E-Paper
Advertisement

ప్రదీప్ రావత్ మృతిపై విస్తుపోయే నిజాలు బయటపెట్టిన కొడుకు!

ప్రదీప్ రావత్ మృతిపై విస్తుపోయే నిజాలు బయటపెట్టిన కొడుకు!
Advertisement

Pradeep rawat : సినీ పరిశ్రమలో గొప్ప నటుడిగా ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్న ప్రదీప్ రావత్ (Pradeep Rawat)అనూహ్యంగా 74 సంవత్సరాల వయసులో కన్నుమూయడం ఇండస్ట్రీని ఆశ్చర్యంలో ముంచేసింది. ఒకప్పుడు విలక్షణమైన నటనతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన.. ఇప్పటికీ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అలాంటి ఈయన ఉన్నట్టుండి మరణించారు అనే వార్త అందర్నీ అయోమయంలోకి నెట్టేసింది. అసలు ఏం జరిగింది ? మొన్నే కదా సినిమాలలో నటించారు.. అప్పుడే మరణం ఏంటి? అంటూ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇకపోతే ముంబైలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆగస్టు 5వ తేదీన తన కొడుకు విక్రమాదిత్య (Vikramaditya) చేతులమీదుగా ప్రదీప్ రావత్ అంత్యక్రియలు ముగిసాయి.

తండ్రి చివరి రోజులు గుర్తుచేసుకొని కొడుకు కన్నీళ్లు..

తన తండ్రి చివరి రోజులను గుర్తు చేసుకొని ఆయన కుమారుడు విక్రమాదిత్య మీడియాతో పంచుకున్న విషయాలు అందరిని కలచి వేస్తున్నాయి. విక్రమాదిత్య మాట్లాడుతూ..” మొదట మా నాన్నకు కడుపునొప్పి రావడంతో సాధారణ ఇన్ఫెక్షన్ గా భావించి, వైద్యుల వద్దకు వెళ్ళాము. మందులు వాడినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు సరి కదా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. దాంతో రక్త పరీక్ష చేయించగా తెల్ల రక్త కణాల సంఖ్య అసాధారణంగా పెరిగిపోయిందని వైద్యులు చెప్పడంతో వెంటనే ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్ కి తరలించాము.

కడుపునొప్పి అని వెళితే బ్లడ్ క్యాన్సర్ అన్నారు – విక్రమాదిత్య

Advertisement

అయితే అక్కడ జరిగిన వైద్య పరీక్షల్లో ఆయనకు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. రెండు నెలల క్రితమే అన్ని హెల్త్ చెకప్ లు చేయించాము. అప్పుడు అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి.. అయితే 40 రోజుల వ్యవధిలోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంత వేగంగా వ్యాధి తీవ్ర రూపం దాల్చుతుందని మేము కలలో కూడా అనుకోలేదు. కళ్ళు తెరిచి నిజం తెలుసుకునే లోపే అంతా అయిపోయింది.. మా నాన్న మమ్మల్ని వదిలి కానరాని లోకాలకు వెళ్లిపోయారు” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు విక్రమాదిత్య.

వారికి విక్రమాదిత్య కృతజ్ఞతలు..

విక్రమాదిత్య మాట్లాడుతూ.. “ఈ కష్ట సమయాలలో మా కుటుంబానికి అండగా నిలిచిన సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు, అభిమానులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మా నాన్న అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో హాజరై.. మా నాన్నకు ఘనంగా నివాళులర్పించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు” అంటూ విక్రమాదిత్య తెలిపారు.

Advertisement

also read: ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా చిరంజీవి.. స్పందించిన టీమ్!

ప్రదీప్ రావత్ సినిమా కెరియర్..

తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అంటూ పలు భాషా చిత్రాలలో నటిస్తూ సుమారుగా 150కి పైగా చిత్రాలలో నటించి విలక్షణ నటుడిగా గుర్తింపు సొంతం చేసుకున్నారు.. తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై, ఛత్రపతి వంటి చిత్రాలలో తనదైన మార్క్ కనబరిచిన ఈయన, ఆ తర్వాత వాల్తేరు వీరయ్య, సరైనోడు, దేశముదురు వంటి చిత్రాలతో విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు. తెలుగులో చివరిగా ఆయన నటించిన చిత్రం గాయపడ్డ సింహం సినిమాలో నటించారు. మరొకవైపు కన్నడలో త్రిశూలం అనే సినిమాలో నటించారు. కానీ ఇంకా ఆ చిత్రం విడుదల కాలేదు. ఏది ఏమైనా ఇంత గొప్ప నటుడు ఇంత త్వరగా లోకాన్ని వదిలి వెళ్లడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నాను.

Related News

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో గోల్డెన్ ఆఫర్!

నా సినిమాలు చూశావా? అని అడగలేకపోయా.. ప్రభాస్‌పై సందీప్ వంగా కామెంట్స్ వైరల్

వైజాగ్ లో బన్నీ AAA సినిమాస్ ఓపెనింగ్…. కానీ ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!

ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా చిరంజీవి.. స్పందించిన టీమ్!

లీకులు ఫుల్.. అప్‌డేట్ నిల్.. ఇదేం గేమ్ జక్కన్నా?

ఎవరీ వాసవి గణేషన్.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకుంటున్న బ్యూటీ!

వారణాసి షూటింగ్.. మహేష్ బాబు సీన్ లీక్.. వీడియో వైరల్

Big Stories

Advertisement
×