Hyderabad Trump Towers: న్యూయార్క్ మాన్‌హట్టన్‌లో ట్రంప్ టవర్‌లో ఫ్లాట్ కావాలంటే చదరపు అడుగు లక్ష రూపాయలకు పైనే పెట్టాలి. అదే ట్రంప్ బ్రాండ్, అదే గోల్డెన్ లగ్జరీ హైదరాబాద్ కోకాపేటలో చదరపు అడుగు కేవలం 15 వేలు! అమెరికా ప్రెసిడెంట్ పేరుతో వెలుస్తున్న టవర్స్ ఇండియాలోనే ఎక్కువ ఎందుకున్నాయి? అందులోనూ హైదరాబాద్ ఎందుకు మోస్ట్ స్పెషల్ అయ్యింది? చూద్దాం ఈ స్టోరీ లో.
ట్రంప్ ఆర్గనైజేషన్ తన సౌతిండియాలో కొత్త లగ్జరీ ప్రాజెక్టుని హైదరాబాద్‌తో చేస్తోంది. అది కూడా ఇండియాలో వాళ్ల అతిపెద్ద లగ్జరీ ప్రాజెక్టుతో. కోకాపేటలోని గోల్డెన్ మైల్‌లో 22 లక్షల చదరపు అడుగులో దాదాపు 800 అడుగుల ఎత్తుతో 65 అంతస్తుల ట్విన్ టవర్స్. మొత్తం 450 అపార్టుమెంట్స్ లో 16 పెంట్ హౌస్‌లున్నాయి. దీనికి పెట్టుబడి సుమారు రూ.2,000 కోట్లు. ప్రాజెక్టు అమ్మకం విలువ అంచనా సుమారు రూ.3,500 నుంచి రూ. 4,200 కోట్లు రావచ్చని అంచనా. డిసెంబర్‌లో ఎరిక్ ట్రంప్ స్వయంగా వచ్చి లాంఛ్ చేయబోతున్నారు. కానీ లాంచ్‌కు ముందే కేవలం రెండు వారాల్లో 16 పెంట్ హౌస్‌లో 8 అమ్ముడుపోయాయి. వాటి విలువ రూ. 250 కోట్లు. అందులో ఒక హైదరాబాదీ వ్యాపార ఫ్యామిలీ ఏకంగా రూ. 62 కోట్లతో 4 పెంట్ హౌస్ లను కొనుగోలు చేసింది. ఇండియాలోని ట్రంప్ టవర్స్ టాప్-10 డీల్స్‌లో ఇది ఒకటి.
ఇక అసలు ట్విస్ట్ రేటులో ఉంది. న్యూయార్క్ Fifth Avenueలోని ఒరిజినల్ ట్రంప్ టవర్‌లో ఇటీవలి అమ్మకాలు చూస్తే 1,125 చదరపు అడుగు ఉన్న ఒక బెడ్ రూమ్ ప్లాట్ రూ.1.6 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. అంటే చదరపు అడుగు కి సుమారు 1,400 డాలర్లు. మన రూపాయిలో దాదాపు రూ. 1.2 లక్షలు. టాప్ ఫ్లోర్ 3 బెడ్ రూమ్స్ అయితే రూ.7.1 మిలియన్ డాలర్లు. ఆ లెక్కన చదరపు అడుగు రూ. 2.4 లక్షల పైమాటే.
హైదరాబాద్‌లోని కోకాపేట ట్రంప్ టవర్స్ బేస్ రేటు చదరపు అడుగు సుమారు రూ. 15,000 పడుతుంది. ఆ లెక్కన 3 BHK ధర రూ. 4.5 కోట్ల నుంచి మొదలు. అదే పెంట్‌హౌస్ కూడా యావరేజ్ గా చదరపు అడుగు రూ. 25,000లకు వెళ్లాయి. సింపుల్‌గా చెప్పాలంటే న్యూయార్క్‌లో ఒక చదరపు అడుగుకు పెట్టే డబ్బుతో హైదరాబాద్‌లో 8 చదరపు అడుగులు వస్తాయి!
ఇక్కడే భారత రియల్ ఎస్టేట్ స్పెషాలిటీ బయటపడుతుంది. మాన్‌హట్టన్‌లో ట్రంప్ బ్రాండెడ్ భవనంలో ధరలు ఒక దశలో నగర సగటు కంటే కిందకి పడిపోయిందని రీసెర్చ్ గ్రూప్ సిటీ రియాల్టీ పేర్కొంది. 2003 నుంచి ట్రాకింగ్ మొదలుపెట్టాక అలా జరగడం అదే మొదటిసారి. అంటే అక్కడ బ్రాండ్ ప్రీమియమ్ తగ్గిపోతోంది. కానీ ఇండియాలో దానికి అపోజిట్ అన్నమాట.
