E-Paper
Advertisement

ఇరుముడి హిట్టు వెనుక రవితేజకు ఇంత లాభమా?

ఇరుముడి హిట్టు వెనుక రవితేజకు ఇంత లాభమా?
Advertisement

Ravi Teja Remuneration for Irumudi:ఇరుముడి.. ఇరుముడి.. ఇరుముడి.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఇరగదీస్తుండటంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై శివనిర్వాణ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన ఇరుముడి సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది, తండ్రి కూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో అయ్యప్ప స్వామి దీక్ష బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాథియేటర్ లో కాసుల వర్షం కురిపిస్తుంది.

ఇక ఈ సినిమా వారంలోపే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడంతో మురిసిపోతున్నారు మాస్ మహారాజా ఫ్యాన్స్.ఈ క్రమంలోనే ఇరుముడి సినిమాకి రవితేజ ఎంత పుచ్చుకున్నాడు అన్న వార్తలు ఇప్పుడ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి .

రవితేజ అందుకున్న పారితోషికం

Advertisement

ఇక ఈ సినిమాకి గాను రవితేజ అందుకున్న పారితోషికం విషయానికి వస్తే ..ఈ సినిమాకి కేవలం దాదాపు 10 కోట్ల రూపాయల లోపలే తీసుకున్నాడని తెలుస్తుంది.అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్నటాక్ ప్రకారం సినిమా హిట్ అయితే నైజాం ఏరియాలో వచ్చిన లాభాల్లో వాటాన్ని తీసుకోబోతున్నాడట రవితేజ.అయితే ఇది అఫీషియల్ గా కన్ఫామ్ చేసిన వార్త కాకపోవడంతో నిజానిజాలేంటా ఎని ఆరాలు తీస్తున్నారు మూవీ లవర్స్.

శివ నిర్వాణ తన పారితోషికంగా

ఇక ఈ సినిమాని తెరకెక్కించిన శివ నిర్వాణ తన పారితోషికంగా దాదాపు 5కోట్ల లోపల అందుకున్నాడని సమాచారం .ఇక ఈ సినిమాలో నటించిన ప్రియా భవాని శంకర్ కావేరి పాత్రలో ఎలా అదరగొట్టిందో తెలిసింది. అందుకు గాను ఈ భామకి దాదాపు కోటి రూపాయల వరకు పారితోషికం ముట్ట చెప్పినట్టు తెలుస్తుంది .

Advertisement

ఇక మానెమ్మ పాత్రలో అందర్నీ అలరించి మెప్పించిన బేబీ నక్షత్ర ఈ సినిమా కోసం దాదాపు 9లక్షల వరకు తీసుకుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఆధారంగానే చెబుతున్న అంకెలు. మరి వీటిలో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో మేకర్స్ చెబితే గాని తెలియదు .

ఆరు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో

ఇక ఇరుముడి సినిమా విషయానికి వస్తే ఆరు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిన ఈ సినిమా ఇప్పుడు ఏకంగా 150 కోట్లవైపు పరుగులు తీస్తుండటంతో వచ్చే వారంలో ఏకంగా 200 కోట్ల క్లబ్ లోకి చేరుతుందా అంటూ లెక్కలు వేస్తున్నారు ట్రేడ్ పండితులు .

also read :ఇరుముడి తర్వాత రవితేజ చేయబోయే సినిమాలివేనా ?
మొన్న రిలీజ్ అయిన టాక్సిక్ డివైడ్ టాక్ తెచ్చుకోవడం, అలాగే ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలు సో సో గా ఉండటంతో ఇరుముడి సినిమా ఈజీగా 200 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కావాల్సిందల్లా ఇప్పుడున్న థియేటర్లోని హోల్డ్ చేసుకొని వస్తున్న టాక్ ని అలాగే కంటిన్యూ చేసుకోవడమే. మొత్తానికి ఆరు డిజాస్టర్స్ తర్వాత రవితేజకి ఇరుముడి సినిమాతో ఎట్టకేలకి సక్సెస్ అందించాడు శివనిర్వాణ.

ఇదే కథని గతంలో నాగచైతన్యకి

ఇక ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇదే కథని గతంలో నాగచైతన్యకి చెప్పాడట శివనిర్వాణ. అయితే తనకున్న బిజీ షెడ్యూల్స్ కారణంగా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయాడు చైతు.
ఏదేమైనా చైతు డేట్స్ ఇవ్వకపోవడం రవితేజ కి బాగా కలిసి వచ్చింది అన్నమాట. చూడాలి ముందు ముందు రవితేజ ఈ సక్సెస్ నిలబెట్టుకుంటాడో.

also read :200 కోట్ల టార్గెట్.. ఇరుముడి రీచ్ అవుతుందా?

ఏది ముందు పట్టాలు ఎక్కుతుందో!

ఇక ఇక వినిపిస్తున్న టాక్ ప్రకారం రవితేజ హసిత్ గోలి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమాకి కమిటీ కాగా, మరోవైపు వివేక్ ఆత్రేయతో శిరీష్ ప్రొడ్యూసర్ గా మరో సినిమాని పట్టాలెక్కించబోతున్నాడట .ఇక వీరిద్దరితోపాటు మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమా ఉందని తెలుస్తుంది దానిపై క్లారిటీ రావాలి. చూడాలి వీటిలో ఏది ముందు పట్టాలు ఎక్కుతుందో!

Tags

Related News

కడుపు నిండిపోయింది.. ఫౌజీ హీరోయిన్ కు ఫుడ్ పంపి సర్‌ప్రైజ్ చేసిన ప్రభాస్!

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి… ఇంట గెలవలేనమ్మ రచ్చ గెలిచేనా?

ఒకప్పుడు గరివిడి లక్ష్మి అంటే పూనకాలే.. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో తెలుసా?

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!

Big Stories

Advertisement
×