Shahrukh Khan:ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా అభిమానులతో ముచ్చటించడం కోసం ఆస్క్ మీ ఎనీథింగ్ అనే సెషన్ ని ఏర్పాటు చేస్తూ ఎక్స్ వేదికగా..ఇంస్టాగ్రామ్ వేదికగా.. అభిమానులతో ముచ్చటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటారు. అలా తాజాగా బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్(Shahrukh Khan) కూడా తన ఎక్స్ ఖాతా ద్వారా ‘ఆస్క్ మీ ఎస్ఆర్కే’ అనే సెషన్ ని స్టార్ట్ చేశారు. ఇందులో పాల్గొన్న ఎంతోమంది నెటిజెన్స్ షారుఖ్ ఖాన్ ని ఎన్నో ప్రశ్నలు అడిగారు. అయితే ఒక ఎక్స్ యూజర్ ఏకంగా షారుఖ్ ఖాన్ ని రిటైర్మెంట్ తీసుకోండి..మీకు ఏజ్ అయిపోయింది అని అడగడంతో ఆయనకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు షారుఖ్.. మరి ఇంతకీ షారుఖ్ ఇచ్చిన ఆన్సర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నా కొడుకును హీరోగా కాదు.. దర్శకుడిగా ఆదరించండి – షారుక్ ఖాన్
ఆస్క్ మీ ఎస్ ఆర్ కె(Ask Me SRK) లో చాలామంది నెటిజన్స్ ఆర్యన్ ఖాన్ (Aryan Khan) ఇండస్ట్రీలోకి హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు అని షారుక్ ఖాన్ ని అడిగారు. అంతేకాదు ఓ X యూజర్ నేను అతన్ని సూపర్ హీరో పాత్రలో చూడాలనుకుంటున్నాను అని అడిగాడు. దానికి షారుక్ స్పందిస్తూ.. “బాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఆర్యన్ ఖాన్ (Aryan Khan)కి సపోర్ట్ అందించండి. ఇప్పుడు ఇంట్లో మాకు ఈ పోటీ వద్దు” అని అన్నారు. అంటే ప్రస్తుతం షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ బాలీవుడ్ లో డైరెక్టర్ గా రాణించాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన కొడుకుని హీరోగా కాకుండా డైరెక్టర్ గా ఆదరించండి అన్నట్టు సమాధానం ఇచ్చారు.అయితే షారుక్ ఖాన్ కొడుకు ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్(The Bads Of Bollywood) అనే వెబ్ సిరీస్ కి డైరెక్షన్ వహించారు. అందుకే డైరెక్టర్ గా తన కొడుకుని ప్రోత్సహించండి అంటూ షారుక్ ఖాన్ ఆన్సర్ ఇచ్చారు..
రిటైర్మెంట్ తీసుకోండి అన్న నెటిజన్.. షారుక్ ఏమన్నారంటే ?
ఇక మరో X యూజర్ బ్రదర్ మీ ఏజ్ అయిపోయింది.. వృద్ధాప్యంలోకి వచ్చేసారు.. ఇక మీరు ఇండస్ట్రీకి రిటైర్మెంట్ ప్రకటించి, చిన్న హీరోలకు అవకాశం ఇవ్వాలి అంటూ రాసుకు వచ్చాడు. అయితే ఆ ఎక్స్ యూజర్ అడిగిన ప్రశ్నకి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు షారుఖ్. ఈ ప్రశ్నకి షారుఖ్ స్పందిస్తూ.. “ఈ చైల్డిష్ ప్రశ్నల నుండి మీరు బయటపడినప్పుడు మంచి మంచి ప్రశ్నలు అడగగలుగుతారు. అప్పటివరకు దయచేసి మీరు తాత్కాలికంగా రిటైర్మెంట్ తీసుకోండి”.. అంటూ దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు. ప్రస్తుతం షారుక్ ఖాన్ ఆ X యూజర్ కి ఇచ్చిన ఆన్సర్ నెట్టింట వైరల్ గా మారింది.దీంతో షారుక్ ఖాన్ అభిమానులు ఈ ట్వీట్ ని తెగ వైరల్ చేస్తున్నారు.
షారుక్ మూవీలు..
షారుఖ్ ఖాన్ చివరిగా ఢంకీ (Dunki)మూవీతో అభిమానులను పలకరించారు. ప్రస్తుతం ఈయన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో కింగ్(King) అనే మూవీలో నటిస్తున్నారు.
ALSO READ:Bigg Boss: బిగ్ బాస్ విన్నర్ ఇంటిపై కాల్పులు.. కుటుంబం 12 రౌండ్లు గన్ తో..