E-Paper
Advertisement

బతుకమ్మ పాటలంటే మంగ్లీ తర్వాతే ఎవరైనా.. మరోసారి నిరూపించిందిగా!

బతుకమ్మ పాటలంటే మంగ్లీ తర్వాతే ఎవరైనా.. మరోసారి నిరూపించిందిగా!
Advertisement

Mangli Bathukamma:తెలంగాణాలో బతుకమ్మ పండగ మొదలైపోయింది.ఇక బతుకమ్మ పండగ సందర్భంగా చేసిన బతుకుమ్మ పాటలు ఇపుడు యూట్యూబ్ లో తెగ సందడి చేయడం మొదలెట్టాయి.అయితే ఎన్ని బతుకుమ్మ పాటలు వచ్చినా సింగర్ మంగ్లీ గొంతు నుండి వచ్చే బతుకమ్మ పాటకి స్పెషల్ క్రేజ్ ఉంటుందన్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలోనే బతుకమ్మ పాట అంటే అది నేనే అంటూ మరోసారి ప్రూవ్ చేసుకుంది మంగ్లీ.

కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా 1.8 మిలియన్ వ్యూస్

Advertisement

”సింగిడి సినబోయినాది అమ్మను జూసి.. ఆ రంగులె తడబడినై బొడ్డెమ్మను జూసి” అంటూ మొదలైన ఈ పాట మూడు రోజుల కిందట రిలీజ్ కాగా కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా 1.8 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టి మరోసారి మంగ్లీ బతుకమ్మ పాటలకి ఎందుకంత క్రేజ్ ఉంటుందో మరోసారి ప్రూవ్ చేసుకుంది.

పాటలో కొట్టొచ్చిన సాంప్రదాయం 

Advertisement

ఇక పాటలో కూడా తెలంగాణ గ్రామీణ వాతావరణం చూపిస్తూ, ఆడపడుచులు నిండుగా సాంప్రదాయ దుస్తుల్లో రెడీ అయి బతుకమ్మని పేర్చడం, బతుకమ్మ ఆడుతూ సందడి సందడిగా గడపడం,వారితో మంగ్లీ జత కట్టి పాట పాడుతూ స్టెప్పులు వేయడం ..ఇలా పాట మొత్తాన్ని కన్నుల పండగగా తీర్చి దిద్దడం విశేషం.

సద్దుల బతుకమ్మకి  గ్రామ గ్రామాన మారుమ్రోగిపోవడం పక్కా 

నిజానికి మంగ్లీ ఏ పాట రిలీజ్ చేసినా కోట్లల్లో వ్యూస్ వస్తుంటాయి.ఇక అందునా బతుకమ్మ పాటలకి ఆడియన్స్ లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఇక తాజాగా రిలీజ్ చేసిన ఈ పాట చూస్తుంటే మరికొద్ది రోజుల్లోనే మూడు మిలియన్స్ కి చేరేలా కనిపిస్తుంది.ఇక వచ్చే సద్దుల బతుకమ్మకి ఈ పాటనే తెలంగాణా లోని ప్రతీ గ్రామ గ్రామాన మారుమ్రోగిపోతుందని చెప్పక్కర్లేదు కూడా.

ఈ పాట ఇలా రావడానికి కారణం 

ఇక ఈ పాట విషయానికి వస్తే…”సింగిడి సినబోయినాది అమ్మను జూసి.. ఆ రంగులె తడబడినై బొడ్డెమ్మను జూసి”మొదలైన ఈ పాటని తిరుపతి మాట్ల రాయగా మంగ్లీ పాడి పాటలో మెయిన్ లీడ్ గా కనిపించింది.ఇక ఈ పాటకి కెప్టెన్ సాయికిరణ్ తన సినిమాటోగ్రఫీ తో మంచి విజువల్స్ అందించగా, సహనా శెట్టి కొరియోగ్రఫీని డిజైన్ చేసింది.

ఇక ఎప్పటిలాగే ఎన్ని పాటలకి తనదిన సంగీతంతో ప్రాణం పోస్తున్న మదీన్ ఎస్‌కే ఈ పాటకి కూడా సంగీతం అందించడం విశేషం. శంకర్‌పల్లి మండలంలోని గంగాడ గ్రామంలో ఈ పాట షూటింగ్ చేయడంతో అక్కడి వారికి తమ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు.

మొత్తానికి మరోసారి మంగ్లీ తనదైన బతుకమ్మపాట తో మరోసారి తన సత్తా ఏంటో చూపెట్టిందనే చెప్పాలి.

Tags

Related News

బిగ్ బాస్ ను గౌరవించమని చెప్పిన కౌశల్.. వేలల్లో తగ్గిపోయిన ఫాలోవర్స్!

శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో స్క్రిప్ట్ రైటర్ రెమ్యూనరేషన్ అంతా?

బిగ్ బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. చరణ్, అపూర్వ ఔట్!

ఆ నలుగురి బండారం బయటపెట్టిన అపూర్వ.. వీడియో వైరల్!

Podarillu Today Episode : కన్నా ఫుల్ హ్యాపీ.. నారాయణ కన్నీళ్లు.. మహా వెళ్ళిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. ప్రణతి కాపురంలో చిచ్చు.. అవని, కమల్ అరెస్ట్..

Gundeninda GudiGantalu Today episode: బాలు దెబ్బకు రచ్చ రచ్చ.. రోహిణి ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు షాక్…

Big Stories

Advertisement
×