E-Paper
Advertisement

IRCTC అదిరిపోయే ఊటీ టూర్ ప్యాకేజీ.. ప్రకృతి ప్రేమికులకు 4 రోజులు పండుగే పండుగ!

IRCTC అదిరిపోయే ఊటీ టూర్ ప్యాకేజీ..  ప్రకృతి ప్రేమికులకు  4 రోజులు పండుగే పండుగ!
Advertisement

IRCTC’s Affordable Ooty Tour Package: ప్రకృతి అందాలను ఆస్వాదించాలని భావిస్తున్న పర్యాటకులకు భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) గుడ్ న్యూస్ చెప్పింది. తమిళనాడులోని పాపులర్ హిల్ స్టేషన్ ఊటీ, కూనూరును సందర్శించేందుకు ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ ఖర్చుతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ ప్యాకేజీ మంచి అవకాశంగా కల్పిస్తోంది.

నాలుగు రోజుల పాటు కొనసాగనున్న యాత్ర

ఈ టూర్ ప్యాకేజీ మొత్తం 3 రాత్రులు, 4 రోజుల పాటు కొనసాగుతుంది. ఒక్కో వ్యక్తికి ఈ ప్యాకేజీ ధర రూ.13,260గా నిర్ణయించారు. ఇందులో హోటల్ వసతి, భోజనం, స్థానిక రవాణా లాంటి పలు సౌకర్యాలను IRCTC కల్పిస్తోంది. ఊటీని “క్వీన్ ఆఫ్ హిల్స్” పిలుస్తారు. చల్లని వాతావరణం, పొగమంచుతో కప్పబడిన కొండలు, పచ్చని టీ తోటలు, ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలు ఈ ప్రాంతాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి. ప్రతి ఏడాది వేలాది మంది దేశీయ, విదేశీ పర్యాటకులు ఊటీని సందర్శిస్తుంటారు.

టూర్ లో సందర్శించే ప్రాంతాలు ఇవే!

Advertisement

ఈ ప్యాకేజీలో పర్యాటకులు ఊటీలోని అనేక ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ప్రముఖ బొటానికల్ గార్డెన్, ఊటీ సరస్సు, దొడ్డబెట్ట శిఖరం, టీ మ్యూజియం, పైకారా జలపాతం, ముదుమలై నేషనల్ పార్క్ లాంటి ప్రదేశాలను ఈ యాత్రలో చేర్చారు. అంతేకాదు, కూనూరులోని పలు అందమైన ప్రాంతాలను కూడా పర్యాటకులు వీక్షించవచ్చు. కూనూరు ప్రశాంత వాతావరణం, విస్తారమైన టీ తోటలు, కొండ ప్రాంతాల అద్భుత దృశ్యాలతో ఆకట్టుకంటుంది.  ఊటీకి మరో ప్రధాన ఆకర్షణ యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన నీలగిరి మౌంటెన్ రైల్వే టాయ్ ట్రైన్. ఈ రైలులో ప్రయాణించడం ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. కొండల మధ్య సాగిపోయే ఈ ప్రయాణం పర్యాటకులకు మరపురాని జ్ఞాపకాలను అందిస్తుంది.

అంతేకాకుండా, ఊటీలో బ్రిటిష్ కాలం నాటి నిర్మాణాలు, ఇంట్లో తయారుచేసే చాక్లెట్లు, అందమైన సరస్సులు, పూల తోటలకు కూడా ప్రసిద్ధి చెందింది. ప్రకృతి ప్రేమికులు, ఫోటోగ్రఫీ ఆసక్తి ఉన్నవాళ్లు, కుటుంబంతో ప్రశాంతమైన సెలవులు గడపాలనుకునే వారికి ఈ పర్యటన చాలా అనుకూలంగా ఉంటుంది.

Advertisement

తక్కువ ఖర్చుతో పూర్తి స్థాయి హిల్ స్టేషన్ అనుభూతిని అందించే ఈ టూర్ ప్యాకేజీకి మంచి స్పందన లభిస్తోంది. వేసవి, వర్షాకాలాల్లో ఊటీ మరింత అందంగా కనిపిస్తుండటంతో, ఈ సీజన్‌లో పర్యటన ప్లాన్ చేసుకునే వారికి ఇది మంచి ఎంపికగా మారనుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్ సమాచారం కోసం IRCTC టూరిజం అధికారిక వెబ్‌సైట్‌ (https://www.irctctourism.com/pacakage_description?packageCode=SEH051)ను సందర్శించాలని రైల్వే అధికారులు సూచించారు.

Read Also: జపాన్ టూర్‌కు IRCTC స్పెషల్ ప్యాకేజీ.. బుల్లెట్ రైలు ప్రయాణంతో 10 రోజుల టూర్!

Related News

హ్యుందాయ్ బేయాన్ బుకింగ్స్ ఓపెన్.. క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV!

ఈ కారు తనంతట తానే రివర్స్ వెళ్తుంది.. టక్సన్ టెక్నాలజీ చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా థార్ OG వచ్చేసింది.. కొత్త మోడల్ లో ఏం మారిందంటే?

హైదరాబాద్‌లో వింత కార్ల మ్యూజియం.. ప్రపంచంలో ఎక్కడా చూడని కార్లు ఇక్కడే!

హోండా నుంచి 3 కొత్త అప్ డేటెడ్ మోడళ్లు.. ధరలు, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

145 కి.మీ రేంజ్ తో హోండా కొత్త ఈవీ.. QC3 లుక్ ఏముంది భయ్యా!

అమ్మకాల్లో బిగాస్ దూకుడు.. లక్షకు చేరువలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి కొత్త కలర్.. సిగ్నేచర్ వైట్ అదిరిపోయిందిగా!

Big Stories

Advertisement
×