Sudigali Sudheer : బుల్లితెర ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ పేరు తెలిసే ఉంటుంది.. జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఇతను ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తున్న కూడా మరోవైపు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలుషోలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు కొన్ని సినిమాలు చేశాడు. కానీ అవి అతనికి సాలిడ్ హిట్ సినిమాని మాత్రం అందించలేదు. దాంతో మళ్లీ బుల్లితెరపై సందడి చేస్తున్నాడు. కొన్ని షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక సుధీర్ పెళ్లి గురించి ఈమధ్య ఎక్కువగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో యాంకర్ రష్మితో పెళ్ళంటూ వార్తలు వినిపించాయి.. ఇప్పుడు మరోసారి సుధీర్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడుంటు ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ సుధీర్ పెళ్లి కోసం చాలామంది అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
సుధీర్ పెళ్లి ఎవరితో..?
బుల్లితెర ప్రేక్షకులకు సుడిగాలి సుదీర్ గురించి తెలుసు. ఈయన ఏ షో చేస్తే ఆ షోలో పెళ్లి గురించి ఏదో ఒక ప్రస్తావన వస్తూనే ఉంటుంది. తాజాగా సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సుధీర్ తమ్ముడికి పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. కుటుంబం ఆర్థికంగా ఎదగాలని సుదీర్ పెళ్లి చేసుకోకుండా ఇప్పటివరకు ఉన్నాడన్న విషయం చాలామందికి తెలుసు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు, బంధువులు ఒత్తిడి చేయడంతో పెళ్లికొప్పుకున్నట్లు సమాచారం. సుధీర్ సమీప బంధువైన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారంటూ టాక్.. పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడంతో సుధీర్ ఆ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.. ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం అయితే ఇది నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై క్లారిటీ రావాలంటే సుదీర్ రెస్పాండ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..
Also Read : బర్త్ డే స్పెషల్.. ‘పెద్ది’ నుంచి శివన్న ఫస్ట్ లుక్ వచ్చేసింది
జబర్దస్త్ కు సుధీర్ డుమ్మా.. ఆ గొడవేనా?
సుధీర్ గురించి ఈ మధ్య రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా జబర్దస్త్ షో కు సుధీర్ డుమ్మా కొట్టాడని టాక్ నడుస్తుంది. ఎందుకు రాలేదో క్లారిటీ రాలేదు కానీ ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం మూడు షోలు చేస్తున్నాడు. పైగా అందులో ఒకటి ఈటీవీలో నడుస్తున్న ఫ్యామిలీ స్టార్స్ షో. ఇది కాకుండా జీ తెలుగులో డ్రామా జూనియర్స్ 8, ఆహాలో సర్కార్ 5షో కూడా చేస్తున్నాడు సుధీర్. అలాంటప్పుడు జబర్దస్త్‌ని ఆడియన్స్‌కి దగ్గరయ్యేలా చేసిన వాళ్లలో ఒక్కడైన సుధీర్‌ని ఎందుకు పిలవలేదు.. లేక పిలిచినా రాలేదా అనేదే ఇక్కడ ప్రశ్న. నిజానికి జబర్దస్త్ షోని మల్లెమాల ప్రొడక్షన్స్ నడిపిస్తుంది. అలాగే సుధీర్ రీఎంట్రీ ఇచ్చిన ఫ్యామిలీ స్టార్స్ షోని జ్ఞాపిక ప్రొడక్షన్స్ చూస్తుంది..జబర్దస్త్ నుంచి సుధీర్ వెళ్లేటప్పుడు మల్లెమాలతో చిన్న డిస్కషన్ అయిందని.. దాంతో శ్రీదేవి డ్రామా కంపెనీ షోని కూడా వదిలేసినట్లు టాక్ కూడా వచ్చింది.. ఏది ఏమైన జబర్దస్త్ లో సుధీర్ ఉంటే బాగుండునని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.