Maharashtra FDA: సెలబ్రిటీలకు ప్రేక్షక ఆదరణ ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆ ప్రేక్షకాదరణను కొంతమంది సెలబ్రిటీలు ఆసరాగా చేసుకుని, సంపాదన కోసం కొన్ని ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ.. వారి ప్రాణానికి హానికరంగా మారుతున్నారనే కామెంట్లు ఎప్పటినుంచో వినిపిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు మహారాష్ట్రలో నిషేధించబడిన పాన్ మసాలా బ్రాండ్ ను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన నోటీసులకు ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలైన షారుక్ ఖాన్, టైగర్ ష్రాఫ్, అజయ్ దేవగన్ స్పందించారు.
విమల్ ఇలాచి ప్రకటనకు సంబంధించి ఎఫ్డిఏ పంపిన నోటీసులపై ఈ ముగ్గురు నటులు కూడా తమ సమాధానాలను అందజేసినట్లు సమాచారం.. ఇకపోతే విచారణ కోరగా.. ఆ విచారణ ప్రక్రియ పూర్తయిందని ఎఫ్డిఏ కమిషనర్ తుకారం ముండే వెల్లడించారు. నిషేధిత పాన్ మసాలా ఉత్పత్తులకు ఎలాచీ పేరుతో పరోక్ష ప్రకటనలు ఇస్తున్నారు అనే ప్రధాన ఆరోపణలపై ఎఫ్డిఏ చట్టపరమైన చర్యలను మరింత వేగవంతం చేసింది. ఈ ప్రకటనల ప్రచారంలో పాల్గొన్నందుకుగాను ఈ ముగ్గురు నటులకు గతంలో ఎఫ్డిఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాంట్రాక్టులు, రెమ్యూనరేషన్ విషయాలు, కాంపెయిన్ వంటి పత్రాలను సమర్పించాలని, తప్పుదారి పట్టించే ఆహార ప్రకటనల చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని కూడా నోటీసుల్లో కోరింది.
ఈ ప్రకటనలకు సంబంధించిన సోషల్ మీడియా పోస్టులను కూడా వెంటనే తొలగించాలని ఆదేశించింది. మహారాష్ట్రలో గుట్కా పాన్ మసాలా తయారీ కఠినమైన నిషేధం ఉన్నందున ఈ నిబంధనల ఉల్లంఘన పై ఎఫ్ డి ఏ కఠినంగా వ్యవహరిస్తోంది. విచారణ పూర్తయిన నేపథ్యంలో ఎఫ్డిఏ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై ఇప్పుడు సినీ వర్గాలలో తీవ్ర ఆసక్తి నెలకొంది. మరొకవైపు ఈ ముగ్గురు నటులు తమ సమాధానాలు అందజేసినట్లు ఎఫ్డిఏ కమిషనర్ తెలిపారు. మరి వీరు తమకు పంపిన నోటీసులపై ఏవిధంగా స్పందించారు అనే విషయంపై క్లారిటీ లేదు.
షారుఖ్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే.. షారుక్ ఖాన్ ప్రస్తుతం డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో కింగ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు పఠాన్ 2 లో కూడా నటిస్తున్నారు.
also read:ప్రత్యేకంగా ఆ అభిమానిని కలిసిన తారక్.. వీడియో వైరల్!..
ఇక అజయ్ దేవగన్ చిత్రాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈయన దృశ్యం : ది కంక్లూజన్ లో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ రెండవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరో నటుడు టైగర్ ష్రాఫ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. యాక్షన్ థ్రిల్లర్ వజ్రా మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్ మధువాణి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే లగ్ జా గాలే అనే చిత్రంలో నటిస్తున్నారు . ఈ సినిమా వచ్చే ఏడాది మే 14న విడుదల కానుంది. అలాగే మరో కొన్ని ప్రాజెక్టులకు కూడా ఈయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.