E-Paper
Advertisement

బిగ్ బాస్ 10లోకి టెంపర్ మూవీ విలన్?

బిగ్ బాస్ 10లోకి టెంపర్ మూవీ విలన్?
Advertisement

Bigg Boss 10:వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ఇప్పటికే తెలుగులో 9 సీజన్లు పూర్తి కాగా.. ఇప్పుడు పదవ సీజన్ కి రంగం సిద్ధం అయ్యింది. సెప్టెంబర్ 6వ తేదీన ఈ సీజన్ లాంఛనంగా గ్రాండ్ గా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అగ్నిపరీక్ష సీజన్ 2 ఆడిషన్స్ కూడా జరుగుతున్నాయి. మరొకవైపు సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఒక్కొక్కరిని ఫైనలైజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే కన్ఫర్మ్ లిస్టులో కొంతమంది పేర్లు బయటకు రాగా.. అందులో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘టెంపర్ ‘ సినిమాలో విలన్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరి ఆయన ఎవరో ఇప్పుడు చూద్దాం.

బిగ్ బాస్ 10లోకి టెంపర్ విలన్..

ఆయన ఎవరో కాదు వంశీ (temper Vamsi). మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన టెంపర్ చిత్రంలో ప్రకాష్ రాజ్ తమ్ముడు పాత్రలో విలన్ గా అదరగొట్టేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వంశీ. టెంపర్ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. అత్తారింటికి దారేది, సాహో, భరత్ అనే నేను, భీష్మ, వకీల్ సాబ్, దేవర , హిట్ 2 ఇలా ఎన్నో చిత్రాలలో విలన్ గా ఆకట్టుకున్నారు. పైగా ఈ ఏడాది పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో నటించిన వంశీ రీసెంట్గా వచ్చిన వరుణ్ తేజ్(Varun Tej) ‘కొరియన్ కనకరాజు’ చిత్రంలో కూడా మెరిశారు. అలాంటి ఈయన ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10లోకి రాబోతున్నారని, ఫైనల్ కూడా చేశారని, త్వరలోనే అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

also read:ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

కన్ఫర్మ్ లిస్టులో మరికొంతమంది సెలబ్రిటీలు..

ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో..” వీరంతా హౌస్ లోకి వెళ్ళబోతున్నారు. ఇదే కన్ఫర్మ్ లిస్ట్” అంటూ ఒక లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల సినిమా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ ఛర్మిల కూడా బిగ్ బాస్ టెన్ లోకి వస్తుందని తెగ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను ఆమె ఖండించిన విషయం తెలిసిందే. ఈసారి సెలబ్రిటీల కంటెస్టెంట్ల జాబితాలో తేజస్విని గౌడ, పల్లవి గౌడ, రాకింగ్ రాకేష్, పవిత్ర, వర్ష, వర్షిని, నందూస్ వరల్డ్ నందు , చంద్రహాస్, జ్యోతి, హీరో అబ్బాస్ రాయల్ ఎం సీ రమణ తదితర పేర్లు వైరల్ గా మారుతున్నాయి. మరి అసలు విషయం తెలియాలి అంటే అనౌన్స్మెంట్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

షోపై అంచనాలు పెంచుతున్న అగ్నిపరీక్ష సీజన్ 2..

Advertisement

మరొకవైపు అగ్నిపరీక్ష సీజన్ 2 మాత్రం బిగ్ బాస్ సీజన్ 10 పై అంచనాలు భారీగా పెంచుతోంది. హౌస్ లో సత్తా చాటే ఆరుగురిని ఎంపిక చేయడానికి ఇటు జడ్జెస్ అయిన బిందు మాధవి (Bindhu madhavi), నవదీప్ (Navdeep), అభిజిత్ (Abhijeet) గట్టిగానే కష్టపడుతున్నారు. టాలెంట్ ఉన్న సామాన్యులను సెలెక్ట్ చేయడానికి పెద్ద ఎత్తున జల్లెడ పడుతున్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా అగ్నిపరీక్ష సీజన్ 2 లో సత్తా చాటిన ఆరుగురిని హౌస్ లోకి పంపించబోతున్నారని చెప్పవచ్చు. మరి ఈసారి కామన్ మ్యాన్ టైటిల్ విజేతగా నిలుస్తారా? లేక సెలబ్రిటీ ఈ టైటిల్ కైవసం చేసుకుంటారా? అన్నది తెలియాల్సి ఉంది.

Related News

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఇంటింటి రామాయణం అవుట్..

Ninnu kori Serial Today Episode October 7th ‘నిన్ను కోరి’ సీరియల్‌: మరోసారి సామ్రాట్ ను చంపేస్తానన్న దాక్షాయణి   

Wedensday Tv Movies : బుధవారం సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆ 4 మస్ట్ వాచ్..

ఫైనాన్షియల్ గొడవలా? పెళ్లి మేటరా?.. రీతూ చౌదరి ఇష్యూపై నోరు విప్పిన డెమోన్ పవన్!

ప్రియాంక జైన్ సీరియల్స్ ఎందుకు మానేసిందో తెలుసా?

బుల్లితెరపై సందడి చేసిన స్వప్న దత్.. ఆ క్రేజీ మూమెంట్ చూసారా?

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న నూక రాజు.. రాంప్రసాద్ ను మించిన రెమ్యూనరేషన్!

“బిందెల బిందెలు బావయ్యో”.. మరో ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన మాధురీ రాథోడ్!

Big Stories

Advertisement
×