E-Paper
Advertisement

Seetha Payanam: నాలుగు రోజుల ‘సీతా పయనం’ కలెక్షన్స్ ఎంతంటే.. హిట్టేనా?

Seetha Payanam: నాలుగు రోజుల ‘సీతా పయనం’ కలెక్షన్స్ ఎంతంటే.. హిట్టేనా?
Advertisement

Seetha Payanam: టాలీవుడ్‌లో గత వారం విడుదలైన చిత్రాల్లో ‘సీతా పయనం’ (Seetha Payanam) సైలెంట్‌గా వచ్చి బాక్సాఫీస్ వద్ద వయలెంట్‌గా సౌండ్ చేస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్ (Action King Arjun) తన కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ (Aishwarya Arjun)ను వెండితెరకు పరిచయం చేస్తూ, స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రేమికుల రోజు (ఫిబ్రవరి 14) కానుకగా విడుదలైన ఈ మూవీ, ప్రస్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలో నాలుగు రోజులకుగానూ ఈ సినిమా రాబట్టిన కలెక్షన్స్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమా నాలుగు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..

Also Read- Malayalam movie OTT : ఓటీటీలోకి మూడు నెలల తరువాత మలయాళం మిస్టరీ మూవీ… నాగ దేవత చుట్టూ కథ

4 రోజులకు వచ్చిన కలెక్షన్స్ ఎంతంటే..

Advertisement

సాధారణంగా వారసుల ఎంట్రీ అంటే భారీ అంచనాలు ఉంటాయి. కానీ అర్జున్ ఎంచుకున్న కథాంశం, మేకింగ్ వాల్యూస్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. తాజాగా మేకర్స్ వదిలిన పోస్టర్ ప్రకారం, ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 8.7 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సత్తా చాటింది. ఫిబ్రవరి వంటి డల్ సీజన్‌లో కూడా ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం అంటే, సినిమా కంటెంట్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయిందనే అనుకోవచ్చు. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో రోజురోజుకూ వసూళ్లు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమాకు థియేటర్లు కూడా పెంచుతున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు.

Also Read- 56 Days Thriller Series OTT : డవ్ కామెరూన్, అవాన్ జోగియా నటించిన థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలోకి… 8 ఎపిసోడ్‌లలో పిచ్చెక్కించే ట్విస్టులు

సినిమా హిట్టేనా?

Advertisement

సంక్రాంతి సినిమాల తర్వాత పెద్దగా హిట్ పడలేదు. ఆ లెక్కన చూస్తే ఈ సినిమా హిట్టనే చెప్పుకోవాలి. తండ్రిగా అర్జున్ తన కుమార్తెని ఎలా ప్రెజెంట్ చేయాలో అంతకంటే బెటర్‌గా చూపించారు. సాయి మాధవ్ బుర్రా పవర్ ఫుల్ మాటలు సినిమాకు ప్రాణం పోశాయి. అనూప్ అందించిన మెలోడీ సాంగ్స్, సీన్లను ఎలివేట్ చేసే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. సినిమాలో అర్జున్ స్వయంగా మెరవడంతో పాటు, ధృవ్ సర్జా స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వడం మాస్ ఆడియెన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. అలాగే హీరోయిన్‌గా పరిచయమైన ఐశ్వర్య అర్జున్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. గ్లామర్ కంటే పర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రను ఎంచుకోవడం ఆమెకు ప్లస్ అయ్యింది. ఇక ఉపేంద్ర వారసుడు నిరంజన్ కూడా తన నటనతో ఆకట్టుకుని ప్రామిసింగ్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. మొత్తంగా అయితే, ‘సీతా పయనం’ బాక్సాఫీస్ వద్ద సేఫ్ జోన్‌లోకి వెళ్ళడమే కాకుండా, లాభాల బాట పట్టిందనేలా టాక్ నడుస్తుంది.

Also Read- IBomma Ravi: ఫస్ట్ టైం మీడియా ముందుకు ఐ బొమ్మ రవి.. పైరసీ ఏమన్నారంటే?

Related News

వారి టార్చర్ వల్లే వదిలేసా -ఐశ్వర్య లక్ష్మీ

యష్ ‘టాక్సిక్’ కథ లీక్..ఆ సెంటిమెంట్ వింటే మైండ్ పోవాల్సిందే!

బాలయ్యకు గాయం.. NBK 111 రిలీజ్ డౌటేనా? కొరటాల ప్రాజెక్ట్‌పై పడ్డ ఎఫెక్ట్!

రీతూ వర్మ – వైష్ణవ్ తేజ్ మధ్య బ్రేకప్?

జయకృష్ణ సీక్రెట్ లీక్ చేసిన రషా.. ‘శ్రీనివాస మంగాపురం’ సెట్స్‌లో ఏం జరిగిందంటే?

మరో కొత్త సినిమాతో ‘లెనిన్ ‘డైరెక్టర్.. ఒక హిట్.. క్రేజీ హీరోతో ఛాన్స్!

NBK 111:బాబాయ్ కోసం అబ్బాయ్ ఎమోషనల్ మెసేజ్.. జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నాడంటే?

జాన్ అబ్రహం కొత్త ఇల్లు ఎంతో తెలుసా ..రేటు చూస్తే మతి పోవాల్సిందే !

Big Stories

Advertisement
×