E-Paper
Advertisement

బెంగాల్‌లో ఉద్రిక్తత.. ఎంపీ మహువా మోయిత్రాపై కోడిగుడ్లతో దాడి!

బెంగాల్‌లో ఉద్రిక్తత.. ఎంపీ మహువా మోయిత్రాపై కోడిగుడ్లతో దాడి!
Advertisement

Mahua Moitra: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర కలకలం రేగింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఫైర్‌బ్రాండ్ నాయకురాలు, ఎంపీ మహువా మెుయిత్రాపై జరిగిన దాడి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం పర్యటిస్తున్న ఆమెను లక్ష్యంగా చేసుకుని కొందరు దుండగులు ఈ దాడికి తెగబడ్డారు.

ఘటన ఎలా జరిగిందంటే..?

Advertisement

మహువా మెుయిత్రా తన నియోజకవర్గ పరిధిలో పార్టీ కార్యకర్తలతో కీలక సమావేశాన్ని ముగించుకుని తిరుగుప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో ఉన్న ఒక దుకాణం వద్ద ఆమె వాహనం ఆగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో అక్కడకు చేరుకున్న కొందరు ఆందోళనకారులు ఒక్కసారిగా ఆమెపైకి దూసుకొచ్చారు. నినాదాలు చేస్తూ, చూస్తుండగానే ఆమెపై కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. ఊహించని ఈ పరిణామంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ఉద్రిక్తత.. పోలీసుల విచారణ

Advertisement

ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వైషమ్యాల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దాడికి పాల్పడింది ఎవరు? దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? అనే కోణంలో ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు.

Also Read: బీజేపీ హిందూత్వానికి రేవంత్ ‘సనాతన’ చెక్.. అసలు వ్యూహం ఇదేనా?

రాజకీయ దుమారం

ఈ దాడిని టీఎంసీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రతిపక్షాల కుట్రలో భాగంగానే ప్రజాప్రతినిధిపై ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. చట్టసభల్లో గళం విప్పే మహిళా ఎంపీపై ఇలాంటి చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని స్థానిక నేతలు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనతో సదరు ప్రాంతంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related News

జవాన్ల మధ్య అంతర్గత కలహాలు.. నలుగుర్ని కాల్చి చంపిన మరొక జవాన్, జమ్మూకాశ్మీర్‌లో దారుణం

రూ.3 వేల మందుకు రూ. 27 వేలా? కేంద్రంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

చైనా మీదుగా భారత విమానాలు.. పాక్ ఆంక్షలకు చెక్ పెట్టేలా.. డ్రాగన్‌తో కేంద్రం చర్చలు!

ఇద్దరు అమ్మాయిలు-ఆటో డ్రైవర్‌కు మధ్య ఫైటింగ్, బెంగుళూరులో ఘటన, వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం ధ్వంసం, నలుగురు దుర్మరణం!

టెంపుల్ పూజారిని చావబాదారు.. అసలు కారణం అదేనా? రంగంలోకి జైపూర్ పోలీసులు, వీడియో వైరల్

చలాన్ల వసూలుకు సుప్రీం కొత్త ఫార్ములా.. కరెంట్ బిల్లులతో లింకప్.. లైసెన్స్ సస్పెండ్‌కు సిఫార్సు!

ఎంపీల అనర్హత పిటిషన్ల విచారణలో జాప్యం.. న్యాయవ్యవస్థపైనే సుప్రీంకోర్టు షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×