E-Paper
Advertisement

పిల్లలకు పార్సిల్స్ ఇచ్చే విమానం… కొత్త గ్యాడ్జెట్స్‌తో పిల్లలను ఎంటర్‌టైన్ చేసే ఫాంటసీ అడ్వెంచర్

పిల్లలకు పార్సిల్స్ ఇచ్చే విమానం… కొత్త గ్యాడ్జెట్స్‌తో పిల్లలను ఎంటర్‌టైన్ చేసే ఫాంటసీ అడ్వెంచర్
Advertisement

Animation Series on OTT: ఒక విమానం మనుషులను ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లడం మనకు తెలుసు. కానీ అదే విమానం ప్రపంచం నలుమూలల ఉన్న చిన్నారులకు పార్సిల్స్ డెలివరీ చేస్తూ, ప్రతి మిషన్‌లో ఓ కొత్త అడ్వెంచర్‌లో చిక్కుకుంటే ? అది కూడా అవసరమైనప్పుడు రోబోలా మారిపోయి పరుగెత్తగలదు, ఎగరగలదు, రెస్క్యూ చేయగలదు. పిల్లలకు ఎదురయ్యే ప్రతి సమస్యను కొత్త గ్యాడ్జెట్స్‌తో పరిష్కరించే టీమ్ ఉంటే ? ఇదే కాన్సెప్ట్‌తో చిన్నారులను అలరిస్తున్న యానిమేషన్ సిరీస్ ‘Super Wings’. మరి జెట్ అండ్ టీమ్ ఈసారి ఎలాంటి మిషన్స్‌లోకి వెళ్లారు ? పిల్లలకు ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించారు ? తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథలో ప్రధాన పాత్ర జెట్ అనే క్యూట్ జెట్ విమానం. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న పిల్లలకు వాళ్లు ఆర్డర్ చేసిన పార్సిల్స్‌ను డెలివరీ చేయడం అతని పని. కానీ జెట్ ప్రత్యేకత కేవలం డెలివరీ చేయడం మాత్రమే కాదు. పార్సిల్ అందించిన తర్వాత అక్కడి పిల్లలకు ఏదైనా సమస్య ఎదురైతే, దాన్ని పరిష్కరించేందుకు కూడా రంగంలోకి దిగుతాడు. అక్కడి నుంచే ప్రతి ఎపిసోడ్ ఓ కొత్త అడ్వెంచర్‌గా మారుతుంది. ఓసారి మంచు పర్వతాల్లో చిక్కుకున్న పిల్లలను కాపాడాలి. మరోసారి సముద్రంలో ప్రమాదంలో ఉన్నవారికి సహాయం చేయాలి.

Advertisement

ఇంకోసారి అడవుల్లో, మరికొన్ని సందర్భాల్లో స్పేస్‌లో కూడా మిషన్స్ చేయాల్సి వస్తుంది. పిల్లలకు అవసరమైన వస్తువును తీసుకెళ్లిన జెట్… చివరకు వాళ్ల సమస్యను పరిష్కరించే రెస్క్యూ హీరోగా మారతాడు. అయితే జెట్ ఒక్కడే ఈ పనులన్నీ చేయడు. అవసరాన్ని బట్టి Dizzy, Donnie, Jerome, Paul వంటి సూపర్ వింగ్స్ టీమ్ సభ్యులు అతనితో కలుస్తారు. ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేక సామర్థ్యం ఉంటుంది. కొత్త గ్యాడ్జెట్స్, మార్పులు చెందే వాహనాలు, రోబోటిక్ పవర్స్‌తో వీళ్లంతా కలిసి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు.