ముంబై వర్లీ ట్రంప్ టవర్‌లో చదరపు అడుగు రూ. 45,000. అదే కాంప్లెక్సులోని మిగతా టవర్స్ కంటే 30 శాతం ప్రీమియమ్. గురుగ్రామ్ ట్రంప్ ప్రాజెక్టు అయితే మూడేళ్లలో ధర రెట్టింపు అయ్యింది. రూ.15,500 నుంచి రూ. 33,000 కి చేరింది. అక్కడ ప్లాట్ ధరలు రూ.6 నుంచి 11 కోట్ల నుంచి రూ. 11-24 కోట్లకు పెరిగాయి. పుణెలోని కల్యాణి నగర్‌లో రూ23,000 నుంచి రూ.28,000 కి చేరింది. కోల్‌కతా ఈఎం బైపాస్ లో రూ.14,000-16,000 మధ్య ఉంది. ఇప్పటికే ఇండియా.. అమెరికా బయట ట్రంప్ రియల్ ఎస్టేట్‌కి అతిపెద్ద మార్కెట్. రాబోయే లాంచ్‌తో ఇండియాలో ట్రంప్ టవర్స్ సంఖ్య అమెరికాను దాటేస్తుంది. అమెరికా ప్రెసిడెంట్ బ్రాండ్‌కి అమెరికా కంటే ఇండియానే పెద్ద ఇల్లు అవుతోంది!
ఇప్పుడు హైదరాబాద్ విషయానికి వద్దాం. ముంబైలో రూ.45,000, గురుగ్రామ్‌లో రూ.33,000 ఉన్న ట్రంప్ బ్రాండ్, హైదరాబాద్‌లో రూ.15,000 కే ఎంట్రీ ఇస్తోంది. మేజర్ మెట్రో సిటీస్‌ల్లో ఇదే చీపెస్ట్. కానీ ప్రాజెక్టు మాత్రం ఇండియాలో అతి పెద్దది. 2.2 మిలియన్ చదరపు అడుగులు. అంటే తక్కువ రేటు. అతి పెద్ద ప్రాజెక్టు, అతి తక్కువ రేటు. ఇది హైదరాబాద్ వాల్యూకి పెద్ద సర్టిఫికెట్.
ఢిల్లీ-NCR బయర్లు కూడా హైదరాబాద్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ రూ. 270 కోట్లు దాటిన లగ్జరీ డీల్స్‌తో పోలిస్తే ఇక్కడి ధర చాలా ఆకట్టుకునేలా ఉంది. ORR కి కూతవేటు దూరంలో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ పక్కనే ఉన్న కోకాపేట ఇప్పటికే నియోపోలిస్ భూముల వేలంలో ఎకరా రూ.100 కోట్లు దాటి దేశం మొత్తాన్ని తల తిప్పి చూసేలా చేసింది. ఇప్పుడు ట్రంప్ బ్రాండ్ రావడంతో ఆ గోల్డెన్ మైల్‌కి గ్లోబల్ స్టాంప్ పడింది. ఇండియాలో ప్రీమియమ్ అపార్టుమెంట్ల ధరలు కొన్నిచోట్ల న్యూయార్క్ స్థాయిని తాకుతున్నాయి. హైదరాబాద్‌లో మాత్రం వరల్డ్ క్లాస్ బ్రాండ్‌ని తక్కువ ధరకే ఇస్తోందని రియాల్టీ నిపుణులు అంటున్నారు. లగ్జరీకి కూడా Hyderabad is the smartest buy in India.
ALSO READ: హైదరాబాద్ ట్రంప్ టవర్స్.. అప్పుడే బుకింగ్ మొదలు
మొత్తానికి న్యూయార్క్‌లో ఒక ప్లాట్ రేటుకి, హైదరాబాద్‌లో ట్రంప్ టవర్‌లో ఒక ఫ్లోర్ మొత్తం వచ్చేస్తుంది! మాన్‌హట్టన్ గ్లామర్, కోకాపేట్ రేటుకు ఇదే హైదరాబాద్ మ్యాజిక్. మరి ఈ ట్రంప్ ఎఫెక్టుతో కోకాపేట రేట్లు ఇంకెంత పెరుగుతాయో?