SriDevi Drama Company Show: బుల్లితెరపై ‘ఎక్స్‌ప్రెషన్స్ కింగ్’ అని పేరు తెచ్చుకుని, జబర్దస్త్ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో అలరించిన కమెడియన్ బాబు ఇప్పుడు దర్శకుడిగా మారారు. ఇటీవల ఈటీవీ విన్ మరియు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను మెప్పించిన ఆయన, ఓ ఇంటర్వ్యూలో టీవీ షోల రెమ్యూనరేషన్ల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ ప్రమోషన్లలో ఆయన పంచుకున్న విశేషాలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆ విశేషాలు చూద్దాం..
టీవీ షోలలో రెమ్యూనరేషన్ల గురించి బాబు మాట్లాడుతూ.. “శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఒక స్కిట్ రాస్తే రచయితగా రూ. 20,000 ఇస్తారు. అదే స్కిట్‌లో నటుడిగా చేస్తే రూ. 10,000 ఇస్తారు. అంటే రోజుకి రూ. 30 వేల వరకు సంపాదించవచ్చు” అని తెలిపారు. అయితే ఈ సంపాదన ప్రతిరోజూ ఉండదని, వారానికి ఒకసారి షూటింగ్ ఉన్నప్పుడే వస్తుందని వివరించారు. తనకు తెలిసిన డైరెక్టర్లు ఉండటం వల్ల స్క్రిప్ట్ రాయడంతో పాటు నటించే అవకాశం కూడా లభించిందని చెప్పారు.
బయట ఈవెంట్లు, షోలకు ఎందుకు వెళ్లరనే ప్రశ్నకు బాబు ఎంతో నిజాయితీగా సమాధానమిచ్చారు. “నా ముఖం అందరికీ పరిచయమే.. కానీ నా పేరు మాత్రం పెద్దగా ఎవరికీ తెలియదు. ఇటీవల హీరో శ్రీవిష్ణు ఓ ప్రమోషన్‌లో కలిసినప్పుడు కూడా నన్ను చూసి గుర్తుపట్టారు కానీ పేరు తెలియలేదు. అందుకే నన్ను బయట ప్రోగ్రామ్‌లకు ఎవరూ పిలవరు. ఇక కరోనాకు ముందు వరకు నా పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నా, కరోనా తర్వాత నెలకి రూ. 50 వేలు రావడం స్టార్ట్ అయ్యాక ఆర్థికంగా స్థిరపడ్డాను” అని తెలిపారు.
జబర్దస్త్‌లో కేవలం రైటర్‌గా కెరీర్ ప్రారంభించిన బాబు, ఆ తర్వాత ‘పోవే పోరా’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వంటి ప్రముఖ షోలకు వందల ఎపిసోడ్లకు రచయితగా పనిచేశారు. కమెడియన్‌గానూ నవ్వించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ అనుభవంతోనే ఇప్పుడు ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే వెబ్ సిరీస్‌తో మెగాఫోన్ పట్టి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా ఎదిగారు.
also read:బిగ్ బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. చరణ్, అపూర్వ ఔట్!
వైవా హర్ష, జీవన్ కుమార్, హైపర్ ఆది, ఐశ్వర్య హోలక్కల్ ముఖ్య పాత్రల్లో సాఫ్ట్‌వేర్ కంపెనీ మరియు బ్యాచిలర్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ కామెడీ అండ్ ఎమోషనల్ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సిరీస్ అందించిన ఉత్సాహంతో త్వరలోనే వెండితెరపై ఒక పూర్తి స్థాయి సినిమాను కూడా డైరెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు బాబు ప్రకటించారు.
ఇక మొత్తానికి, జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలు ఎంతోమంది టాలెంటెడ్ నటులకు, రచయితలకు మంచి భవిష్యత్తును అందించాయని బాబు ఉదాహరణ నిరూపిస్తోంది. కష్టపడి రైటర్‌గా, యాక్టర్‌గా నిరూపించుకుని ఈరోజు దర్శకుడిగా మారిన బాబు ప్రయాణం నిజంగా అభినందనీయం. రాబోయే రోజుల్లో ఆయన తెరకెక్కించే సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద గొప్ప విజయాన్ని సాధించాలని ఆశిద్దాం..