ఈ సిరీస్‌లో మరో ప్రత్యేకత ప్రపంచంలోని వివిధ దేశాలు, సంస్కృతులు, ప్రదేశాలను పిల్లలకు పరిచయం చేయడం. జెట్ చేసే ప్రతి డెలివరీ ఒక కొత్త లొకేషన్‌కు తీసుకెళ్తుంది. అక్కడి పిల్లలతో పరిచయం, స్థానిక సమస్య, దాన్ని పరిష్కరించే మిషన్… ఇలా ప్రతి కథలో ఫ్రెండ్‌షిప్, టీమ్‌వర్క్, సహాయం చేయాలనే భావన కూడా కనిపిస్తుంది. కొత్త ఎపిసోడ్లలో కథ మరింత ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ వైపు వెళ్తుంది. డైనో వరల్డ్, స్పేస్ వంటి కొత్త ప్రపంచాల్లో కూడా జెట్ టీమ్ మిషన్స్ చేపడుతుంది. కొత్త పాత్రలు, గ్యాడ్జెట్స్, సవాళ్లు రావడంతో ప్రతి ఎపిసోడ్ పిల్లలకు కొత్త అనుభూతిని అందిస్తుంది.

Advertisement

మరి ఈసారి జెట్ తీసుకెళ్లే పార్సిల్ ఎవరి కోసం ? ఆ చిన్నారికి ఎదురైన సమస్య ఏంటి ? సూపర్ వింగ్స్ టీమ్ ఎలాంటి గ్యాడ్జెట్‌తో రంగంలోకి దిగుతుంది ? చివరకు ఆ మిషన్‌ను ఎలా పూర్తి చేస్తారు ? అనేదే ఒక్కో ఎపిసోడ్‌లో చూడాల్సిన అడ్వెంచర్.

తెలుగులో ఉందా ?

‘సూపర్ వింగ్స్’ ప్రస్తుతం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్ నంబరింగ్ ప్రాంతాన్ని బట్టి మారే అవకాశం ఉండటంతో, మీ ప్రైమ్ వీడియో లిస్టింగ్‌లో కనిపించే సీజన్‌ను ఫాలో అవ్వడం మంచిది. విమానాలు, రోబోట్స్, స్పేస్, డైనోసార్స్, రెస్క్యూ మిషన్స్, ఫాంటసీ అడ్వెంచర్స్ వంటి అంశాలతో తెరకెక్కిన ఈ సిరీస్ పిల్లలకు మంచి ఎంటర్‌టైనర్. ముఖ్యంగా చిన్నారులతో కలిసి వీకెండ్‌లో సరదాగా చూడటానికి ఈ సిరీస్ మంచి ఛాయిస్. కానీ ఈ సిరీస్ ఇంగ్షీషులో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also: పుట్టగానే ఆసుపత్రిలోనే బిడ్డను వదిలేసి వెళ్ళే తల్లి… గుండెను బరువెక్కించే ఈ ఎమోషనల్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

Related News

ప్రేమ పేరుతో మెంటలెక్కించే పనులు… ఎక్స్ రీఎంట్రీతో బుర్రపాడు ట్విస్ట్… ఈ లవ్ ట్రయాంగిల్ చూస్తే బుర్రపాడు

నేరస్థుల గుండెల్లో వణుకు పుట్టించే స్పెషల్ టీమ్… కంటెంట్ నెక్స్ట్ లెవెల్ భయ్యా… డెడ్లీ క్రైమ్స్ తో సీజన్ 9 స్ట్రీమింగ్ షురూ

పాపులర్ SNL షో వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ కథ… ఇండస్ట్రీ సీక్రెట్స్ బయటపెట్టిన నెట్‌ఫ్లిక్స్ కొత్త డాక్యుమెంటరీ

కులం పిచ్చితో ప్రేమికుల ప్రాణాలు తీసే రాక్షసత్వం… హార్డ్ హిట్టింగ్ మూవీ

తీరప్రాంతాన్ని వణికించే మిస్టరీ క్రియేచర్… ఊరిని కాపాడుకోవడానికి మత్స్యకారుడి పోరాటం… గూస్‌బంప్స్ తెప్పిస్తున్న సర్వైవల్ థ్రిల్లర్

యూనికార్న్ ఐలాండ్‌లో ఊహించని విపత్తులు… ఆ వింత రహస్యం ఏంటి ? నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త మ్యాజికల్ అడ్వెంచర్

అవుట్‌వర్ల్డ్ క్రూర చక్రవర్తిపై తిరుగుబాటు… హాలీవుడ్ హీరో ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ వార్… తెలుగులోనే స్ట్రీమింగ్

విలన్ గా సుహాస్ 150 కోట్ల మాస్ ర్యాంపేజ్… తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘మందాడి’

Big Stories

Advertisement
×