Film industry: పట్టరాని కోపం.. చెప్పుకోలేని బాధ.. క్షణికావేశంలో మనిషి తీసుకునే నిర్ణయాలు.. భవిష్యత్తును మరిచిపోయేలా చేస్తాయి. ఉదాహరణకు కన్నడ హీరో దర్శన్ ( Darshan) కూడా ఇలాంటి జాబితాలోకే వచ్చి చేరుతాడు. ప్రేయసిని ఒక అభిమాని అసభ్యకర పదజాలంతో దూషించారని, అసలు ఆ అభిమాని ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? అనే విషయాలను కూడా తెలుసుకోకుండా.. ప్రేయసి చెప్పింది కదా అని.. ఏకంగా అతడి ప్రాణాలనే తీసి.. ఇప్పుడు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. దర్శన్ క్షణికావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం అటు బాధిత కుటుంబాన్ని జీవితాంతం నరకంలో నెట్టి వేయడమే కాకుండా.. ఇటు దర్శన్ కూడా.. భార్య, పిల్లలను వదిలేసి బంగారు జీవితాన్ని కోల్పోయి.. కటకటాల వెనుక ఊసలు లెక్కపెడుతున్నారు.
నటుడి భార్యకు అసభ్యకర మెసేజ్లు..
అయితే ఇక్కడ అదే పరిశ్రమకు చెందిన నటుడు మాత్రం ఎవరు ఊహించని రీతిలో ఆలోచించి, అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా తన భార్యకు అసభ్యకర మెసేజ్లు పంపిస్తున్నాడని తెలిసి కూడా ఎదుటి వ్యక్తి భవిష్యత్తు నాశనమవుతుందని.. పోలీస్ కేస్ ఫైల్ చేయకుండా.. పోలీసుల చేత హెచ్చరించి వదిలేయమని చెప్పడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి అసలు ఆయన ఎవరు..? ఇంతలా ఆలోచించడం వెనుక అసలు కారణం ఏమిటి? ఆయన భార్యను దూషించిన ఆ వ్యక్తి ఎవరు? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి..
సదరు వ్యక్తి భవిష్యత్తు గురించి ఆలోచించిన సంజు..
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ కన్నడ హాస్యనటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు సంజు బసయ్య . గత కొంతకాలంగా గుర్తు తెలియని ఒక యువకుడు తన భార్య పల్లవి ఇంస్టాగ్రామ్ ఖాతాకు అసభ్యకర మెసేజ్లు పంపించాడు. దీంతో పల్లవి తన భర్తకు అసలు విషయాన్ని చెప్పగా రంగంలోకి దిగిన సంజు.. బెళగావి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంజు కంప్లైంట్ మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోగా.. ఆ యువకుడు విద్యార్థి అని తేలింది. దీంతో పోలీస్ కేసు వల్ల విద్యార్థి భవిష్యత్తు, కెరియర్ రెండూ నాశనం అవుతాయని, అలా చేయడం ఇష్టంలేని సంజు నిందితుడికే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి విడిచి పెట్టాలని పోలీసులను కోరారు. ఈ మేరకు పోలీసులు అతడిని విడిచిపెట్టడం జరిగింది.
నటుడు పై నెటిజన్స్ ప్రశంసలు..
ఈ విషయం తెలిసి సంజు పై పలువురు నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. సదరు యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక అమ్మాయి అని తెలిసి కూడా ఇలాంటి అసభ్యకరమైన మెసేజ్లు పంపించడం వెనుక ఆంతర్యం ఏమిటి? అసలు అవసరం ఏముంది? అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు సంజు మంచి మనసున్న వ్యక్తి అని.. ఒకవేళ ఆయన ఆగ్రహించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉంటే మీ భవిష్యత్తు ఏమయ్యేది అంటూ ఫైర్ అవుతున్నారు. మరి ఇప్పటికైనా సదరు విద్యార్థి సంజు దంపతులకు క్షమాపణలు చెప్పాలి అని కూడా కోరుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
ALSO READ:Producers Darna: ఫిల్మ్ ఛాంబర్‌లో వరుస రాజీనామాలు… నిర్మాతలు ధర్నా ?