Bollywood: సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలు ఎప్పుడు కలుస్తారో.. ఎప్పుడు ప్రేమలో పడతారో.. ఎప్పుడు డేటింగ్ చేస్తారో.. మళ్ళీ ఎప్పుడు విడిపోతారో చెప్పడం చాలా కష్టం. ఎంత తొందరగా ప్రేమలో పడతారో అంతే తొందరగా బ్రేకప్ లు చెప్పుకుంటూ విడాకులు తీసుకుంటూ ఉంటారు.పెళ్లి, ప్రేమ అనేది మూన్నాళ్ల ముచ్చటగానే ఉంటుంది. అయితే అందరు సెలబ్రిటీలు అలా ఉంటారని కాదు. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు విడాకుల పేరుతో,బ్రేకప్ ల పేరుతో ఎన్నో ఏళ్ల వారి బంధానికి గుడ్ బై చెబుతున్నారు. ఎంతోమంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని 20, 25 ఏళ్లు కాపురం చేశాక కూడా విడాకులు తీసుకున్న వారిని ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం.
అలా తాజాగా మరో జంట కూడా విడాకులకు రెడీ అయింది. ఇక ఆ జంట ఎవరంటే బాలీవుడ్ బుల్లితెర నటి సింపుల్ కౌల్.. హిందీ సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించిన నటి సింపుల్ కౌల్ తన 15 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్ బై చెబుతున్నట్టు తెలిపింది. తన భర్తతో విడాకులు తీసుకోబోతున్నట్టు సింపుల్ కౌల్ పోస్ట్ పెట్టడంతో చాలామంది ఈ పోస్ట్ చూసి షాక్ అవుతున్నారు.. సింపుల్ కౌల్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా పోస్ట్ పెట్టింది. “అవును, మేమిద్దరం నిజంగానే విడిపోయాం. రీసెంట్ గానే విడాకులు తీసుకున్నాం.. నా లైఫ్ లో ఆయనతో నేను చాలా సంవత్సరాలు కలిసి ఉన్నా. కానీ పరస్పర నిర్ణయంతోనే విడాకులు తీసుకొని విడిపోవాలనే డెసిషన్ తీసుకున్నాం. అందుకే రీసెంట్ గా విడిపోయాం” అంటూ పోస్ట్ పెట్టింది..
విడాకుల నిర్ణయం వెనక కారణం?
ప్రస్తుతం నటి సింపుల్ కౌల్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక 2010లో బిజినెస్ మాన్ రాహుల్ లూంబాని పెళ్లాడిన సింపుల్ కౌల్ ఇన్నేళ్లుగా ఎంతో అన్యోన్యంగా తన భర్త తో లైఫ్ ని ఎంజాయ్ చేసింది. కానీ సడన్గా విడాకులు తీసుకుంటున్నట్టు అనౌన్స్ చేసింది. సింపుల్ కౌల్, రాహుల్ లూంబాల విడాకులకు కారణం ఏంటో చెప్పలేదు..
అప్పుడు భర్త గురించి గొప్పగా చెప్పిన నటి..
అయితే విడాకుల కంటే ముందు కొన్ని ఇంటర్వ్యూలలో తన భర్త గురించి సింపుల్ కౌల్ మాట్లాడుతూ.. మా ఆయన ఎక్కువగా విదేశాల్లోనే ఉంటారు.ఆ టైంలో నేను ఆయన్ని చాలా మిస్ అవుతాను. కానీ ఎంత దూరంగా ఉన్నా మా మధ్య అండర్స్టాండింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది.మేమిద్దరం జీవితంలో సమానంగా ఎదుగుతున్నాం.అలాగే నా భర్త లేనప్పుడు నా కెరియర్ పై కూడా నేను దృష్టి పెట్టా అంటూ భర్త గురించి గొప్పగా చెప్పుకొచ్చింది. అలా ఎన్నో ఇంటర్వ్యూలలో భర్త గురించి పాజిటివ్ గా చెప్పిన సింపుల్ కౌల్ సడన్గా ఈ విడాకుల డెసిషన్ ఎందుకు తీసుకుందో తెలియడం లేదు అంటున్నారు ఆమె అభిమానులు.
also read:Bigg Boss 9: బిగ్ బాస్ హౌస్లోకి మరో లేడీ విలన్.. శోభాను మించి మెప్పిస్తుందా?