E-Paper
Advertisement

బిగ్ బాస్ ను గౌరవించమని చెప్పిన కౌశల్.. వేలల్లో తగ్గిపోయిన ఫాలోవర్స్!

బిగ్ బాస్ ను గౌరవించమని చెప్పిన కౌశల్.. వేలల్లో తగ్గిపోయిన ఫాలోవర్స్!
Advertisement

Kaushal Manda: కౌశల్ మండా ప్రముఖ సీరియల్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఇలా ఈ కార్యక్రమాల ద్వారా విజేతగా నిలిచిన కౌశల్ అనంతరం ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ఇకపోతే కౌశల్ మండా (Kaushal Manda)ఇటీవల ఇంస్టాగ్రామ్ వేదికగా తరచూ బిగ్ బాస్10(Bigg Boss 10) కార్యక్రమం గురించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ల వ్యవహార శైలి గురించి తన అభిప్రాయాలను తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా వీడియోలు చేస్తున్నారు.

బిగ్ బాస్ లేకుంటే మీరెవరు?

ఈ నేపథ్యంలోనే గత రెండు రోజుల క్రితం కౌశల్ సీజన్ 10 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న పలువురి వ్యవహార శైలిని తప్పుపడుతూ మందలించే ప్రయత్నం చేశారు. కంటెస్టెంట్ రోహిత్ (Rohit)బిగ్ బాస్ కార్యక్రమం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నాగార్జున(Nagarjuna) మందలించిన సంగతి తెలిసిందే. కౌశల్ సైతం నాగార్జునకు మద్దతుగా మాట్లాడుతూ రోహిత్ పై కాస్త మండిపడ్డారు. బిగ్ బాస్ కార్యక్రమముందు మీరు ఎవరో కూడా ఎవరికీ తెలియదు. మీకంటూ గుర్తింపు వచ్చింది అంటే అది బిగ్ బాస్ షో ద్వారా మాత్రమేనని కాబట్టి ఈ కార్యక్రమాన్ని కాస్త గౌరవించండి అని కౌశల్ కామెంట్లు చేశారు.

కౌశల్ తీరుపై విమర్శలు..

Advertisement

ఈ విధంగా కౌశల్ పరోక్షంగా రోహిత్ ను ఉద్దేశించి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియా వేదికగా కౌశల్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా ఈయన బిగ్ బాస్ కార్యక్రమాన్ని గౌరవించండి అని చెప్పడంతో రాత్రికి రాత్రే 12,000 మంది ఫాలోవర్స్ అన్ ఫాలో చేసినట్టు తెలిపారు. ఈ విషయం గురించి కౌశల్ మాట్లాడుతూ అసలు నేనేమన్నాను రాత్రికి రాత్రే ఇంతమంది ఫాలోవర్స్ తగ్గిపోయారు. తాను కేవలం మీకు గుర్తింపు తీసుకువచ్చిన బిగ్ బాస్ ను గౌరవించమని మాత్రమే చెప్పాను. అయినా మిమ్మల్ని ప్రిడిక్షన్ చేయడం చాలా కష్టం అని కౌశల్ తెలిపారు.

12 వేలమంది ఫాలోవర్స్ అన్ ఫాలో…

ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఈయన చేసిన వ్యాఖ్యల కారణంగా సోషల్ మీడియాలో వ్యతిరేకత రావడంతో ఏకంగా 12,000 మంది ఫాలోవర్స్ తగ్గిపోవడం అంటే మామూలు విషయం కాదు అయితే ఈయనకు తగ్గిపోయిన ఫాలోవర్స్ అందరూ కూడా దాదాపు రోహిత్ షాలిని ఫాలోవర్స్ అయ్యి ఉంటారని నెటిజన్ లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కౌశల్ కు మాత్రం ఇది ఊహించని షాక్ అని చెప్పాలి. ఈ విధంగా తనకు ఫాలోవర్స్ తగ్గిపోయినప్పటికీ కౌశల్ మాత్రం ఎప్పటికప్పుడు బిగ్ బాస్ కార్యక్రమం గురించి హౌస్ లో కంటెస్టెంట్ ల ఆట తీరు గురించి తన అభిప్రాయాలను తెలియజేస్తూ పోస్టులు చేస్తున్నారు.

Advertisement

Also Read: బిగ్ బాస్ షో పై అనుపమ కామెంట్స్…అంత పిచ్చి ఉందా?

Related News

బతుకమ్మ పాటలంటే మంగ్లీ తర్వాతే ఎవరైనా.. మరోసారి నిరూపించిందిగా!

శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో స్క్రిప్ట్ రైటర్ రెమ్యూనరేషన్ అంతా?

బిగ్ బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. చరణ్, అపూర్వ ఔట్!

ఆ నలుగురి బండారం బయటపెట్టిన అపూర్వ.. వీడియో వైరల్!

Podarillu Today Episode : కన్నా ఫుల్ హ్యాపీ.. నారాయణ కన్నీళ్లు.. మహా వెళ్ళిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. ప్రణతి కాపురంలో చిచ్చు.. అవని, కమల్ అరెస్ట్..

Gundeninda GudiGantalu Today episode: బాలు దెబ్బకు రచ్చ రచ్చ.. రోహిణి ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు షాక్…

Big Stories

Advertisement
×