E-Paper
Advertisement

ఏపీలోని బీసీలకు భారీ గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన!

ఏపీలోని బీసీలకు భారీ గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన!
Advertisement

AP Local Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తును సీఎం చంద్రబాబు ముమ్మరం చేసారు. అందకోసం మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జులు, నియోజకవర్గాల అబ్జర్వర్లు, పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి వర్చువల్ సమావేశం ఎర్పాటు చేశారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, చేపట్టాల్సిన ప్రచారం, కూటమి పార్టీలతో సమన్వయం, ప్రత్యర్థి పార్టీల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం వంటి అంశాలపై సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. బీసీల రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, వైసీపీ చేసిన అన్యాయాన్ని సీఎం చంద్రబాబు వివరించారు.

జయహో బీసీ!

జయహో బీసీ…! జనాభాలో సగం-కూటమి ఇచ్చింది బలం పేరుతో రాష్ట్ర వ్యాప్త ప్రచారం చేపట్టాలన్న సీఎం తెలిపారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 40 శాతం మేర సీట్లు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. స్థానిక ఎన్నికల్లో నేతల పనితీరుకు రేటింగ్స్ ఇస్తామని స్పష్టం చేశారు. కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుని కలిసి ప్రచారం చేయాలంటూ సీఎం తెలిపారు. స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారాన్ని ముమ్మరం చేస్తోందనే విషయాన్ని గమనించాలన్న ముఖ్యమంత్రి అన్నారు. వర్చువల్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. డబులింజన్ సర్కారుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాంమని స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుతో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు కావాలిన అన్నారు.

స్థానిక ఎన్నికల్లో..

Advertisement

2024 ఎన్నికల కంటే ఎక్కువ శాతం ఓట్లు పడాలి. ఇది నేతల పనితీరుకు కొలమానం అని, 50 రోజులు.. ఎవ్వరికీ మినహాయింపు లేదు.. గెలుపే ధ్యేయంగా పని చేయాలని అన్నారు. గెలుపు, నిజాయితీ, సమర్థత, సోషల్ రీ-ఇంజనీరింగ్ వంటి అంశాలను బేరీజు వేసుకునే అభ్యర్థుల ఎంపిక సిన్సియార్టీ లేకుండా డ్రామాలాడేవారి వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండదు. అలాంటి వారిని ఊపేక్షించమని అన్నారు. స్థానిక ఎన్నికల్లో నేతల పనితీరుపై రేటింగ్స్ ఇస్తాంమని సరిగా పని చేయాలని అందరిని కోరుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. స్థానిక ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు. కూటమి బలం మరింత పెరగాలంటే స్థానిక ఎన్నికలే కీలకం అని అన్నారు.

Also read: మోడీని వదలని ఇండీ..! జ్ఞానేశ్‌ను వదలబోమంటున్న జెన్‌జీ! రేపు సీజేఐతో ఇండీ కూటమి భేటీ..! అప్రకటిత ఎమెర్జెన్సీ పరిస్థితుల వివరణ

రప్పా రప్పా టీంలకు..

Advertisement

ఈ ఎన్నికలతో గొడ్డలి పార్టీకి, అభివృద్ది నిరోధకులకు, రౌడీలకు, రప్పా రప్పా టీంలకు గట్టి బుద్ది చెప్పాలి. రూ.1.50 లక్షల కోట్లు సంక్షేమం కోసం ఖర్చు చేశామని, అంతే మొత్తంలో అభివృద్ది పనులు చేశాంమని అన్నారు. సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశామని ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. చెత్త పన్ను రద్దు చేశామని చెత్తనూ తొలగించామని చక్కటి రోడ్లు వేశామని అన్నారు. ఇరిగేషన్ కు పూర్వ వైభవం తెచ్చామని, భోగాపురం ఎయిర్ పోర్టును పూర్తి చేశాంమని వికేంద్రీకరణ విధానంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.

బీసీలకు 34 శాతం..

బీసీ నాయకత్వాన్ని పెంచడానికి స్థానిక సంస్థల ఎన్నికలే వేదిక అందుకే బీసీల రిజర్వేషన్లు పెంచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేసిందని, రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ సిఫార్సులు ఆమోదించి బీసీలకు వీలైనంత మేలు చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలకు భంగం కల్గించకుండా బీసీలకు న్యాయం చేస్తున్నామన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతానికి మించి స్థానాలు ఇస్తామని ప్రకటించామని పార్టీ పరంగా 40 శాతం వరకు బీసీలకు సీట్లు ఇచ్చేలా కసరత్తుచేస్తామని చంద్రబాబు తెలిపారు. జయహో బీసీ జనాభాలో సగం-కూటమి ఇచ్చింది బలం అనే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేపట్టాలని అన్నారు.

Also read: భూమికి సౌర తుఫాను ముప్పు.. ఉపగ్రహాలు- జీపీఎస్ వ్యవస్థల మాటేంటి? రాత్రికి ఆకాశంలో ఏం జరుగుతోంది?

Tags

Related News

విశాఖలో క్షుద్రపూజల కలకలం.. ఫ్రిజ్‌ తెరిచి చూడగా స్థానికుల మైండ్ బ్లాక్.. అందులో ఏముందంటే..?

వైసీపీని గెలిచిపించినా ఇక్కడకు వచ్చాం.. మీలో ఒకడిగా పుట్టలేదు.. మీలో ఒకడ్ని అయ్యా- డిప్యూటీ సీఎం పవన్

రూటు మార్చిన స్మగ్లర్లు.. విశాఖ సిటీలో విదేశీ బంగారం భారీగా సీజ్, కోల్‌కతా టు హైదరాబాద్

వైసీపీ పరువు తీసిన ఓ ఎన్నారై.. వెంకటేశ్‌రెడ్డికి అమెరికాలో 50 నెలలు జైలుశిక్ష, అసలు ఏం జరిగింది?

పాకల బీచ్‌లో విషాదం.. సముద్రంలో గల్లంతై ఇద్దరు యువకులు మృతి!

జగన్‌ అక్రమాస్తుల కేసు కొత్త మలుపు.. ఈడీ పిటిషన్‌.. వైసీపీలో కొత్త టెన్షన్ మొదలు

స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. కో-ఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు

Big Stories

Advertisement
×