E-Paper
Advertisement

అమ్మ, నాన్నల కోసం ఫోన్ కొంటున్నారా? మార్కెట్లోని సీనియర్ ఫ్రెండ్లీ మెుబైల్స్ ఇవే!

అమ్మ, నాన్నల కోసం ఫోన్ కొంటున్నారా? మార్కెట్లోని సీనియర్ ఫ్రెండ్లీ మెుబైల్స్ ఇవే!
Advertisement

Best Phones for Seniors: వయసు పైబడిన వారికి కొన్ని సందర్భాల్లో స్మార్ట్‌ఫోన్‌లు వినియోగం కష్టంగా మారవచ్చు. కంటికి స్పష్టంగా కనిపించే పెద్ద అక్షరాలు, వినసొంపైన పెద్ద శబ్దం, సులభంగా అర్థమయ్యే మెనూ ఫీచర్లు ఉన్న ఫోన్‌లనే వారు ఎక్కువగా ఇష్టపడతారు. ప్రస్తుతం మార్కెట్లో కీప్యాడ్ ఫోన్‌ల నుంచి అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌ల వరకు పెద్దలకు ఉపయోగపడే కొన్ని అత్యుత్తమ మొబైల్ ఫోన్‌ల వివరాలను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి.

నోకియా 2660 ఫ్లిప్ 4G

వృద్ధులకు పాతకాలపు ఫ్లిప్ మోడల్ ఫోన్‌లు చాలా బాగా నచ్చుతాయి. కాబట్టి వారికి నోకియా 2660 ఫ్లిప్ మోడల్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. ఇందులో పెద్ద కీప్యాడ్ బటన్లు ఉండటం వల్ల నంబర్లు నొక్కడం సులువవుతుంది. అలాగే కాల్ రాగానే ఫోన్‌ను పైకి తెరిచి మాట్లాడవచ్చు, మాట్లాడటం అయిపోయాక కిందకు మడతబెడితే కాల్ కట్ అయిపోతుంది. ప్రత్యేకంగా ఇందులో ‘SOS’ బటన్ ను అమర్చారు. అత్యవసర సమయంలో దీన్ని నొక్కితే కుటుంబ సభ్యులకు వెంటనే సమాచారం వెళ్తుంది. ఇందులో 4G కనెక్టివిటీ ఉండటం వల్ల వాయిస్ క్లారిటీ కూడా చాలా స్పష్టంగా ఉంటుంది.

హెచ్‌ఎండీ 110 4G, 105 4G

Advertisement

సీనియర్ సిటిజన్లకు ఈ రెండు ఫోన్‌లు చక్కగా సరిపోతాయి. ఇవి చూడటానికి సాంప్రదాయ కీప్యాడ్ ఫోన్‌లలానే ఉన్నప్పటికీ వీటిలో సరికొత్త 4G సాంకేతికతను అందించారు. యూపీఐ ద్వారా సులభంగా డిజిటల్ చెల్లింపులు చేసుకునే సదుపాయం కూడా ఇందులో ఉండటం విశేషం. హెచ్‌ఎండీ 110 4G మోడల్‌లో వెనుకవైపు సాధారణ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ ఉంటాయి. బ్యాటరీ లైఫ్ ఎక్కువ రోజులు రావడం వల్ల.. ఫోన్ చేతిలో పట్టుకోవడానికి తేలికగా ఉండటం వల్ల పెద్దవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ A17

పెద్ద స్క్రీన్ ఉండి, వాట్సాప్, యూట్యూబ్ వంటి యాప్‌లు వాడాలనుకునే వృద్ధులకు శాంసంగ్ గెలాక్సీ A17 మెుబైల్ బెస్ట్ ఆప్షన్. ఇందులో 6.7 అంగుళాల పెద్ద సూపర్ అమోలెడ్ (Super AMOLED) డిస్‌ప్లే ఉంది. ఇది అక్షరాలు, ఫోటోలను చాలా స్పష్టంగా చూపిస్తుంది. శాంసంగ్ ఫోన్‌లలో ఉండే ‘ఈజీ మోడ్’ (Easy Mode) ఫీచర్‌ను ఆన్ చేస్తే స్క్రీన్ మీద ఐకాన్లు, అక్షరాలు చాలా పెద్దగా మారిపోతాయి. దీనివల్ల కంటిపై ఒత్తిడి లేకుండా ఫోన్‌ను ఆపరేట్ చేయవచ్చు. దీని 5000 mAh బ్యాటరీ.. తరుచూ ఛార్జింగ్ పెట్టే తిప్పలను తగ్గిస్తుంది.

Advertisement

Also Read: ఖాతాదారులకు భారీ షాక్.. జులైలో ఏకంగా 12 రోజులు బ్యాంకులు బంద్.. ఎప్పుడెప్పుడంటే?

గూగుల్ పిక్సెల్ 10a

అత్యాధునిక ఫీచర్లు, అత్యుత్తమ భద్రతను కోరుకునే వారికి గూగుల్ పిక్సెల్ 10a చక్కగా సరిపోతుంది. ఇందులో ఎలాంటి అడిషనల్ యాప్స్ లేని క్లీన్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ ఉంటుంది. గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సాయంతో కేవలం నోటి మాటతోనే ఫోన్ కాల్స్ చేయడం, మెసేజ్‌లు పంపడం వంటివి చేయెుచ్చు. ఇందులో ఉండే గూగుల్ ఏఐ (AI) ఫీచర్లు.. స్పామ్ కాల్స్, మెసేజ్‌లను ఆటోమేటిక్‌గా గుర్తించి అలర్ట్ చేస్తాయి. తద్వారా వృద్ధులు సైబర్ మోసాల బారిన పడకుండా రక్షణ లభిస్తుంది.

Also Read: ఏసీ మనుషుల కోసం కనిపెట్టింది కాదా? హిస్టరీ తెలిస్తే ఫ్యూజులు ఎగరడం పక్కా!

Related News

మార్కెట్‌లో ఫుల్ క్రేజ్ ఉన్న ఇయర్‌బడ్స్..ఇప్పుడు ఆఫర్‌‌లో !

Whatsapp Webలో అదిరిపోయే అప్‌డేట్.. ఇకపై బ్రౌజర్‌ నుంచే గ్రూప్ వీడియో కాల్స్!

ఫోన్ వెనుక మరో డిస్‌ప్లేనా? టెక్నో నుంచి మైండ్ బ్లోయింగ్ 5G ఫోన్.. లాంచ్ డేట్ ఫిక్స్!

కిచెన్ జిడ్డుకు గుడ్‌బై చెప్పండి! అమెజాన్‌లో.. మోస్ట్ ట్రెండింగ్‌ చిమ్నీలు!

డిస్ట్రాక్షన్ ఫ్రీ హెల్త్ ట్రాకర్.. భారత్‌లోకి వచ్చేస్తున్న Google Fitbit Air, రేటు ఎంతంటే?

యాపిల్ iPhone Ultra రాకముందే.. ఫోల్డబుల్ మార్కెట్‌పై గూగుల్, శాంసంగ్ కన్ను!

లక్షల డాలర్లు తగలేసి ఇదేం డిజైన్ రా బాబు? Instagram కొత్త లోగోపై ఏకిపారేస్తున్న నెటిజన్లు!

రీచార్జ్ బాదుడుకి BSNL చెక్.. రూపాయికే సిమ్, 412 రోజుల వ్యాలిడిటీ!

Big Stories

Advertisement
×