E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

స్క్రీన్ పై నీతులు… స్క్రీన్ వెనుక కోతులు.. టాలీవుడ్ పై సింగర్ సునీత పంచ్

స్క్రీన్ పై నీతులు… స్క్రీన్ వెనుక కోతులు.. టాలీవుడ్ పై సింగర్ సునీత పంచ్
Advertisement

Singer Sunitha Comments: సినిమా ఇండస్ట్రీ …బయటికి కనిపించే వెలుగుల జిలుగుల కన్నా కనిపించని చీకటి కోణాలేన్నో.నటులది ఏముంది కెమెరా ముందు యాక్షన్ చెప్పగానే నటిస్తారు.కట్ చెప్తే ఆగిపోతారు.కానీ అసలు నటులు ,వారి డ్రామాలు కనిపించేది కెమెరాల వెనకాలే.ఇదే విషయాన్ని చెబుతూ ఏకిపారేసింది ప్రముఖ సింగర్ సునీత.వెండి తెరపై కనిపించే నైతిక విలువలు,సెంటి మెంట్లు అన్నీ తూచ్ అంటూ,ఆడవాళ్ళకి అసలు ఇక్కడ సేఫ్టీనే లేదని ఇండస్ట్రీ గుట్టుని మరోసారి బట్టబయలు చేసేసింది.

18 ఏళ్ల వయసులోనే అనుభవం 

మ్యాటర్ లోకి ఎంట్రీ ఇస్తే…తాజాగా సునీత ఒక ఒక ఇంటర్వ్యూ లో చేసిన కామెంట్స్ బట్టి చూస్తే టాలీవుడ్ లో ఉండే కొందరు పెద్ద మనుషులు ఎలాంటి ముసుగులు వేసుకొని తిరుగుతారో మరోసారి అర్థం అయింది.సింగర్ గా ఈవేళ లో అంటూ 1995లో ‘గులాబి’ తో మనందరి మనసుల్ని దోచేసిన సునీత 18 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో ఎదురైన అనుభవాన్ని పంచుకుంది.

Advertisement

also read:నేషనల్ అవార్డుల వార్ ..చిరంజీవి బన్నీని టార్గెట్ చేశాడా…ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

ఇండస్ట్రీలో ఒకరి వద్ద పతివ్రతుడిగా కనిపించే వాడు, ఒంటరిగా కనిపించే ఆడది కనిపిస్తే అసలు రంగు బయటపెడతాడని చెప్పుకొచ్చింది.అంటే సినిమాలో విలన్లు పేరుకే క్రూరంగా కనిపిస్తే,అసలు విలన్లు వైట్ అండ్ వైట్ జుబ్బా వేసుకుని కాసుల సూట్ కేసులతో తిరుగుతారని అర్థం అవుతుంది.అంటే సూపర్ మార్కెట్ లో ప్రొడక్ట్స్ కి టూ ఇన్ వన్ ఆఫర్ పెట్టినట్టు,ఇండస్ట్రీలో కొందరు టూ ఇన్ వన్ ఆఫర్ క్యారెక్టర్స్ మెయింటేన్ చేస్తున్నారన్న మాట.

వంకర ఫిలాసఫీలు చెబుతున్న మహానుభావులు 

Advertisement

ఇక ఇదే ఇంటర్వ్యూలో సునీత చెప్పిన లాజిక్ మాములుగా లేదండోయ్.. అవును..ఈ రోజుల్లో ఎవరైనా అమ్మాయిలు ‘నా శరీరం.. నా ఇష్టం’ అని అంటే ‘మరి నా కళ్ళు నా ఇష్టం’ వంకర ఫిలాసఫీలు చెబుతున్నారట.నిజంగా ఈ లాజిక్ లు గనుక సినిమాల్లో అప్లయ్ చేస్తే కాసుల వర్షం కురుస్తుందేమో. దాదాపు ముప్పయ్ ఏళ్లుగా ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ పాడిన ఒక సీనియర్ స్టారే ఇక్కడ రక్షణ లేదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తే ఇక కేవలం ఒకే ఒక్క ఛాన్స్ కోసం ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగే జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే దారుణంగా ఉంది.

also read:సుడిగాలి సుధీర్, రష్మిల మధ్య ఏం లేదా ..?

ఈ ఇష్యూ పై ఇంకెంతమంది గొంతులు విప్పుతారో 

ఇక ఇక్కడ కనిపించే మరో చిత్రం ఏంటంటే ఎవరైనా ఇలా క్యాస్టింగ్ కౌచ్ ఉందని, ఇలా కమిట్ మెంట్ అడిగారని నోరెత్తితే మాత్రం ‘అమ్మో.. అవునా? మాకు తెలీదే!’ అంటూ స్వాతి ముత్యంలో కమల్ హసన్ లా మొహాలు పెడతారు.అదే ఇక్కడ మ్యాజిక్కు. అయితే చిన్న వయసులోనే హెరాస్ మెంట్ కి గురయిన సునీత మాత్రం ఆ పేరు బయటపెట్టలేదు. ‘అది ఒక్కరి సమస్య కాదు, ఇక్కడ సగం మంది అంతంత మాత్రమే’ అని ఆమెకు ముందే తెలుసు కాబోలు. ఏది ఏమైనా స్క్రీన్ మీద నీతులు ఒలకబోసే మహానుబావులు స్క్రీన్ వెనుక మాత్రం కోతుల్లా ప్రవర్తిస్తారని సునీత కామెంట్స్ తో మరోసారి క్లారిటీ వచ్చేసింది. చూడాలి ముందు ముందు ఈ ఇష్యూ పై ఇంకెంతమంది గొంతులు విప్పుతారో !

Related News

సుడిగాలి సుధీర్, రష్మిల మధ్య ఏం లేదా ..?

నేషనల్ అవార్డుల వార్ ..చిరంజీవి బన్నీని టార్గెట్ చేశాడా…ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

వెండితెరపై ‘మీర్జాపూర్’ రచ్చ.. థియేటర్లలోకి కల్ట్ ఫ్రాంచైజీ!

‘తలైవర్ 173’ డైరెక్టర్స్ మారడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన రజనీకాంత్!

“మెగాస్టార్” మెచ్చిన “న్యూ ఏజ్ మెగాస్టార్”.. రామ్ చరణ్‌పై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!

వెంకీ లుక్ పై క్రేజీ రూమర్.. అనిల్ ప్లానేంటో అర్థంకాలేదే..!

మహేష్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. షూటింగ్ బ్రేక్..?

Big Stories

×