E-Paper
Advertisement

రిటైర్డ్ IPS భార్య హత్య కేసుపై RGV కన్ను: ‘నేపాలీ గ్యాంగ్స్’ కథతో నెక్స్ట్ సినిమా?

రిటైర్డ్ IPS భార్య హత్య కేసుపై RGV కన్ను: ‘నేపాలీ గ్యాంగ్స్’ కథతో నెక్స్ట్ సినిమా?
Advertisement

RGV Movie: రామ్‌గోపాల్ వర్మ…సమాజంలో జరిగే సెన్సేషనల్ క్రైమ్స్, రియల్ లైఫ్ డ్రామాలను తనదైన శైలిలో స్క్రీన్ మీదకు తీసుకురావడంలో ఈయనకి వెన్నతో పెట్టిన విద్య. గతంలో రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో ‘పరిటాల రవి’ కథతో ‘రక్తచరిత్ర’ తీసినా, ఆ తర్వాత రాజకీయ పరిణామాల ఆధారంగా ‘రక్తచరిత్ర 2’, అలాగే చంద్రబాబు, ఎన్టీఆర్ లైఫ్స్ చుట్టూ తిరిగే వివాదాస్పద కథలను ఫిక్షనైజ్ చేసి థియేటర్లలోకి తెచ్చినా అది ఆర్జీవీకే చెల్లింది.

ఇప్పుడు హైదరాబాద్‌ను షేక్ చేస్తున్న నేపాలీ ముఠాల ఆగడాలు, వాళ్ల వెనుక ఉన్న అంతర్జాతీయ లింకులు వర్మను విపరీతంగా ఎట్రాక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కాన్సెప్ట్‌కు సంబంధించి ఒక పక్కా స్క్రిప్ట్ పాయింట్ కోసం వర్మ అండ్ టీమ్ డీప్ గా రీసెర్చ్ చేస్తోందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆ ‘ప్రతిజ్ఞ’ గుర్తుంది కదా ఆర్జీవీ..

Advertisement

గతేడాది రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక  పోస్ట్ గుర్తే ఉండే ఉంటుంది. తనను తాను తిట్టుకుంటూ, కాస్త ఎమోషనల్‌గా ఆయన పెట్టిన పోస్ట్ అప్పట్లో పెద్ద దుమారమే లేపింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత తను దర్శకత్వం వహించిన క్లాసిక్ కల్ట్ మూవీ ‘సత్య’ను మళ్లీ చూశానని, అంతటి అద్భుతమైన సినిమాను తర్వాతి కాలంలో ఎందుకు బెంచ్ మార్కుగా పెట్టుకోలేకపోయా అనే అర్థం వచ్చెట్టుగా లో కన్నీళ్లు కార్చాడు. తనకు బుద్ధొచ్చిందని, పూర్తి జ్ఞానోదయం కలిగిందని ప్రకటిస్తూ.. ఇకపై తన  ప్రతిభకు తగ్గట్టుగా, తన పాత గౌరవాన్ని మళ్లీ తిరిగా తీసుకువచ్చేలా గొప్ప సినిమాలు మాత్రమే తీస్తానంటూ ఆర్జీవీ ప్రతిజ్ఞ చేశాడు.
Also read :షాకింగ్ ట్విస్ట్.. వారణాసి నుండి వైజాగ్‌కు మారిన మహేష్ బాబు సీన్స్..?
కానీ ఆ తర్వాత రోజులు గడిచేకొద్దీ వర్మ మళ్లీ తన పాత పంథాలోనే సినిమాలు అనౌన్స్ చేస్తూ వెళ్లాడు. ఆ స్టేట్‌మెంట్‌ను ఆయనే మరిచిపోయినట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సరిగ్గా అదే టైమ్‌లో మాఫియా, క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో ‘సిండికేట్’ అనే ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు. అంతకంటే ముందు కూడా కొన్ని డిఫరెంట్ టైటిల్స్‌తో సినిమాలు అనౌన్స్ చేస్తూ వచ్చాడు కానీ, వాటిలో ఏ ఒక్కటీ కూడా ఇప్పటివరకు ప్రాక్టికల్‌గా సెట్స్ మీదకి వెళ్ళలేకపోయాయి.

ఈసారైనా మేకింగ్ మారుతుందా?

అయితే నేపాలీ గ్యాంగ్స్ స్టోరీలో ఆర్జీవీ మార్క్ రా సిఐడి తరహా ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. నమ్మకం, మోసం, పక్కా స్కెచ్, అర్ధరాత్రి హత్యలు.. ఇలాంటి డార్క్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌లను హ్యాండిల్ చేయడంలో వర్మది ఒక ఒక ప్రత్యేకమైన స్టైల్. ఒకవేళ ఈ నేపాలీ ముఠాల కథనైనా వర్మ సీరియస్‌గా తీసుకుని, పాత ‘సత్య’ లేదా ‘శివ’ రేంజ్ మేకింగ్ వాల్యూస్‌తో స్క్రీన్‌పైకి తెస్తే బాక్సాఫీస్ దగ్గర మళ్లీ పాత ఆర్జీవీని చూసే అవకాశం ఉంటుంది.
అనౌన్స్‌మెంట్లతోనే సరిపెట్టే వర్మ.. కనీసం ఈ రియల్ లైఫ్ క్రైమ్ స్టోరీనైనా సెట్స్ పైకి తీసుకెళ్తాడా లేదా అనేది కాలమే డిసైడ్ చేయాలి. ఏదేమైనా ఈ క్రేజీ కాన్సెప్ట్‌తో వర్మ నుంచి సినిమా వస్తే మాత్రం ఇండస్ట్రీలో మరోసారి హాట్ టాపిక్‌గా మారడం ఖాయం.

Advertisement

Also read :పవన్ కళ్యాణ్ ‘ఓజి 2’పై మైండ్ బ్లోయింగ్ లీక్.. షూటింగ్ డేట్ ఫిక్స్!

Related News

రెండో పెళ్లిపై మనసులో మాట బయటపెట్టిన సురేఖ వాణి!

రష్మికకు గాయం.. వైద్యులు ఏమన్నారంటే?

శోభిత ధూళిపాళ ర్యాంప్ వాక్.. చూపు తిప్పుకోలేకపోతున్న నెటిజన్లు!

రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ఆరంభం!

‘ఏంటో ఏమో’తో ఆకట్టుకున్న ‘కాళాంకి భైరవుడు’..విజయవాడలో గ్రాండ్ ఈవెంట్!.

‘ఇదే రామయుగం ఆరంభం’.. సందీప్ వంగా ట్వీట్ వైరల్

రామాయణ ట్రైలర్ లో సాయి పల్లవి పాత్రనే డామినేట్ చేసిన శ్రుతకీర్తి ఎవరో తెలుసా?

రామ్ గోపాల్ వర్మ ఆ హీరోయిన్ ని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా?

Big Stories

Advertisement
×