Varanasi Movie : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వారణాసి.. ఈ సినిమా కోసం అటు మహేష్ అభిమానులు ఇటు రాజమౌళి ఫ్యాన్స్ ఇద్దరు కూడా ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. మహేష్ బాబు లుక్ బయటకు రావడంతో సినిమా ఓ రేంజ్ లో ఉంటుంది అని ఆ మధ్య సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపించేవి.. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామని వెయిట్ చేస్తున్న అభిమానులకి ఇప్పుడు బాంబు లాంటి వారితో ఒకటి చెవి వినబడింది.. వారణాసి మూవీ షూటింగ్ కి బ్రేక్ పడింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. అసలు ఏమైంది? ఎందుకు షూటింగ్ ఆగిపోయింది? అన్నది ఇప్పుడు కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినిమాల కోసం జనాలు ఎంతగా వెయిట్ చేస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆయన ఏ హీరోతో సినిమా చేస్తాడు? ఎన్నేళ్ళకు సినిమా థియేటర్లలోకి రాబోతుంది అని జనాలలో గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి.. ప్రస్తుతం మహేష్ బాబుతో రాజమౌళి సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి వారణాసి అని టైటిల్ ని ఫిక్స్ చేశారు.. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. గ్యాప్ లేకుండా షూటింగ్ పూర్తి చేసి త్వరలోనే ప్రమోషన్స్ మొదలు పెట్టాలని ఆలోచనలో జక్కన్న ఉన్నట్లు తెలుస్తుంది.. ఇప్పుడు అనుకొని విధంగా ఈ సినిమాకు బ్రేక్ పడింది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.. మహేష్ బాబు తన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి ఫ్యామిలీ ట్రిప్ కు వెళ్తున్నారట.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మహేష్ బాబు ఫ్యామిలీ కనిపించారు.. ఎయిర్ పోర్ట్ లో ఉన్న పిక్స్ ను చూసి షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారా అని నెట్టింట ఓ వార్త ప్రచారంలో ఉంది.. అందుతున్న సమాచారం ప్రకారం జూలై 1 న మహేష్ తిరిగి ఇండియాకు రాబోతున్నారని సమాచారం.. మరి అప్పటి నుంచే షూటింగ్ లో జాయిన్ అవుతాడట.. ఈ వార్తల పై ఒక క్లారిటీ రావాల్సి ఉంది..
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ రాజమౌళి, క్రేజీ హీరో మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా అంటే జనాలు ఎలా ఉంటుందో చూడాలని వెయిట్ చేస్తున్నారు.. ఈ మూవీ షూటింగు ఎప్పుడో పూర్తి కావాల్సింది.. ఆ మధ్య మహేష్ బాబు కొన్ని కారణాలవల్ల షూటింగ్ కి బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తుంది.. ఆ తర్వాత సినిమాకు అనుకుని కారణాలవల్ల మళ్లీ బ్రేక్ పడింది.. ఇక ఇప్పుడు మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి ట్రిప్పుకు వెళ్లడంతో ఈ సినిమా షూటింగ్ కి మరోసారి బ్రేక్ వచ్చింది.. వచ్చేయడాది మార్చిలో సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.. ఈ క్రమంలో షూటింగ్ ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా మిగిలిన కార్యక్రమాలన్నీ పూర్తి చేయొచ్చు అని మహేష్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. మరి జక్కన్న అనుకున్న టైయానికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తాడా? లేదా అన్నది చూడాలి..
Also Read :సీరియల్స్ లలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న బెంగాలీ హీరోయిన్లు..