VB-G RAM G: సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మండల, జిల్లా అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా 12 వేలకు పైగా సర్పంచులు హజరయ్యారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుపై క్షేత్రస్థాయి పరిస్థితులను మంత్రి సీతక్క సమీక్షించారు. గ్రామాల్లో పనుల గుర్తింపు, ఉపాధి కల్పన, పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు.
ఎల్లీనో ప్రభావం ఉంది కాబట్టి సర్పంచులు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రీ సీతక్క తెలిపారు. వర్క్ ఫ్రం హోం తరహాలో సర్పంచులు వర్క్ ఫ్రం విలేజ్ లాగా.. వర్క్ ఫర్ విలేజ్ లాగా పనిచేయాలని, ఉపాధి హామీ నిధులను సర్పంచ్లు వినియోగించుకోవాలన్నారు. ఇప్పుడు ఉపాధి హామీ నిధులు సద్వినియోగం చేసుకోకుంటే రాబోయే కాలంలో మీకు నిధులు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి గ్రామపంచాయతీలో సర్పంచ్ కథానాయకుడిగా వ్యవహరించి పనులు వేగవంతం చేయాలని అన్నారు. మీరు ఎన్ని పనులు చేయిస్తే అని నిధులు కేటాయిస్తామని ఈ ప్రభుత్వం కూడా అందరు సర్పంచ్‌లతో సమావేశం ఏర్పాటు చేయలేదని అన్నారు.
ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సర్పంచ్ అందరితో ప్రభుత్వం సమావేశం అవుతుందని, మాది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి సర్పంచులు ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి ప్రణాళికలు గ్రామాలు రక్షించుకుంటున్నామని సీతక్క అన్నారు. మన ఊరు మనం బాగు చేసుకోవాలి అన్న స్ఫూర్తితో పని చేయాలని, ప్రజలకు ఉపాధి పనులు కల్పించడంతోపాటు ఊర్లకు ఆస్తులు సృష్టించాలని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీకి 25 లక్షల నుంచి కోటి వరకు ఉపాధి నిధులు వస్తాయని అన్నారు. మహత్మ గాంధీ జయంతి సందర్భంగా గ్రామ సమగ్ర ప్రణాళికలు ఆవిష్కరించుకోవాలని, వ్యవసాయ పనులు తగిన నేపథ్యంలో ప్రతి రోజు కనీసం 6,00,000 మంది కూలీలు వచ్చేలా చూసుకోవాలని అన్నారు.
గ్రామ పంచాయతీలకు, నిధులు, విధులు, అవసరాలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో కొన్ని జిల్లాలకే నిధులు కేటాయించారు. కానీ మా ప్రభుత్వం అన్ని జిల్లాలకు అన్ని గ్రామాలకు సమన్యాయం చేస్తుందని అన్నారు. ప్రతి జిల్లాకు, ప్రతి గ్రామానికి అవసరాలు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించామని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలను నిర్లక్ష్యం చేయవద్దని, ఏజెన్సీ ఆవాసాల్లో మట్టి, మొరం రోడ్లు వేయాలని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి నీటి బొట్టుని ఒడిచి పట్టుకునే విధంగా చెక్ డాం నిర్మించాలని మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు.
Also Read: చనిపోతూ ఫ్రెండ్ ఇచ్చే భారీ కుక్క… వదిలించుకోడానికి నానాతంటాలు… క్లైమాక్స్ చూస్తే కన్నీళ్ళు ఆగవు