E-Paper
Advertisement

తక్కువ స్పేస్..ఎక్కువ పవర్! టాప్ 5 మినీ మిక్సీలు ఇవే

తక్కువ స్పేస్..ఎక్కువ పవర్! టాప్ 5 మినీ మిక్సీలు ఇవే
Advertisement

Best compact mixer grinder for home: చిన్న కిచెన్‌లలో పెద్ద మిక్సీలు కౌంటర్ స్పేస్‌ను ఆక్రమిస్తుంటాయి. ఇప్పుడు ఆ సమస్య ఉండదు! తక్కువ ప్లేస్‌లో ఇమిడిపోయే, బెస్ట్ ‘కాంపాక్ట్ మిక్సర్ గ్రైండర్లు’ మార్కెట్లోకి వచ్చేశాయి. ఇవి తక్కువ పరిమాణంలో ఉన్నా.. మసాలాలను మెత్తగా రుబ్బడంలో మాత్రం కింగ్స్. వంటగదిలో స్థలాన్ని ఆదా చేస్తూ.. వంటకు రుచినిచ్చే టాప్ 5 మినీ మిక్సర్ గ్రైండర్లు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని సేల్ ధరకే లభిస్తున్నాయి. ఇంతకీ ఎలాంటి మోడల్స్ తక్కువ ధరకే మంచి ఫర్ఫామెన్స్ ఇస్తున్నాయి. వీటి గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1.NutriBullet Pro (హై-స్పీడ్ బ్లెండర్):

ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న బ్రాండ్లలో ఇది ముందుంటుంది. ఇది కేవలం మసాలాలకే కాదు, హెల్దీ స్మూతీలకు కూడా అద్భుతంగా పని చేస్తుంది. దీని కాంపాక్ట్ సిలిండ్రికల్ డిజైన్ వల్ల మీరు కౌంటర్ మీద ఎక్కడైనా చాలా సులభంగా సర్దుకోవచ్చు. ఎండు మిరపకాయలు, ధనియాలు వంటి వాటిని క్షణాల్లో పొడి చేస్తుంది.

Advertisement

ధర:రూ.3,500 – రూ.4,200

2. Philips HL1606/03 500W మిక్సర్ గ్రైండర్:

Advertisement

ఫిలిప్స్ బ్రాండ్ అనగానే మనకు బెస్ట్ ఫర్ఫార్మెన్స్ గుర్తుకు వస్తుంది. ఇది 500 వాట్ల శక్తివంతమైన మోటార్‌తో వస్తుంది. చిన్న సైజులో ఉన్నా, కఠినమైన మసాలా దినుసులను కూడా ఇట్టే పొడి చేస్తుంది. చిన్న కుటుంబాలకు, బ్యాచిలర్లకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

ధర: రూ. 2,200 – రూ.2,700

3. Wonderchef Nutri-Blend:

స్టైలిష్ లుక్ , అత్యంత కాంపాక్ట్ సైజు కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులోని సర్జికల్ గ్రేడ్ బ్లేడ్లు చాలా షార్ప్‌గా ఉంటాయి. కాబట్టి గరం మసాలా వంటి దినుసులను అత్యంత మెత్తగా రుబ్బడంలో ఇది దిట్ట. తక్కువ ప్లేస్ తీసుకుంటుంది కాబట్టి కిచెన్ ఎప్పుడూ నీట్‌గా కనిపిస్తుంది.

ధర: రూ.1,900-రూ.2,500

4. Bajaj Rex 500W మిక్సర్ గ్రైండర్:

తక్కువ బడ్జెట్‌లో మంచి పవర్ కావాలంటే బజాజ్ రెక్స్ ఎప్పుడూ ముందుంటుంది. ఇది ఎక్కువ జార్లతో వస్తుంది. రోజువారీ వంటలకు కావలసిన అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చళ్లు, మసాలాలు రుబ్బడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది చాలా కాలం పాటు పాడవకుండా ఉంటుంది.

ధర: రూ.1,800-రూ.2,300

5. Prestige Iris 750W:

ఒకవేళ మీరు అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ మొత్తంలో మసాలాలు పట్టాలనుకుంటే.. ఈ మోడల్ తీసుకోవచ్చు. ఇందులో 750 వాట్ల పవర్ ఉన్నా.. దీని జార్ డిజైన్ చాలా కాంఫక్ట్‌గా ఉంటుంది. తక్కువ ధరలో బెస్ట్ గా పనిచేయగలిగే మోడల్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

ధర: రూ.2,800-రూ.3,300

Also Read: రూ.899కే బోట్ హెడ్‌ఫోన్స్.. ఆఫీస్ మీటింగ్స్, కాల్స్ కోసం ఫర్ఫెక్ట్

కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన  విషయాలు:

మినీ మిక్సర్ గ్రైండర్ కొనేటప్పుడు కేవలం సైజు మాత్రమే కాకుండా.. కొన్ని టెక్నికల్ అంశాలను కూడా గమనించాలి. మసాలాలు గట్టిగా ఉంటాయి కాబట్టి కనీసం 500 వాట్లు ఉన్న మోటార్ ఎంచుకోవడం మంచిది. అలాగే.. జార్స్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో ఉంటే శుభ్రం చేయడం ఈజీ. మోటార్ కాలిపోకుండా ఉంచే ఓవర్లోడ్ ప్రొటెక్షన్ (OLP) ఫీచర్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోవడం చాలా మంచిది.

చిన్న కిచెన్ ఉంది కదా అని వంట రుచిలో ఎప్పుడూ రాజీ పడాల్సిన అవసరం లేదు. పైన పేర్కొన్న ఈ 5 కాంపాక్ట్ మిక్సీలు మీ కౌంటర్ స్పేస్‌ను పూర్తిగా ఆదా చేయడమే కాకుండా.. మీ మసాలాల తాజాదనాన్ని కాపాడతాయి. మీ అవసరానికి, బడ్జెట్‌కు తగ్గట్లుగా వీటిలో ఒక దానిని ఎంచుకుని మీ వంటగదిని మరింత స్మార్ట్‌గా మార్చుకోండి!

Related News

ఉచిత ఇంటర్నెట్ టీవీకి చెక్? టెలికాం నిబంధనల దిశగా ట్రాయ్ అడుగులు!

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

Big Stories

Advertisement
×