Tollywood: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు నటీనటులు మరణించిన సంగతి తెలిసిందే. నిన్నటికి నిన్న ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి గారి తండ్రి మరణ వార్త మరిచిపోక ముందే మరొక దర్శకుడి మరణ వార్త ఇండస్ట్రీని పూర్తిగా కలిచివేస్తుంది. ఇలా ఇండస్ట్రీకి చెందిన వారి వరుస మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా దర్శకుడు ఎస్ రాంబాబు(S.Rambabu) (నగేష్) మరణ వార్త అందరిని ఆందోళనకు గురిచేస్తుంది. అయితే ఈయన నిన్న అర్ధరాత్రి సమయంలో మరణించినట్టు తెలుస్తోంది.
విడుదలకు సిద్ధమైన బ్రహ్మాండ…
దర్శకుడు ఎస్ రాంబాబు ప్రస్తుతం “బ్రహ్మాండ” (Brahmanda)అనే సినిమాకు దర్శకుడిగా పని చేస్తున్నారు. ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా షూటింగ్ పనులన్నీ పూర్తి కావడంతో ప్రసాద్ ల్యాబ్ లో ఫైనల్ వర్షన్ చూస్తున్నారు. ఇలా చిత్ర బృందంతో కలిసి సినిమా చూస్తున్న దర్శకుడు రాంబాబు ఇంటర్వెల్ టైంలో వాష్ రూమ్ వెళ్లి అక్కడే పడిపోయారు. అయితే ఈ విషయాన్ని ఎవరు గుర్తించకపోవడం గమనార్హం. సినిమా పూర్తి అయినప్పటికీ ఈయన బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి డైరెక్టర్ కోసం వెతకగా బాత్రూంలో పడి ఉన్న ఈయనని వెంటనే హాస్పిటల్ కి తరలించారు.
బ్రెయిన్ స్ట్రోక్…
ఇలా హైదరాబాదులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న డైరెక్టర్ ఎస్ రాంబాబు నిన్న అర్ధరాత్రి 12 గంటలకు బ్రెయిన్ స్ట్రోక్ (Brain Stroke) తో కన్నుమూశారు. ఇక ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ అవుతూ ఈయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. డైరెక్టర్ రాంబాబు మరణ విషయం తెలిసిన బ్రహ్మాండ సినిమా చిత్ర బృందం నివాళులు అర్పించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెలాకరిలో విడుదల చేయాలని చిత్రబృందం భావించారు. ఇంతలోపు ఆయన డైరెక్ట్ చేసిన సినిమాని చూస్తూ మరణించడం అనేది అందరిని ఎంతో ఆందోళనకు గురిచేసింది.
ఒగ్గు కళాకారుల నేపథ్యంలో…
బ్రహ్మాండ సినిమా ఒగ్గు కళాకారుల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఒగ్గు కళాకారుల సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీటవేస్తూ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఇక ఒగ్గు అంటే శివుని చేతిలో డమరుకం అని అర్థం. ఈ సినిమాలో ఆమని(Amani) ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాని దాసరి సురేష్, దాసరి మమత నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పెద్ద ఎత్తున ప్రేక్షకులలో అంచనాలను పెంచేసింది. ఇలా తెలంగాణ ఒగ్గు కళాకారుల సంస్కృతి సాంప్రదాయాలను ప్రేక్షకులకు తీసుకువచ్చే గొప్ప ప్రయత్నం చిత్ర బృందం చేస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల అయ్యేలోపు దర్శకుడు మరణించడంతో చిత్ర బృందం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. ఇక నేడు మధ్యాహ్నం 3:30 నిమిషాలకు రాంబాబు అంత్యక్రియలు పూర్తికానున్నట్లు సమాచారం.
Also Read: నిశ్శబ్దం.. ప్రేమలో కలుద్దాం.. వాటికి గుడ్ బై చెప్పిన శృతిహాసన్