E-Paper
Advertisement

Sayaji Shinde: సాయాజి షిండే గొప్ప పని ..పేరుకే విలన్ .. గొప్ప మనస్సు అంటున్న నెటిజన్స్!

Sayaji Shinde: సాయాజి షిండే గొప్ప పని ..పేరుకే విలన్ .. గొప్ప మనస్సు అంటున్న నెటిజన్స్!
Advertisement

Sayaji Shinde: తెలుగు సినిమాలలో ఎన్నో పాత్రలలో విలన్ గా నటించి ప్రేక్షకులను భయానికి గురి చేస్తూ మెప్పించిన వారిలో సీనియర్ నటుడు సాయాజీ షిండే(Sayaji Shinde) ఒకరు. కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాలలో కూడా నటిస్తూ విలన్ పాత్రలకు ప్రాణం పోశారు. ఇప్పటికీ పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా సాయాజీ షిండేకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఈయనపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.

అమ్మ జ్ఞాపకార్థం మొక్కలు నాటిన నటుడు..

సాధారణంగా ఎవరి కుటుంబంలోనైనా వారికి ఎంతో ఇష్టమైన వారు మరణిస్తే వారి జ్ఞాపకార్థం కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. గొప్పగా సమాధులు కట్టివ్వడం లేదా విగ్రహాలు పెట్టడం వంటివి చేస్తారు. అయితే నటుడు సాయాజీ షిండే మాత్రం ఊహించని విధంగా ఓ గొప్ప పనికి శ్రీకారం చుట్టారనే చెప్పాలి. తన తల్లి అంటే ఎంతో అభిమానం ప్రేమ ఉన్నటువంటి ఈయన తన సొంత గ్రామంలో ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.. తన సొంత గ్రామంలో ఈయన 5000 మొక్కలను నాటారు.. ఇలా ఈయన నాటిన మొక్కలు ఇప్పుడు మహా వృక్షాలుగా మారాయని తెలుస్తోంది.

నాటే ప్రతి చెట్టుపై అమ్మ పేరు..

Advertisement

ఇలా తన సొంత గ్రామంలో సాయాజీ షిండే చేపట్టిన సహ్యాద్రి దేవ్ రాయ్ ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే లక్షలాది మొక్కలను నాటారు. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ తన తల్లికి ప్రకృతి అంటే ఎంతో ఇష్టం ఆమె ప్రకృతి ప్రేమికురాలు. అమ్మ చనిపోయినప్పుడు తన ఫోటో ఒక విగ్రహానికి తనని పరిమితం చేయటం ఇష్టం లేదు అందుకే అమ్మకు ఎంతో ఇష్టమైన మొక్కలను నాటాను ప్రతి మొక్క అమ్మ పేరు మీద నాటానని ఇప్పుడు ఆ చెట్టులో అమ్మను చూసుకుంటున్నానని తెలిపారు. ఇలా ఈ చెట్లని పెరిగి పెద్దయిన తర్వాత చెట్ల నుంచి వస్తున్న గాలి నీడ మా అమ్మ ఆశీస్సులుగా భావిస్తున్నానని ఈయన తెలియజేశారు. ఇలా తన తల్లి జ్ఞాపకార్థం సరికొత్త ఆలోచన చేసి వేల సంఖ్యలో మొక్కలు నాటారనే విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయంపై నేటిజన్లు స్పందిస్తూ..

నిజమైన హీరో..

Advertisement

ఇలాంటి గొప్ప పనులు చేయాలి అంటే చాలా గొప్ప మనసు ఉండాలని అది అందరికీ సాధ్యం కాదని చెప్పాలి. మీరు సినిమాలలో చూడటానికి విలన్ గా కనిపిస్తారు కానీ అమ్మ మీద ప్రేమతో పర్యావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇలా వేల సంఖ్యలో మొక్కలు నాటడం నిజంగా గ్రేట్ అని, నిజ జీవితంలో మీరు హీరో అంటూ ఈయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈయన కూడా ప్రకృతి ప్రేమికుడే ఖాళీ సమయంలో తన జీవితం మొత్తం చెట్లు నాటడం వాటి పెంపకంతో బిజీగా గడుపుతూ ఉంటారని తెలుస్తోంది.

Also Read: The Raja Saab: ఓటీటీలోకి వచ్చేస్తున్న రాజా సాబ్.. అదిరిపోయే న్యూస్ చెప్పిన హాట్ స్టార్!

Related News

సీతమ్మ ఇలా మారిపోయిందేంటి..మృణాల్ గ్లామర్ డోస్ మామూలుగా లేదుగా!

ఛాన్స్ ఇస్తాం.. కానీ ఆ పని చేయాలంటూ ఆఫర్.. ఖుషీ షాకింగ్ రివీల్!

టాలీవుడ్ హీరో భార్యతో మనస్పర్థలంట.. విడాకులపై బయటకొచ్చిన క్లారిటీ

హీరో అజిత్ ను కలిసిన సీఎం విజయ్.. ఫుల్ ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

పాలక్ తివారీ అందాల జాతర.. ఒక్క ఫొటోతో ఫుల్ వైరల్!

ఆ అక్కినేని హీరో ‘మనం’ సినిమా చూడలేదా? కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

చేతులు ఎత్తేశావా సర్దార్.. రెండో రోజుకే దుకాణం డౌన్!

త్రివిక్రమ్‌ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా? ‘ఆదర్శ కుటుంబం’పై మొదలైన డౌట్స్‌!

Big Stories

Advertisement
×