E-Paper
Advertisement

యూనివర్సిటీలో కలకలం.. విద్యార్థి కాలర్ పట్టుకుని హెచ్‌ఓడీ వార్నింగ్.. నెట్టింట వైరల్ వీడియో!

యూనివర్సిటీలో కలకలం.. విద్యార్థి కాలర్ పట్టుకుని హెచ్‌ఓడీ వార్నింగ్.. నెట్టింట వైరల్ వీడియో!
Advertisement

Nirma University Controversy: గుజరాత్ అహ్మదాబాద్‌లోని నిర్మా యానివర్సిటీ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ‘టెక్నోఫోరా – 2026’ పేరుతో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ (Electronics and Instrumentation) ఇంజనీరింగ్ విభాగం నిర్వహించిన కార్యక్రమంలో ఓ విద్యార్థి పట్ల అధ్యాపకుడు వ్యవహరించిన తీరు వివాదస్పదమవుతోంది. స్టాండప్ కమెడియన్ రజత్ సూద్ హాజరైన ఈ ఈవెంట్ లో హెచ్ఓడీ హోదాలో ఉన్న ప్రొఫెసర్ అందరూ చూస్తుండగా స్టేజీపై విద్యార్థి కాలర్ పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అసలేం జరిగిందంటే?

నిర్మా యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ హిమాంశు పటేల్ ఈ ఘటనకు పాల్పడ్డారు. ఆయన తన ఫోన్‌లో ఏదో చూస్తూ మాట్లాడేందుకు సిద్ధమవుతుండగా సభలో ఉన్న ఒక విద్యార్థి సరదాగా ‘గోల్‌మాల్ 3’ సినిమాలోని ‘జల్దీ బోల్, కల్ సుబహ్ పన్వేల్ నికల్నా హై’ (త్వరగా చెప్పు. రేపు ఉదయాన్నే పన్వేల్ వెళ్లాలి) అనే డైలాగ్‌ను గట్టిగా అరుస్తూ చెప్పాడు. దీనికి సదరు ప్రొఫెసర్ వెంటనే స్పందిస్తూ.. ‘తో నికల్ లే భాయ్’ (అయితే వెళ్లు భయ్యా) అని బదులిచ్చారు.

Advertisement

కాలర్ పట్టుకుని స్టేజీపై వార్నింగ్..

అక్కడితో ఆగకుండా ఆ విద్యార్థిని సైగలు చేస్తూ వేదికపైకి హెచ్ఓడీ పిలిచారు. ఆ విద్యార్థి దగ్గరకు రాగానే అందరూ చూస్తుండగానే అతడి కాలర్ ను గట్టిగా పట్టుకున్నారు. ‘నీ సమస్య ఏంటి? నేను ఏ స్థాయికైనా వెళ్లగలను. నిర్మా యూనివర్సిటీలో ఏ అధ్యాపకుడినైనా అవమానించే ధైర్యం చేస్తే.. నీ కెరీర్ ముగిసినట్లే’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో అక్కడున్న విద్యార్థులతో పాటు తోటి ప్రొఫెసర్లు సైతం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.

Advertisement

Also Read: బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర.. ఎవరికి, ఎంతకి దక్కిందంటే?

మీడియా స్పందనకు నిరాకరణ

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు క్షణాల్లోనే నెట్టింట వైరల్ గా మారాయి. దీనిపై స్థానిక మీడియా వివరణ కోరగా.. మాట్లాడటానికి ప్రొఫెసర్ నిరాకరించారు. విశ్వవిద్యాలయ యాజమాన్యం నుంచి కూడా దీనిపై ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. మరోవైపు నెటిజన్లు ఈ ఘటనపై రెండు వర్గాలుగా చీలిపోయి స్పందిస్తున్నారు. కొందరు విద్యార్థి ప్రవర్తనను తప్పుబడుతుండగా.. మరికొందరు ఉపాధ్యాయుడి వైఖరిపై మండిపడుతున్నారు. మెుత్తంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య ఉండాల్సిన ప్రవర్తనా నియమావళిపై ఈ ఘటన మరోసారి సీరియస్ చర్చకు తెరలేపింది.

Also Read: ఓవైపు ఎన్నికలపై ఆరోపణలు.. ఇంకోవైపు పోటీ.. విపక్షాల తీరుపై సీజేపీ చీఫ్ ఆశ్చర్యం!

 

Tags

Related News

ఓవైపు ఎన్నికలపై ఆరోపణలు.. ఇంకోవైపు పోటీ.. విపక్షాల తీరుపై సీజేపీ చీఫ్ ఆశ్చర్యం!

‘సీఈసీ జ్ఞానేష్ కుమార్ దేశద్రోహి.. తక్షణమే రాజీనామా చేయాలి’.. రాహుల్ సంచలన డిమాండ్!

జ్ఞానేష్ గేట్ నిజంగానే స్కామా? 13 కోట్ల ఓట్ల తొలగింపు వెనుక అసలేం జరిగింది?

వీరమణి పోక్సో కేసులో మరో బిగ్ ట్విస్ట్.. ఫోన్‌లో విస్తుపోయే వీడియోలు.. కీలక అనుచరుడు అరెస్ట్!

48 గంటల్లో CEC రాజీనామా చేయాలి.. లేకపోతే నిరసనలు: CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే

స్లీపర్‌ బస్సులో అగ్నిప్రమాదం.. 9 మంది ప్రయాణికులు సజీవదహనం, గ్రేటర్ నొయిడాలో ఘటన

మెర్సిడెస్ షాప్‌లో భారీగా అగ్నిప్రమాదం.. 8 లగ్జరీ కార్లు దహనం, జైపూర్‌లో ఘటన

Big Stories

Advertisement
×