OTT Movie : మలయాళం సినిమాలకు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మాలీవుడ్ మేకర్స్ సహజంగా, మనసుకు హత్తుకునే విధంగా సినిమాలు తీయడమే దీనికి కారణం. ఈరోజు మన మూవీ సజెషన్ కూడా ఫ్యామిలీ మొత్తం కలిసి చూడగలిగే ఓ ఇంట్రెస్టింగ్ మూవీ. ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? స్టోరీ ఏంటి? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.
మనోరమా మ్యాక్స్ లో స్ట్రీమింగ్
ఈ మలయాళ కామెడీ-థ్రిల్లర్ డ్రామా పేరు ‘Mandakini’. 2024లో విడుదలైన ఈ మూవీ నూతన వధూవరుల మొదటి రాత్రి జరిగిన ఊహించని సంఘటన చుట్టూ తిరిగే కథ. ఇందులో సస్పెన్స్ తో పాటు కామెడీ కూడా కావాల్సినంత ఉంటుంది. వినోద్ లీల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఆల్తాఫ్ సలీం (ఆరోమల్), అనార్కలి మరికర్ (అంబిలి), సరిత కుక్కు (రాజలక్ష్మి), గణపతి ఎస్. పొడువల్ (సుజిత్ వాసు), వినీత్ తట్టిల్ (ఉన్ని) తదితరులు నటించారు. ఈ సినిమా Manorama Maxలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది.
కథలోకి వెళ్తే…
ఆరోమల్ (ఆల్తాఫ్ సలీం) ఒక సాధారణ యువకుడు. తన సింగిల్ మదర్ రాజలక్ష్మి (సరిత కుక్కు) నడిపే డ్రైవింగ్ స్కూల్‌లో పని చేస్తాడు. అతను తన స్టూడెంట్ అంబిలి (అనార్కలి మరికర్)ని పెళ్లి చేసుకుంటాడు. కాకి ముక్కుకు దొండపండు అన్నట్టుగా ఆమె అందం ముందు హీరో ఏమాత్రం సరిపోలేడని చెప్పుకుంటాడు స్థానికులు.
ఇక పెళ్లి తంతు అయ్యాక మొదటి రాత్రికి ఏర్పాట్లు జరుగుతాయి. హీరో హీరోయిన్ గదిలోకి వెళ్ళేదాకా అంతా బాగానే ఉంటుంది. కానీ ఆరోమల్ కోసం సిద్ధం చేసిన మద్యం గ్లాస్‌ను అంబిలి పొరపాటున తాగుతుంది. దీనితో ఆమె తన గత రిలేషన్ గురించి తప్ప తాగి భర్త ముందు, అది కూడా ఫస్ట్ నైట్ రోజు వాగేస్తుంది. ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ సుజిత్ వాసు (గణపతి ఎస్. పొడువల్) ఆమెను దారుణంగా ట్రీట్ చేశాడని తెలుస్తుంది. ఈ విషయం ఆరోమల్ కుటుంబానికి షాక్ ఇస్తుంది.
Read Also : పెళ్లి ఫిక్సయిన అమ్మాయిలు కిడ్నాప్… చేతులు నరికి, ముక్కలు ముక్కలుగా పారేస్తూ కిరాతకంగా చంపే సైకో కిల్లర్
ఈ సంఘటన వివాహ వేడుకల్లో గందరగోళాన్ని సృష్టిస్తుంది. కామెడీతో కూడిన గొడవలు మొదలవుతాయి. రెండవ భాగంలో అంబిలి కుటుంబం సుజిత్‌ను గుర్తిస్తుంది. అతను సోషల్ మీడియా స్టాకర్, మోసగాడు అన్న విషయం బయటపడుతుంది. అయితే రాజలక్ష్మి, అంబిలికి మద్దతుగా నిలబడి, సుజిత్‌తో గట్టిగా వాదిస్తుంది. మరి ఆ టైంలో హీరో ఏం చేశాడు ? తన భార్యకు సపోర్ట్ చేసి మళ్ళీ హ్యాపీగా లైఫ్ స్టార్ట్ చేశాడా ? లేదంటే ఆమెను ప్రియుడితో కలిసి మోసం చేసిందనే అపార్థంతో వదిలేశాడా? అన్నది తెరపై చూడాల్సిందే.