ఒకప్పుడు కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే చేసేవారు కానీ ఇటీవల కాలంలో పాన్ ఇండియా స్థాయిలో వారి సినిమాలను కూడా విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు రణబీర్ కపూర్ (Ranbir Kapoor)ఇదివరకే నటించిన బ్రహ్మాస్త్రం, యానిమల్ వంటి సినిమాలను తెలుగులో విడుదల చేసి ఇక్కడ కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక త్వరలోనే ఈయన రామాయణం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామాయణ(Ramayan) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారి (Nitesh Tiwari)దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది.
రామాయణం ఆధారంగా..
ఈ సినిమాలో రాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తుండగా సీత పాత్రలో నటి సాయి పల్లవి(Sai Pallavi) నటించిన బోతున్నారు. ఇక రావణాసురుడి పాత్రలో శాండిల్ వుడ్ స్టార్ యశ్(Yash) నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక గ్లింప్ వీడియో విడుదల చేయడంతో ఇది కాస్త పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళి పండుగ సందర్భంగా విడుదల కాబోతుందని రెండవ భాగం 2027 దీపావళి పండుగను పురస్కరించుకొని రాబోతుందని విడుదల తేదీలను కూడా ప్రకటించారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి హీరో రెమ్యూనరేషన్(Remuneration) పై ఒక వార్త హల్చల్ చేస్తుంది.
రణబీర్ కెరియర్ లోనే హైయెస్ట్..
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు భాగాలకు కలిపి సుమారు 1600 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో నటుడు రణబీర్ కపూర్ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారు. ఈయన ఇదివరకు ఒక్కో సినిమాకు 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకునే వారు, కానీ ఇప్పుడు 75 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఇలా రెండు భాగాలకు కలిపి రణబీర్ కపూర్ ఏకంగా 150 కోట్ల రూపాయలు అందుకోబోతున్నారు.
బీఫ్ తినే వ్యక్తి రాముడు?
ఇక ఈ సినిమాలో సీత పాత్రలో నటించిన నటి సాయి పల్లవి(Sai Pallavi) సైతం భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సాయి పల్లవి ఇప్పటివరకు ఒక్కో సినిమాకు మూడు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారు. కానీ రామాయణ సినిమా రెండు భాగాలకు కలిపి ఈమె 15 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా చిత్రం కావడంతో రవి దూబే, సన్నీడియోల్, వివేక ఒబెరాయ్, లారాదత్త, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతిసింగ్ వంటి భారీ తారాగణం భాగం కాబోతున్నారు. అయితే ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటించబోతున్న నేపథ్యంలో బీఫ్ తినే వ్యక్తి రాముడిగా నటించడం ఏంటి అంటూ కూడా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: ఇంటిని బాగా మిస్ అవుతున్న రష్మిక.. అతనితో వెకేషన్ బదులు ఇంటికెళ్లొచ్చుగా?