E-Paper
Advertisement

సుమతిగా సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. కల్కి 2 షూటింగ్ పై బిగ్ అప్డేట్!

సుమతిగా సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. కల్కి 2 షూటింగ్ పై బిగ్ అప్డేట్!
Advertisement

Sai Pallavi: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం సౌత్ సినిమాలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈమె కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. సాయి పల్లవి సినిమాలో నటిస్తున్నారు అంటేనే ఆ సినిమాపై మంచి అంచనాలే ఉంటాయి. ఇక త్వరలోనే సాయి పల్లవి(Sai Pallavi) నటిస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.

కల్కి 2 సెట్స్ లోకి అడుగుపెట్టనున్న సాయి పల్లవి..

ఇలా సాయి పల్లవి తమిళ తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తున్నారు. ధనుష్ తన 55 వ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ రామాయణ(Ramayan) సినిమాలో కూడా సీత పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 5 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాతో పాటు ఈమె మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాకు కమిట్ అయ్యారని తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న కల్కి 2 (Kalki 2) సినిమాలో సుమతి పాత్రలో హీరోయిన్ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

సుమతి పాత్రలో సాయి పల్లవి ఫైనల్..

Advertisement

కల్కి సినిమాలో సుమతి పాత్రలో దీపికా పదుకొనే నటించారు. అయితే ఈ సినిమా సీక్వెల్ నుంచి ఆమెను నిర్మాతలు తప్పించారు. సీక్వెల్ సినిమాలో సుమతి పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుమతి పాత్రలో ఎవరు నటించబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఇందులో సాయి పల్లవి పేరు కూడా వినిపించింది. అయితే సాయి పల్లవి సుమతి పాత్రకు ఫైనల్ అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం కల్కి 2 షూటింగ్ పనులు జరుగుతున్నాయి అయితే సాయి పల్లవి అతి త్వరలోనే ఈ సినిమా సెట్ లోకి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తోంది.

మొదటిసారి పాన్ ఇండియా స్టార్ హీరో సినిమాలో..

సాయి పల్లవి కల్కి 2 సినిమా షూటింగ్లో అక్టోబర్ నెలలోనే పాల్గొనాల్సి ఉండగా ఈ సినిమా షూటింగ్ విషయంలో కొన్ని మార్పులు జరిగిన నేపథ్యంలో షూటింగ్ కూడా వాయిదా పడుతుంది. ఈ క్రమంలోనే సాయి పల్లవి నవంబర్ నెలలో కల్కి 2 షూటింగ్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె రామాయణ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా బిజీగా ఉన్నారు. ఈ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకొని నవంబర్ 5 న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదల కార్యక్రమాలు పూర్తి అయిన వెంటనే సాయి పల్లవి కల్కి 2 సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి మేకర్స్ అధికారక ప్రకటన తెలియజేయబోతున్నారు. ఇక సాయి పల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు టైర్ 2 హీరోలతో నటించారు మొట్టమొదటిసారి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్  కలిసి ఈమె స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Also Read:నితిన్ రుక్మిణిగా బాలీవుడ్ బ్యూటీ ఆఫియా సయ్యద్… ఆమె పాత్ర ఇదేనా?
 

Related News

నవరాత్రి స్పెషల్.. అమ్మవారిలా మారిపోయిన కృతి కర్బందా!

భార్యతో గొడవలకు కారణం అదేనా? హర్ష చెముడు ఓపెన్ కామెంట్స్!

నితిన్ రుక్మిణిగా బాలీవుడ్ బ్యూటీ ఆఫియా సయ్యద్… ఆమె పాత్ర ఇదేనా?

రాజాసాబ్ డిజాస్టర్‌పై తొలిసారి నోరు విప్పిన నిర్మాత.. ఏమన్నాడో తెలుసా?

ఆ సైజులు పెంచుతూ ఫోటోలు మార్ఫింగ్…AI ఫోటోల పై శ్రియ ఫైర్

కార్తికేయ ‘పర్ణశాల’ నుంచి జిమ్ జిమ్ తారా.. పాట అదిరిందిగా!

తెలుగు సినిమాల్లో దుమ్మురేపిన తెలంగాణ జానపద పాటలు ఇవే!

Big Stories

Advertisement
×