E-Paper
Advertisement

మ్యాప్ నేవిగేషన్ సపోర్ట్‌తో బోట్ కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్.. ధర ఎంతంటే?

మ్యాప్ నేవిగేషన్ సపోర్ట్‌తో బోట్ కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్.. ధర ఎంతంటే?
Advertisement

boAt Storm Call 3 smartwatch: ప్రస్తుత ట్రెండ్‌లో స్మార్ట్‌ వాచ్‌లను వాడటం అనేది ఒక ఫ్యాషన్‌గా మారడమే కాకుండా.. మన ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు చూసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతోంది. అయితే తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు అందించడంలో బోట్ సంస్థ ఎప్పుడూ ముందుంటుంది. ఆ కోవకే చెందిన boAt Storm Call 3 ప్రస్తుతం మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. సుమారు రూ.1,099 ధరతో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ వాచ్ అందించే ముఖ్యమైన ఫీచర్లు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

డిజైన్, డిస్‌ప్లే:

ఈ స్మార్ట్‌ వాచ్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, మోడర్న్‌గా ఉంటుంది. దీనిలో ఇచ్చిన పెద్ద హెచ్‌డీ డిస్‌ప్లే క్లియర్ విజువల్స్‌ను అందిస్తుంది. ఎండలో.. బయటికి వెళ్లినప్పుడు కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీని టచ్ రెస్పాన్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది. అలాగే.. వాటర్ , డస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉండటం వల్ల వర్షంలో తడిచినా లేదా చెమట పట్టినా వాచ్ పాడవుతుందనే టెన్షన్ ఉండదు.

అడ్వాన్స్‌డ్ బ్లూటూత్ కాలింగ్ :

Advertisement

ఈ బడ్జెట్ రేంజ్‌లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ లభించడం ఈ వాచ్‌లోని అతిపెద్ద ప్లస్ పాయింట్. వాచ్‌లోనే ఇన్‌బిల్ట్ మైక్, స్పీకర్ ఉండటం వల్ల ఫోన్ జేబులో నుంచి తీయకుండానే నేరుగా వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడొచ్చు. క్రిస్టల్ క్లియర్ ఆడియో క్వాలిటీతో అవతలి వారి మాటలు స్పష్టంగా వినిపిస్తాయి.

టర్న్-బై-టర్న్ మ్యాప్ నేవిగేషన్ :

ఈ ప్రైస్ రేంజ్‌లో వచ్చే చాలా వాచ్‌లలో లేని అద్భుతమైన ఫీచర్ ఇందులో ఉంది. బోట్ క్రీస్ట్ యాప్ సపోర్ట్‌తో పనిచేసే ఈ వాచ్, మ్యాప్ నేవిగేషన్‌ను సపోర్ట్ చేస్తుంది. మనం ఎడారికి లేదా కొత్త ప్రదేశాలకు వెళ్లేటప్పుడు డైరెక్షన్స్ చూసుకోవడానికి ఇది ఎంతగానో సహాయ పడుతుంది.

హెల్త్ ,ఫిట్‌నెస్ ట్రాకింగ్ :

Advertisement

ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టే వారికి ఈ స్మార్ట్‌ వాచ్ ఒక మంచి గైడ్ లా పని చేస్తుంది. దీనిలో 24 గంటలూ పనిచేసే హార్ట్ రేట్ మానిటర్, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను గుర్తించే.. SpO2 సెన్సార్ ఉన్నాయి. వీటితో పాటు స్లీప్ మానిటర్, స్ట్రెస్ ట్రాకర్ , వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్స్ దీనిలో అందుబాటులో ఉన్నాయి.

Also Read: చిన్న కిచెన్ల కోసం బెస్ట్ సోలో.. మైక్రోవేవ్ ఓవెన్ !

బ్యాటరీ బ్యాకప్ , వాల్యూ ఫర్ మనీ :

ఈ వాచ్‌లో పవర్ ఫుల్ బ్యాటరీని అందించారు. సాధారణ వాడకంపై ఇది బ్లూటూత్ కాలింగ్‌తో కలిపి మంచి బ్యాటరీ.. బ్యాకప్‌ను ఇస్తుంది. మార్కెట్లో లభించే ఇతర బ్రాండ్లతో పోలిస్తే..బోట్ స్టార్మ్ కాల్ 3 ధర చాలా తక్కువగా ఉంది. కేవలం రూ.1,099 ధరకే ఇన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు లభించడం నిజంగా గొప్ప విషయమని చెప్పొచ్చు.

మీరు తక్కువ బడ్జెట్‌లో.. స్టైలిష్ లుక్, కాలింగ్ ఫీచర్ , మ్యాప్ నేవిగేషన్ వంటి అడ్వాన్స్‌డ్ ఆప్షన్స్ ఉన్న మంచి స్మార్ట్‌ వాచ్ కోసం చూస్తున్నట్లయితే.. ఈ మోడల్ నిరభ్యంతరంగా కొనొచ్చు. ఇది మీ డబ్బుకు వంద శాతం న్యాయం చేసే బెస్ట్ బడ్జెట్ గాడ్జెట్!

Related News

టెక్కీలకు పండగే.. ఒకేసారి మల్టిపుల్ డివైజ్ ఛార్జ్ చేసే షావోమి పవర్ బ్యాంక్!

ఫోన్ అప్‌డేట్ చేయకపోతే వాట్సప్ గోవిందా.. సీక్రెట్‌గా టెస్టింగ్ మొదలుపెట్టిన మెటా సంస్థ!

అమెజాన్ పండగు సేల్ షురూ.. ఐఫోన్, శాంసంగ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై కళ్లుచేదిరే డిస్కౌంట్లు!

కిడ్స్ సేఫ్టీ కోసం మెటా మాస్టర్ ప్లాన్..హానికరమైన లింక్స్, ఫేక్ యాడ్స్ మాయం!

గూగుల్ మ్యాప్స్‌లో రంగుల గుట్టు ఇదే.. హాస్పిటల్ నుంచి హోటల్ వరకు ఎలా గుర్తించాలో తెలుసా?

120 ఇంచుల బిగ్ స్క్రీన్ మ్యాజిక్..కొత్త లుమియో ఆర్క్ 7 ప్రొజెక్టర్‌తో ఇల్లే థియేటర్!

రూ.30,000 తగ్గిన OLED టీవీ ధరలు.. ఉచితంగా రూ.12,500 సౌండ్‌బార్ కూడా!

అమెజాన్ సేల్..ఐఫోన్,వన్‌ప్లస్ ఫోన్లపై ఊహించని తగ్గింపు!

Big Stories

Advertisement
×