Ravichandran Ashwin on Dravid vs Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ గా ఉన్నప్పుడు టీమిండియా చాలా బలంగా కనిపించేదని వెల్లడించారు. అతని హయాంలో టీమిండియా ప్లేయర్లు ప్రశాంతంగా నిద్రపోయేవారు అని గుర్తు చేశారు. నెట్ బౌలర్ కూడా రిలాక్స్ గా ఉండేవాడని తెలిపారు. కానీ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత, టీమిండియా పరిస్థితులు గందరగోళంగా మారిపోయాయని బాంబు పేల్చారు. ప్లేయర్లకు అసలు మనశ్శాంతి కూడా ఉండడం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జట్టు పరిస్థితి చిందర వందరగా మారిపోయిందని మండిపడ్డారు. ఏ ఒక్క ఆటగాడికి జట్టులో భద్రత లేదని ఆరోపించారు. కెప్టెన్లకు కూడా తుది జట్టులో స్థానంపై షూరిటీ లేకుండా చేశాడని ఫైర్ అయ్యారు. దీంతో గౌతమ్ గంభీర్ పై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ప్రశాంతంగా ఉన్న టీమిండియాలో అలజడి రేపింది హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అంటూ రవిచంద్రన్ అశ్విన్ హాట్ కామెంట్స్ చేశారు. 2024 టీ20 ప్రపంచ కప్ అందించిన రోహిత్ శర్మకు వన్డే కెప్టెన్సీ లేకుండా గౌతమ్ గంభీర్ కుట్రలకు తెరలేపినట్టు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తన శిష్యుడు శుభమాన్ గిల్ కు వన్డే కెప్టెన్సీ ఇచ్చాడని ఫైర్ అయ్యారు. అలాగే, 2026 T20 ప్రపంచ కప్ అందించిన సూర్య కుమార్ యాదవ్ ను కూడా పక్కకు పెట్టి… అతడి కెరీర్ ను నాశనం చేశాడని సీరియస్ అయ్యారు. శ్రేయస్ అయ్యర్ ను తీసుకువచ్చి మరో వివాదానికి తెరదించాడని ఫైర్ అయ్యారు. అలాగే టీమిండియాలో ఉన్న సీనియర్లను పక్కకు పెట్టి కొత్త కుర్రాలను తీసుకొస్తున్నాడని ఆగ్రహించారు.
మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ సిరాజ్ లాంటి వాళ్లను పక్కకు పెట్టి తీరని అన్యాయం చేస్తున్నాడని అశ్వన్ మండిపడ్డారు. గౌతమ్ గంభీర్ చర్యల కారణంగా చాలా మంది క్రికెటర్లు టీమిండియాలో అవకాశాలు దక్కక రిటైర్మెంట్ ప్రకటించారని బాంబు పేల్చారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే టీమిండియా జట్టును అంగట్లో అమ్మేస్తాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గౌతమ్ గంభీర్ దూకుడుకు బీసీసీఐ బ్రేకులు వేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే టీమిండియా సర్వనాశనం కావడం గ్యారెంటీ అంటూ హెచ్చరించారు. దీంతో ఒక గౌతమ్ గంభీర్ పై రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.