E-Paper
Advertisement

రీల్స్ చూసి ఆసుపత్రిపాలైన షకీలా!

రీల్స్ చూసి ఆసుపత్రిపాలైన షకీలా!
Advertisement

Actress Shakeela: ప్రముఖ సినీనటి షకీలా (Shakeela) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన నటనతో.. ఎక్కువగా వ్యాంప్ పాత్రలు పోషిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. ఈ మధ్యకాలంలో సినిమాలలో అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అలాంటి ఈమె ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచింది. ఏకంగా రీల్స్ చూస్తూ ఆసుపత్రి పాలైనట్లు.. ఇందుకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీల్స్ చూస్తూ హాస్పెటల్ పాలవ్వడం ఏంటి? అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. పైగా ఆమెకు సర్జరీ కూడా జరిగింది. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

రీల్స్ చూస్తూ హాస్పిటల్ పాలైన షకీలా..

షకీలా ఇటీవల తనకు ఎదురైన ఒక భయంకరమైన ఆరోగ్య సమస్య గురించి తాజాగా అభిమానులతో పంచుకున్నారు. అతిగా మొబైల్ ఉపయోగించడం వల్ల తాను తీవ్రమైన మెడ నొప్పితో బాధపడ్డానని, దీనికోసం ఏకంగా రూ.3 లక్షల ఖర్చుతో శస్త్ర చికిత్స కూడా చేయించుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ..” ఫోన్ చాలా ముఖ్యం. కానీ అవసరానికి మించి దానిని ఎవరూ ఉపయోగించకండి. ఉపయోగం లేని వీడియోలను చూస్తూ సమయాన్ని అసలుకే వృధా చేయకండి. సరిగ్గా వాడకపోతే డబ్బులు పోవడమే కాకుండా భరించలేని నరకయాతనను అనుభవించాల్సి వస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఫోన్ ఇవ్వడంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొబైల్ వాడకాన్ని చాలా వరకు తగ్గించండి.

సర్జరీ కోసం మూడు లక్షలు..

Advertisement

ఎందుకంటే నేను ఫోన్లో చాలాసేపు గేమ్స్ ఆడటం , యూట్యూబ్, ఇన్స్టా లో రీల్స్ చూడడం వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది. నిద్రపోయే సమయంలో కూడా ఒక పక్కకు వాలి గంటల తరబడి ఫోన్ చూడడంతో మెడలోని నరాలపై తీవ్ర ప్రభావం పడిందని , అందుకే శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. పైగా దీనికి మూడు లక్షలు ఖర్చు కూడా అయింది.. దయచేసి ఎవరూ కూడా మొబైల్ ఫోను అవసరానికి మించి ఉపయోగించకండి” అంటూ స్వీయ అనుభవాన్ని పంచుకుంది షకీలా. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

also read: బ్రేకప్ పై స్పందించిన అనుపమ.. ఇంకొన్నాళ్లు రిలేషన్షిప్ లో ఉండుంటే చనిపోయేదాన్ని!

షకీలా కెరియర్..

Advertisement

షకీలా కెరియర్ విషయానికొస్తే 18 సంవత్సరాల వయసులోనే ప్లే గర్ల్స్ అనే తమిళ చిత్రం ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. 2000 సంవత్సరంలో వచ్చిన మలయాళ చిత్రం కిన్నారా తుంబికల్ ఆమె కెరియర్ ను ఊహించని మలుపు తిప్పింది. ఇక తెలుగు విషయానికొస్తే ప్రముఖ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత బంగారం , తొట్టి గ్యాంగ్, నిజం ఇలా ఎన్నో చిత్రాలతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న షకీలా.. అప్పుడప్పుడు దర్శనమిస్తున్నా.. గతంలో బిగ్ బాస్ షోలో కూడా సందడి చేసింది. అక్కడ ఎక్కువ కాలం నిలవలేక బయటకు వచ్చిన ఈమె.. ఇప్పుడు మళ్లీ ఇన్ని రోజుల తర్వాత అనారోగ్య పరిస్థితితో అందరినీ ఆశ్చర్యపరిచింది.

Related News

చచ్చిపోతామని డ్రామా ఆడారు.. పూరి, ఛార్మి లీలలు బయటపెట్టిన ప్రొడ్యూసర్!

బూతులు తిడుతూ..చచ్చిపో అంటూ శాపాలు… రేణు దేశాయ్ ఎమోషనల్!

‘ముంజ్యా’ బ్యూటీ శర్వరీకి క్రేజీ అవార్డ్… ఆమె చేసిన సినిమాల లిస్ట్ ఇదే!

ప్రమోషన్లలో రణబాలి సరికొత్త స్ట్రాటజీ.. సినిమాకు ప్లస్ అయ్యేనా?

ఆదర్శ కుటుంబం నుంచి ‘నారాయణమ్మ’ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్

వెంకటేష్ అంటే త్రివిక్రమ్ కు అంత భయమా.. ఎందుకో తెలుసా?

అమ్మ హీరోయినే..కూతురు హీరోయినే..ఇండస్ట్రీలో తల్లీకూతుర్ల హవా!

రూ.200 కోట్లు సాధ్యమేనా..? ‘ప్యారడైజ్’కి అసలు పరీక్ష ఇప్పుడే!

Big Stories

Advertisement
×