Kuberaa film: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన వారిలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula)ఒకరు. గతపాతిక సంవత్సరాలుగా ఈయన ఇండస్ట్రీలో కొనసాగుతూ చేసింది చాలా తక్కువ సినిమాలు అయినప్పటికీ ఎంతో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమాని చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారు వరకు చూసే విధంగా ఉంటాయి. అంత అద్భుతంగా, విభిన్న జానర్ లో శేఖర్ కమ్ముల సినిమాలు ఉంటాయని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఈయన కుబేర(Kuberaa) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జూన్ 20 వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
బెగ్గర్ గా ధనుష్..
ఈ సినిమా తెలుగు తమిళ హిందీ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని భాషలలో కూడా మంచి ఆదరణ, అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ధనుష్ (Danush)రష్మిక(Rashmika) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో హీరో ఒక బెగ్గర్(Begger) పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ధనుష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాలో నాగార్జున(Nagarjuna) క్యామియో పాత్రలో నటించడం ఆయన పాత్రకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడం జరిగింది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో శేఖర్ కమ్మలు కూడా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు
క్రెడిట్ మొత్తం ధనుష్.. నాగార్జునకే..
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయనకు చిరంజీవి(Chiranjeevi) గారి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. సాధారణంగా చిరంజీవి కొత్తవారిని ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారనే సంగతి మనకు తెలిసిందే. ఏదైనా ఒక సినిమా విడుదలైన ఆ సినిమా గురించి తన రివ్యూ ఇస్తూ చిత్ర బృందాన్ని అభినందిస్తూ ఉంటారు. ఇక చిరంజీవి రివ్యూ ప్రతి ఒక్క సన్నివేశం గురించి ఎంతో క్లుప్తంగా వివరిస్తూ ఇస్తారు. దీంతో కుబేర సినిమాకు చిరంజీవి గారు ఎలాంటి రివ్యూ ఇచ్చారనే శేఖర్ కమ్ములకు ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు శేఖర్ కమ్ముల సమాధానం చెబుతూ.. స్టోరీ అద్భుతంగా ఉందని నన్ను మెచ్చుకున్నారు. కానీ ఎక్కువగా ధనుష్ నాగార్జున పాత్ర గురించే చిరంజీవి గారు మాట్లాడారని తెలిపారు.
చిరంజీవితో శేఖర్ కమ్ముల సినిమా?
ఈ సినిమాలో ధనుష్ నటన గురించి చిరంజీవి పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. అతని పర్ఫామెన్స్ మాటలలో వర్ణించలేనిదని, ధనుష్ తో పాటు నాగార్జున పెర్ఫార్మెన్స్ పై కూడా చిరంజీవి ప్రశంసలు కురిపించాలని శేఖర్ కమ్ముల తెలిపారు. కథ వరకు మాత్రమే నన్ను పొగిడినా, ధనుష్ నాగార్జున పై మాత్రం ప్రశంసలు కురిపించినట్టు శేఖర్ కమ్ముల తెలిపారు. చిరంజీవి గారి అభిమాని అయిన శేఖర్ కమ్ముల అతనితో సినిమా చేసే ఛాన్స్ ఉందా అంటూ కూడా ప్రశ్న ఎదురయింది. దీంతో శేఖర్ కమ్ముల సమాధానం చెబుతూ… చిరంజీవి గారికి అనువైన కథ దొరికితే ఆయన అవకాశం ఇస్తే తప్పకుండా సినిమా చేస్తానని కూడా తెలియజేశారు. మరి శేఖర్ కమ్ములకు చిరంజీవి ఛాన్స్ ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Samantha -Keerthy Suresh: నాలా చెయ్యకు.. కీర్తి సురేష్‌కు సమంతా టిప్స్.. పెళ్లి తర్వాత ఫస్ట్ టైమ్!