Vice Presidential Elections: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలిపొందారు. ఇండియా కూటమి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డిపై రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఈ మేరకు 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. రాధాకృష్ణన్ కు మొదటి ప్రాధాన్యత ఓట్లు 452రాగా.. సుదర్శన్ రెడ్డికి 300 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. కాగా ఈ ఎన్నికకు బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ సభ్యులు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ ఎన్నికలో 98.4 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం పోలైన ఓట్లు 767.. చెల్లని ఓట్లు 15.అంచనాలకు మించి సీపీ రాధాకృష్ణన్ కు అదనంగా ఏడు ఓట్లు వచ్చాయి. ఇండియా బలం కంటే సుదర్శన్ రెడ్డికి తక్కువగా ఓట్లు పోలయ్యాయి. ఆయనకు 20 ఓట్లకు తక్కువగా వచ్చాయి.
74 ఏళ్ల జగదీశ్ ధన్కఢ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో కేంద్రం ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 96 శాతం మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంట్ భవనం లోపల పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేయగా.. లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ రహస్య ఓటు ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది.
ALSO READ: Civils: మీరు డిప్రెషన్ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే సివిల్స్ సాధించడం చాలా ఈజీ.. ఎలానో తెలుసా?
1957లో అక్టోబర్ 20న జన్మించిన సీపీ రాధాకృష్ణన్.. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్, కోయంబత్తూరు నుంచి 1998, 1999లో రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగాను సేవలందించిన ఆయన.. 2023 ఫిబ్రవరి 12న జార్ఖండ్ గవర్నర్‌గా బాద్యతలు నిర్వర్తించారు. తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన తమిళిసై రాజీనామాతో రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆ టైమ్‌లో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న ఆయన తెలంగాణ అదనపు గవర్నర్‌గాను బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఆయన మహారాష్ట్ర గవర్నర్‌గాను ఎంపికయ్యారు.
ALSO READ: IOCL Jobs: ఇంటర్, డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. మంచివేతనం, దరఖాస్తు కొన్ని రోజులే గడువు