E-Paper
Advertisement

కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయి.. సజ్జనార్ తాట తీస్తాం.. పాడి కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు!

కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయి.. సజ్జనార్ తాట తీస్తాం.. పాడి కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు!
Advertisement

Padi Kaushik Reddy: కాంగ్రెస్ బీజేపీ లు కుమ్మక్కయ్యాయని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్ లో గురువారం మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో హైకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు అద్భుతం అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత కోసం 2024 మార్చి 24 నుంచి బీఆర్ఎస్ లీగల్ సెల్ పోరాడుతోందన్నారు.

పిటిషన్ వేసిన నాడే దానం నాగేందర్ పై వేటు పడుతుందని చెప్పామని పాడి కౌశిక్ గుర్తుచేశారు. మిగతా ఎనిమిది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో బీజేపీ ఎందుకు పోరాడలేదని ప్రశ్నించారు. రెండున్నరేళ్ల మా పోరాటం తర్వాత దానంపై వేటు పడిందన్నారు. పోరాటం చేసింది బీఆర్ఎస్సా? బీజేపీయా? అని ప్రశ్నించారు. సిగ్గు లేకుండా ఇపుడు తమ ఘనత అని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.

Advertisement

కాంగ్రెస్ ఖైరతాబాద్ లో ఓడిపోతుందని తెలిసే సుప్రీం కోర్టుకు వెళ్లిందని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ కు ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదేనన్నారు. పార్టీ మారిన మిగతా ఎనిమిది మందిపై కూడా వేటు తప్పదన్నారు. త్వరలోనే ఆ ఎనిమిది నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు వస్తాయన్నారు. ఖైరతాబాద్ లో 22 ఏ ప్రభావం ఉంటుందని, నిరుద్యోగులు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పని చేస్తారన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇక జీవితంలో వార్డు మెంబర్లుగా కూడా గెలవరన్నారు.

Also Read: ‘సీఈసీ జ్ఞానేష్ కుమార్ దేశద్రోహి.. తక్షణమే రాజీనామా చేయాలి’.. రాహుల్ సంచలన డిమాండ్!

Advertisement

మరోవైపు గణేష్ విగ్రహాల నిమజ్జననానికి కనీసం నీళ్లు వసతి కూడా ఇవ్వని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కౌశిక్ రెడ్డి దుయ్యబట్టారు. అటు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తన నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. నిమజ్జనాల సందర్భంగా కేసీఆర్ పాటలు పెట్టడంపై నిషేధాలు విధించడానికి సజ్జనార్ ఎవరుని ప్రశ్నించారు. ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారా? అని నిలదీశారు. బ్రేక్ ఫాస్ట్, లంచ్ ఎప్పుడు చేయాలి? అని కూడా సజ్జనార్ చెబుతారా అంటూ ప్రశ్నించారు. తాము అధికారం లోకి రావడం ఖాయమన్న కౌశిక్ రెడ్డి.. సజ్జనార్ ఎక్కడున్నా వదిలిపెట్టమని తాట తీస్తామని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Also Read: ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ సీన్‌తో సెటైర్లు!

Tags

Related News

ఏ వేళలో ఏ విగ్రహం? ఖైరతాబాద్, బాలాపూర్ గణపయ్యల నిమజ్జనం టైమింగ్స్, రూట్ ప్లాన్ ఇదే!

మేం ఎన్నికలకు భయపడం.. ఖైరతాబాద్‌లోనూ కాంగ్రెస్‌దే గెలుపు: ఎంపీ చామల

ఆయిల్ పామ్ రైతులకు ఊహించని షాక్.. కేంద్రం నిర్ణయంపై భగ్గుమన్న మంత్రి తుమ్మల!

దానం అనర్హతతో తొలి వికెట్ పడింది.. మరిన్ని పడటం ఖాయం.. కేటీఆర్ ధ్వజం!

ఏసీబీ దూకుడు.. భీంరెడ్డి బినామీ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు

సిరిసిల్లలో 8 వేల ఎకరాల భూవివాదం.. అసలు లెక్క తేలేదెప్పుడు?

నిమజ్జనాల్లో అమ్మాయిలను వేధిస్తే ఇదే గతి.. 1,530 మందిపై కేసులు నమోదు

Big Stories

Advertisement
×