Hero Darshan: అభిమాని రేణుకా స్వామి (Renuka Swamy) హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే . దాదాపు ఏడాది క్రితం జరిగిన ఈ ఘటన అభిమానులనే కాదు యావత్తు సినీ ప్రేమికులను, సెలబ్రిటీలను, ప్రజలను కూడా ఆశ్చర్యంలో ముంచేసింది. సంసారం బాగుండాలని చెప్పిన ఒక అభిమాని పైనే ఇలా కక్ష కట్టి సుఫారీ ఇచ్చి మరీ హతమార్చడం సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో కన్నడ హీరో దర్శన్ గత ఏడాది కాలంగా నరకం అనుభవిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు మరొకసారి ఈయన అరెస్ట్ అయ్యారు. ఆయనతో పాటు ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ (Pavitra Gowda) కూడా అరెస్టు అవ్వడం గమనార్హం.
దర్శన్ బెయిల్ రద్దు.. పోలీసులు అరెస్ట్..
అసలు విషయంలోకి వెళ్తే.. అభిమాని రేణుక స్వామిని హత్య చేసిన కేసులో గత ఏడాది జూన్ 11వ తేదీన హీరో దర్శన్, నటి పవిత్ర గౌడ తోపాటు ఈ హత్యలో పాల్గొన్న 15 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.. అయితే అనారోగ్య కారణాలతో బెయిల్ మీద బయటకు వచ్చిన దర్శన్ కి.. గత ఏడాది డిసెంబర్ 13వ తేదీన కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బెంగళూరు పోలీసులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. నేడు జరిగిన విచారణలో హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ వెంటనే దర్శన్ ను అదుపులోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. దాంతో పోలీసులు ఆయనను అదుపులో తీసుకున్నారు.
పవిత్ర గౌడని అరెస్టు చేసిన పోలీసులు..
ఇప్పుడు పవిత్ర గౌడని కూడా అరెస్టు చేయడం జరిగింది. రేణుక స్వామి హత్య కేసులో A1 నిందితురాలు అయిన పవిత్ర గౌడ కి కూడా సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. తక్షణమే ఆమె బయలు రద్దు చేసి అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఇక సుప్రీంకోర్టు న్యాయస్థానం ఆదేశాలతో పోలీసులు పవిత్ర గౌడను అదుపులోకి తీసుకున్నారు. అటు దర్శన్ ను అరెస్టు చేసిన కొద్దిసేపటికే పోలీసులు ఆర్ఆర్ నగర్ లో ఉన్న ఆమె ఇంటికి వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అభిమానిని హత్య చేయడానికి కారణం..
ఇకపోతే హీరో దర్శన్ కి ఆల్రెడీ పెళ్లయింది. పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆయన ప్రముఖ నటి పవిత్ర గౌడతో ఎఫైర్ పెట్టుకున్నారనే వార్తలు వచ్చాయి. కానీ ఆధారాలు లేవు. అయితే పదేళ్ల రిలేషన్ తర్వాత పవిత్ర గౌడ తమ బంధానికి పదేళ్లు అంటూ దర్శన్ తో ఉన్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడంతో చిత్రదుర్గాకు చెందిన రేణుక స్వామి అనే ఒక అభిమాని.. పవిత్ర గౌడ కి అశ్లీల మెసేజ్లు, అభ్యంతరకర మెసేజ్లు పెడుతూ దర్శన్ ను వదిలేయాలని కామెంట్లు చేశారట. దీంతో కక్ష కట్టి దర్శన్ తో కలిసి సుఫారీ ఇచ్చి 15 మంది వ్యక్తులతో రేణుక స్వామిని హత్య చేయించారు. ఇక ఈ కేసులోనే ఇప్పుడు మళ్లీ జైలుకెళ్లారు వీరిద్దరూ.
Kannada actor #DarshanThoogudeepa's friend #PavithraGowda on Thursday was arrested by the #BengaluruPolice after the #SupremeCourt cancelled her bail in connection to the #RenukaswamyMurderCase.pic.twitter.com/dlEovoXxFT https://t.co/y6tgvcfOep
— Hate Detector 🔍 (@HateDetectors) August 14, 2025
also read: Aamir Khan: ఓన్లీ 50 రూపాయలే… అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన అమీర్ ఖాన్!