E-Paper
Advertisement

ఏప్రిలియా టుయోనో 457 vs స్పెషల్ ఎడిషన్.. రెండింటి మధ్య తేడాలు ఇవే!

ఏప్రిలియా టుయోనో 457 vs స్పెషల్ ఎడిషన్.. రెండింటి మధ్య తేడాలు ఇవే!
Advertisement

Old vs New Aprilia Tuono 457: ఏప్రిలియా టుయోనో 457 కొత్త అవతార్ లో భారత మార్కెట్లోకి అడుగు పెట్టింది.  టుయోనో 457 స్పెషల్ ఎడిషన్ పేరుతో విడుదల అయ్యింది. పాత మోడల్‌తో పెద్దగా తేడా కనిపించకపోయినా, కొత్త బ్లాక్ కలర్, డీకాల్స్ మాత్రమే మార్చి రిలీజ్ చేసింది కంపెనీ. ప్రత్యేకంగా రైడింగ్ కంఫర్ట్, సీటు, హ్యాండిల్‌ బార్, సస్పెన్షన్ విషయంలో చేసిన అప్‌డేట్స్ కొత్త స్పెషల్ ఎడిషన్‌ను మరింత క్రేజీ బైక్‌ గా మార్చే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి.

కొత్త మాంబా బ్లాక్ కలర్

టుయోనో 457 స్పెషల్ ఎడిషన్‌ లో ఆకట్టుకునేది  మాంబా బ్లాక్ కలర్. ఈ కొత్త కలర్ స్కీమ్ బైక్‌కు మరింత స్పోర్టీ, అగ్రెసివ్ లుక్ ఇస్తుంది. ఛాసిస్, స్వింగ్‌ఆర్మ్‌ ను కూడా బ్లాక్ ఫినిష్‌లో అందించారు. అంతేకాకుండా, డీకాల్స్‌ను కూడా అప్‌డేట్ చేశారు. పాత ప్యూమా గ్రే కలర్‌తో పోలిస్తే కొత్త స్పెషల్ ఎడిషన్ కొంచెం భిన్నమైన స్టైల్‌ను అందిస్తుంది. భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ ఎడిషన్ విజువల్‌ గా కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది.

సీటులో మార్పులు.. మరింత కంఫర్ట్

Advertisement

కొత్త మోడల్‌ లో ముఖ్యమైన అప్‌డేట్లలో ఒకటి సీటు. పాత టుయోనో 457తో పోలిస్తే కొత్త సీటులో అదనపు ప్యాడింగ్ ఇచ్చారు. ఎక్కువ సమయం బైక్‌పై ప్రయాణించే వారికి మరింత సౌకర్యం కలిగేలా సీటు ప్రొఫైల్‌లో కూడా మార్పులు చేశారు. ఈ మార్పుల కారణంగా సీటు ఎత్తు 10mm పెరిగింది. ఇప్పుడు దీని సీటు ఎత్తు 810mmగా ఉంది. కొంతమందికి ఈ ఎత్తు పెరగడం చిన్న మార్పుగా అనిపించినా, సీటు కంఫర్ట్ పెరగడం మాత్రం లాంగ్ రైడ్‌లకు ఉపయోగకరంగా ఉంటుంది.

హ్యాండిల్‌బార్, లివర్‌ లో అప్‌డేట్స్

హ్యాండిల్‌బార్  లో మార్పులతో రైడింగ్ పొజిషన్ కొంత మెరుగుపడే అవకాశం ఉంది. అలాగే బ్రేక్ లివర్‌ను ఇప్పుడు అడ్జస్ట్ చేసుకునే సౌకర్యం ఇచ్చారు. అయితే క్లచ్ లివర్ మాత్రం అడ్జస్టబుల్ కాదు. హెడ్‌ లైట్ పైన చిన్న ఫ్లై స్క్రీన్‌ను కూడా స్టాండర్డ్‌ గా అందిస్తున్నారు. ఇది ప్రధానంగా బైక్ అందాన్ని పెంచే అంశంగానే కనిపిస్తుంది.

సస్పెన్షన్‌ లో కీలక మార్పు

Advertisement

స్పెషల్ ఎడిషన్‌ లో అత్యంత ముఖ్యమైన మార్పు సస్పెన్షన్‌కు సంబంధించినది. పాత మోడల్‌ లో ఉన్న సస్పెన్షన్ సెటప్ కొంతమంది రైడర్లకు కాస్త గట్టిగా అనిపించింది. ఈ ఫీడ్‌ బ్యాక్‌ ను పరిగణనలోకి తీసుకున్న ఏప్రిలియా, కొత్త ఎడిషన్‌లో సస్పెన్షన్‌ను కొంచెం మృదువుగా మార్చింది. ముందు భాగంలో డాంపింగ్, స్ప్రింగ్ ప్రీలోడ్ రెండింటినీ సాఫ్ట్ చేశారు. వెనుక భాగంలో కూడా కంప్రెషన్ డాంపింగ్, స్ప్రింగ్ ప్రీలోడ్‌ను మార్చారు. అయితే, రీబౌండ్ డాంపింగ్ మాత్రం పాత మోడల్ మాదిరిగానే కొనసాగుతోంది.

ధర ఎంత?  

కొత్త టుయోనో 457 స్పెషల్ ఎడిషన్ ధర రూ.3.99 లక్షలు ఎక్స్-షోరూమ్. పాత మోడల్‌తో పోలిస్తే కేవలం రూ.2,000 మాత్రమే ఎక్కువ. ఇంజిన్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇందులో అదే 457cc, ట్విన్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ను కొనసాగించారు. ఇది 47.6hp పవర్, 43.5Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

Read Also: కెమెరా లేదు.. వైర్లు లేవు.. డ్రైవర్‌ కు నిద్రొస్తే సీటే కనిపెట్టేస్తుంది!

Tags

Related News

కెమెరా లేదు.. వైర్లు లేవు.. డ్రైవర్‌ కు నిద్రొస్తే సీటే కనిపెట్టేస్తుంది!

సర్వీస్ సెంటర్‌కు షాక్.. ఇంట్లోనే EV బ్యాటరీని రిపేర్ చేసిన ఇంజనీరింగ్ విద్యార్థి!

కియా సూపర్ సర్‌ ప్రైజ్.. ఏకంగా 8 ఎలక్ట్రిఫైడ్ మోడళ్లు వచ్చేస్తున్నాయ్!

టెస్లాకు చైనా షాక్.. 43 లక్షల కార్ల రీకాల్, అసలేం జరిగిందంటే?

చక్రాలు లేకుండా పరుగులు.. 4 కాళ్లతో నడిచే హైడ్రోజన్ రోబోట్ వచ్చేస్తోంది!

ఆర్మీ సిబ్బందికి అదిరిపోయే ఆఫర్.. CSD ద్వారా ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు!

చక్రాల్లోనే మోటార్లు.. సైన్స్ ఫిక్షన్ లాంటి బైక్.. హోండా ఈవీ డిజైన్ కు ప్రపంచం ఫిదా!

Big Stories

Advertisement
×