OTT Movie : టైంట్రావెల్ థీమ్ తో నడిచే సినిమాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇలాంటి సినిమాలను చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు మూవీ లవర్స్. ఈ నేపథ్యంలో కన్‌ఫ్యూజింగ్ టైమ్‌లైన్స్, థ్రిల్లర్ ఎలెమెంట్స్ తో ఒక హాలీవుడ్ సినిమా ఓటీటీలో దూసుకుపోతోంది. ఇందులో అనుకోకుండా టైంట్రావెల్ చేసిన ఒక అమ్మాయి, తన ఫ్యామిలీ సీక్రెట్స్ ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆతరువాత స్టోరీ ఉహించని మలుపులు తీసుకుంటుంది. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
టెక్సాస్-లూసియానా సరిహద్దులో ఉండే కాడ్డో లేక్ అనే ప్రాంతంలో ఎల్లీ అనే అమ్మాయి తన తల్లి సెలెస్ట్, సవతి తండ్రి డానియల్, 8 ఏళ్ల సవతి సోదరి అన్నాతో కలసి నివసిస్తుంటుంది. ఎల్లీ తన తండ్రి గురించి ఎప్పుడూ తెలియని ఒక రెబల్ టీనేజర్. ఈ విషయంలో తల్లితో తరచూ గొడవపడుతుంది. ఒక రాత్రి సెలెస్ట్‌తో గొడవ తర్వాత ఎల్లీ ఇంటి నుండి పారిపోతుంది. ఆతరువాత అన్నా ఆమెను వెంబడిస్తుంది. కానీ వెంటనే ఒక లేక్ వద్ద అన్నా అదృశ్యమవుతుంది. ఇక ఈ కేసును పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. కానీ ఎల్లీ స్వయంగా లేక్‌లో అన్నా ను వెతకడం మొదలుపెడుతుంది. ఈ సమయంలో ఎల్లీ ఒక ఎండిపోయిన లేక్‌బెడ్‌లోకి వెళ్లి, అనుకోకుండా మూడు రోజుల వెనక్కి టైమ్ ట్రావెల్ చేస్తుంది. ఇది చూసి ఎల్లీ షాక్ అవుతుంది. ఆమె మళ్లీ లేక్‌లోకి వెళితే, అన్నా తప్పిపోయిన సమయానికి చేరుకుంటుంది.
ఎల్లీ టైమ్ ట్రావెల్ చేసి 2022 నుంచి 2005కి వెళ్తుంది. ఒక గ్రాసరీ స్టోర్ వద్ద తన తల్లి నెక్లెస్‌ను చూసి, దాన్ని దొంగిలించే ప్రయత్నంలో ఒక మహిళతో గొడవపడుతుంది. ఆమె ఎవరో కాదు ఆమె తల్లి సెలెస్ట్, ఎల్లీని బేబీగా పట్టుకుని ఉంటుందని తెలుస్తుంది. ఇంటర్నెట్ కేఫ్‌లో ఎల్లీ అన్నా లాంగ్ అనే మహిళ గురించి సెర్చ్ చేస్తుంది. అన్నా తన అమ్మమ్మ అని, పారిస్ తన తండ్రి అని గుర్తిస్తుంది. అక్కడ ఆమె తన కుటుంబ రహస్యాలను తెలుసుకుని మళ్ళీ 2022 కి తిరిగి వస్తుంది. ఆతరువాత ఈ సినిమా క్లైమాక్స్ కూడా ఊహించని మలుపులతో ముగుస్తుంది. చివరికి ఎల్లీ తన కుటుంబం గురించి తెలుసుకున్న సీక్రెట్స్ ఏమిటి ? అన్నా మిస్సింగ్ టైమ్ ట్రావెల్ ద్వారానే జరిగిందా ? ఈ సినిమా క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలంటే, ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాను మిస్ కాకుండా చుడండి.
‘Caddo Lake’ 2024లో విడుదలైన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రం. సెలిన్ హెల్డ్ దర్శకత్వంలో, ఎం. నైట్ శ్యామలన్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. ఇందులో డైలాన్ ఓ’బ్రియన్ (పారిస్), ఎలిజా స్కాన్‌లెన్ (ఎల్లీ), లారెన్ అంబ్రోస్ (సెలెస్ట్), ఎరిక్ లాంజ్ (డానియల్), కరోలిన్ ఫాల్క్ (అన్నా) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 అక్టోబర్ 10న HBO MAX లో విడుదలై, 1 గంట 39 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 6.8/10 రేటింగ్ పొందింది. హులు, అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులో ఉంది.
Read Also : లవర్స్ మధ్యలో మరో అమ్మాయి… మెంటలెక్కించే తుంటరి పనులు…. ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు మావా