Bigg Boss:వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ ఓటీటీ (హిందీ) సీజన్ 2 విజేత యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆదివారం తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో గురుగ్రామ్ లోని ఎల్విష్ ఇంటి వద్దకు ముగ్గురు గుర్తుతెలియని దుండగులు బైక్ పై వచ్చి.. ఏకంగా 12 రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని ఫోరెన్సిక్ బృందాల సహాయంతో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని స్పష్టం చేశారు. అయితే ఎవరు ఇలా ఎల్విష్ యాదవ్ ఇంటిపై కాల్పులు జరిపారు.. అంతలా ఏకంగా 12 రౌండ్లు జరపడం వెనుక అసలు కారణం ఏంటి? అనే విషయాలు మాత్రం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
వివాదాల్లో చిక్కుకున్న ఎల్విష్ యాదవ్..
ఇకపోతే గత కొంతకాలంగా యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే.. 2024లో నోయిడా పోలీసులు ఈయనను రేవ్ పార్టీలో అరెస్టు చేశారు. కారణం ఈయన దగ్గర పాము విషం ఉండడం.. ముఖ్యంగా రేవ్ పార్టీలో పాము విషం సరఫరా చేస్తున్నట్టు తెలియడంతో అక్కడికక్కడే పోలీసులు అరెస్టు చేశారు. ఇతడి దగ్గర నుంచి 9 పాములతో పాటు సుమారుగా 20 ml పాము విషం స్వాధీనం చేసుకున్నారు. అలాగే కాశీ విశ్వనాథ ఆలయ ప్రాంగణంలో ఫోటోలు, వీడియోలు తీసినందుకు కూడా ఈయనపై కేసు నమోదవడం జరిగింది. ఇలా పలు వివాదాలలో చిక్కుకున్నారు.
ఇప్పటికే ఎల్విష్ యాదవ్ పై కేసు నమోదు..
ఇదిలా ఉండగా ఎల్విష్ యాదవ్ పై ఇదివరకే కేస్ నమోదైన విషయం తెలిసిందే. అసలు విషయంలోకి వెళ్తే.. జైపూర్ లోని ఒక రెస్టారెంట్లో ఒక వ్యక్తిని ఎల్విష్ యాదవ్ చెంప పగలగొట్టాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇలా పలు వివాదాల నడుమ చిక్కుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు ఎల్విష్ యాదవ్.
ఎల్విష్ యాదవ్ కెరియర్..
ఎల్విష్ యాదవ్ కెరియర్ విషయానికి వస్తే.. కలర్స్ టీవీ లాఫ్టర్ చెఫ్స్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ లో పాల్గొని సందడి చేశారు. ఒక 1997 సెప్టెంబర్ 14న హర్యానాలో జన్మించిన ఈయన బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీ పూర్తి చేసి ఢిల్లీలోని హన్స్ రాజ్ కళాశాలలో చేరాడు. 2024 నాటికి 15.5 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు పొందిన ఈయన 134 మిలియన్ వీక్షణలు ఉన్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు ఆ విలువ మరింత పెరిగిందని చెప్పవచ్చు.
ALSO READ:Bigg Boss 9 : బిగ్ బాస్ నుండీ అదిరిపోయే అప్డేట్.. ఈమె కన్ఫామ్!