E-Paper
Advertisement

Peddamma Temple: పెద్దమ్మ గుడి కూల్చివేతపై హైకోర్టు కీలక ఆదేశాలు..

Peddamma Temple: పెద్దమ్మ గుడి కూల్చివేతపై హైకోర్టు కీలక ఆదేశాలు..
Advertisement

Peddamma Temple: హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్డు నెం.12 లో పెద్దమ్మ గుడి కూల్చివేతపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని భద్రంగా భద్రపరచాలని ఆదేశించింది. పెద్దమ్మ తల్లి విగ్రహం కూల్చివేతపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ -12 లో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయం కూల్చివేత ఘటన జులై నెలలో జరిగింది. షేక్ పేట్ మండల రెవిన్యూ అధికారులు రోడ్డు విస్తరణ కోసం ఈ ఆలయాన్ని కూల్చివేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదంగా మారింది. హిందూ సంఘాలు, స్థానిక భక్తులు, హిందువులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం చేసిన కుట్రగా సంచలన ఆరోపణలు చేసిన సందగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఓట్లు సంపాదించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

ALSO READ: Indian Railway: రైల్వేలో 2418 ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండా ఉద్యోగ నియామకం

ఈ కూల్చివేత ఘటనపై హిందూ సంఘాలు, సినీ నటి కరాటే కల్యాణి వంటి ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జులై 29న ఈ ఆలయం వద్ద జరిగిన నిరసనల సందర్భంగా పోలీసులు భక్తులను అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆలయాన్ని పునర్నిర్మించాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని హిందు సంఘాలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని, విచారణకు సంబంధించిన సర్టిఫికెట్స్ ను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆగస్టు 18న జరిగే తదుపరి విచారణలో ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, చట్టపరమైన అనుమతులు, రాజకీయ ఆరోపణలపై స్పష్టత రానుంది. ఈ కేసు రాష్ట్రంలో రాజకీయ, సామాజిక ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.

Advertisement

ALSO READ: Indian Navy: టెన్త్, ఐటీఐ పాసైతే చాలు.. ఇండియన్ నేవీలో ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.. బంగారు భవిష్యత్తు

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×