Pakistan Women Team: టి20 మహిళల ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ (2026 Women’s T20 World Cup Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న నేపథ్యంలో, పాకిస్తాన్ మహిళల జట్టు పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా తయారయింది. వరుసగా ఈ టోర్నమెంట్ లో నాలుగు ఓటములు చవి చూసిన పాకిస్తాన్ మహిళల జట్టు (Pakistan Women Team), ఇప్పటికే ఎలిమినేట్ అయింది. నిన్న ఆస్ట్రేలియా చేతిలో కూడా 113 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ మహిళ జట్టు డ్రెస్సింగ్ రూమ్ లో ( Pakistan Team Dressing Room) ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
పాకిస్తాన్ లేడీ క్రికెటర్ అలియ రియాజ్ (Aliya Riaz), తన భర్త అలీ యూనిస్ తో కలిసి ఇంగ్లాండులో షికార్లు కొడుతున్నారట. ప్రాక్టీస్ కు డుమ్మా కొట్టి మరీ, అతనితో ఎంజాయ్ చేస్తున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో అలియ రియాజ్ పై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు కెప్టెన్ ఫాతిమా సనా ( Fatima Sana
) ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అలియా రియాజ్ వర్సెస్ ఫాతిమా సనా మధ్య డ్రెస్సింగ్ రూమ్ లో పెద్ద గొడవ జరిగినట్లు సమాచారం అందుతోంది. ఇదంతా ఆస్ట్రేలియాతో నిన్న మ్యాచ్ జరగడం కంటే, ముందు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.
ఉమెన్స్ మహిళల టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్ 4 మ్యాచులు ఆడి, ఓటమిపాలైంది. బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిన నేపథ్యంలోనే టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయింది. ఈ క్రమంలో పాకిస్తాన్ లేడీ క్రికెటర్ అలియ రియాజ్ (Aliya Riaz) తన భర్తను ఇంగ్లాండుకు పిలిపించుకుందట. ఎలాగూ ఎలిమినేట్ అయ్యామన్న సంగతి తెలిసిన నేపథ్యంలో… తన భర్తతో ఇంగ్లాండులో షికార్లు కొడుతోందట అలియ రియాజ్. ప్రాక్టీస్ ఎగ్గొట్టి మరి.. అక్కడ చిల్ అవుతున్నారట. ఇక దీనిపై కెప్టెన్ ఫాతిమా సనా వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా భేఖాతరు చేశారని తెలుస్తోంది.
ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఫాతిమా సనా ఫిర్యాదు చేశారని సమాచారం. దీంతో సీరియస్ అయిన అలియ రియాజ్, డ్రెస్సింగ్ రూమ్ లో కెప్టెన్ ఫాతిమాతో గొడవ పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదంతా కోచ్ వహాబ్ రియాజ్ సమక్షంలోనే జరిగిందట. ఈ విషయం ఇంగ్లాండు మీడియాకు చేరడంతో… న్యూస్ బయటకు వచ్చింది. మరి దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
Aliya Riaz with her Husband Ali Younis 💕💕#cricket #Pakistan pic.twitter.com/eZsLRLrZfr
— Fourth Umpire (@UmpireFourth) April 19, 2024