Ravi Babu:విలక్షణ నటుడిగా తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న రవిబాబు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. హారర్ సినిమాలతో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈయన ఒకవైపు దర్శకుడిగా మరొకవైపు నటుడిగా సత్తా చాటుతున్నారు. అలాంటి ఈయన తాజాగా రేజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఒకవైపు ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమంలో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్నో విషయాలను మాట్లాడుతున్నారు. అందులో భాగంగానే ఇండస్ట్రీలో ఇప్పటివరకు తనకు అలాంటి నటుడు దొరకలేదు అంటూ చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి.
విషయంలోకి వెళ్తే.. తెలుగులో ప్రస్తుతం ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు.. ఇప్పుడు అందరూ కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తున్నారు..అయితే వీరిలో ఎంతమంది నిజమైన ఫైట్స్ చేస్తారు. ఎంతమంది డూప్ ని ఉపయోగిస్తారు.. అనే విషయం దాదాపు తెలియదనే చెప్పాలి.పలానా సీన్ పలానా హీరో డూప్ ఉన్నాడని తెలియకుండా జాగ్రత్తలు పడుతున్నారు మేకర్స్ .ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో 90 శాతం మంది హీరోలు డూప్లెనే ఉపయోగిస్తున్నారని కూడా చెప్పారు రవిబాబు.
మరి దీనిపై ఆయన మాట్లాడుతూ..” నా సినిమాలో హీరోది మధ్య వయసు పాత్ర. దీనికోసం టాలీవుడ్ లో ఎవరు ఉంటారో అని చూస్తే ఒక్కరు కూడా కనిపించలేదు. ఎందుకంటే నాలాగా ఫిజికల్ గా బలంగా ఉండి, నాలా నటించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అనుకుంటే ఇండస్ట్రీలో ఒక్కరు కూడా దొరకలేదు. నేను మాత్రం ఫైట్స్ సీన్స్ లో మార్షల్ ఆర్ట్స్ లాంటివి నిజంగా పెర్ఫార్మ్ చేశాను.. కానీ మన దగ్గర 90 శాతం మంది హీరోలు డూప్స్ ని ఉపయోగిస్తుంటారు.. అందుకే నా పాత్ర కోసం నేనే నటించాల్సి వచ్చింది ” అంటూ రవిబాబు తెలిపారు. ప్రస్తుతం రవిబాబు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:24 ఏళ్లకే ‘ది వాయిస్’ మాజీ కంటెస్టెంట్, స్టార్ సింగర్ మృతి.. ఏమైందంటే?
ఇక రవిబాబు విషయానికి వస్తే.. ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు వారుసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఒకవైపు స్టార్ హీరోలు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు కామెడీ మూవీస్ తో ఆకట్టుకుంటున్నారు. దర్శకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రేజర్ అనే రివెంజ్ యాక్షన్ డ్రామా సినిమా చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో అంతా రక్తపాతమే కనిపించింది. ఇక మే 8వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా రవి బాబుకు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.. ఇక ఈ సినిమాతో ఆయన మళ్లీ కం బ్యాక్ ఇవ్వాలని అభిమానులు కూడా కోరుతున్నారు. మరి ఈ సినిమాతో కం బ్యాక్ ఇచ్చి మునుపటి వైభవాన్ని అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.