Vaishnavi Chaitanya:వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) యూట్యూబర్ గా తన కెరియర్ మొదలుపెట్టి .. బేబీ చిత్రంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న తెలుగమ్మాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అందం, అభినయంతో ఆకట్టుకుంటూనే అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.
ముఖ్యంగా ఇప్పుడు కుర్ర కారు క్రష్ గా మారిన ఈ ముద్దుగుమ్మ వయసుపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ తో ప్రేమలో పడిందని, అతడి ఇంటికి కోడలిగా వెళ్లబోతోందని , అయితే ఇక్కడ రష్మిక మందన్న కంటే ఈమెవయసే ఎక్కువ అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
ఈ వార్తలు ఇలా వైరల్ అవ్వడానికి కారణం వికీపీడియాలో ఆమె వయసు 32 ఏళ్లుగా చూపించడమే. ఇక దాంతో ఈ వదంతులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవడంతో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వైష్ణవి చైతన్య స్వయంగా తన ప్రస్తుత ఏజ్ పై స్పందించింది. అంతేకాదు ఆధార్ కార్డు లైవ్ లో చూపించి మరీ రూమర్స్ కి చెక్ పెట్టింది. వైష్ణవి చైతన్య మాట్లాడుతూ..” వికీపీడియాలో నా వయసు 32 ఏళ్లుగా చూపిస్తోంది. అది తప్పు. నా వయసు కేవలం 25 ఏళ్లు మాత్రమే . ముఖ్యంగా వికీపీడియాలో నా వయసుతో పాటు నా పుట్టిన ప్రదేశానికి సంబంధించిన వివరాలు కూడా తప్పుగా ఉన్నాయి.
వికీపీడియాలో ఉన్న సమాచారమే నిజమని ఎంతోమంది నమ్ముతున్నారు. అయితే అది పూర్తిగా అవాస్తవం” అంటూ క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి అయితే సోషల్ మీడియాలో ఈమె వయసు పై వస్తున్న ప్రచారానికి ఒక్కసారిగా పులిస్టాప్ పడినట్లు అయింది ఇక ప్రస్తుతం ఎందుకు సంబంధించిన ఇంటర్వ్యూ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె అభిమానులు వెంటనే వికీపీడియా సరిచేయాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ALSO READ: “నేను బ్రతికే ఉన్నాను”.. సోషల్ మీడియా ట్రోల్స్ పై నటి వడివుక్కరశి ఆవేదన!
షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్లు పోషించి మెప్పించింది. బేబీ సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇటీవల ఎపిక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వైష్ణవి చైతన్య.. ఈ సినిమాతో కూడా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది అని చెప్పాలి .మొత్తానికి అయితే సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టిన వైష్ణవి చైతన్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం .ఏది ఏమైనా అద్భుతమైన కథల ఎంపికలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరో లను సైతం మెప్పిస్తుంది ఈ ముద్దుగుమ్మ.