E-Paper
Advertisement

18 ఏళ్లకే హీరోయిన్ గా.. షావుకారు జానకి నటించిన చివరి తెలుగు చిత్రం!

18 ఏళ్లకే హీరోయిన్ గా.. షావుకారు జానకి నటించిన చివరి తెలుగు చిత్రం!
Advertisement

Sowcar Janaki:షావుకారు జానకి (Sowcar Janaki).. అలనాటి అందాల తార , ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి 94 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో చెన్నైలోనే కావేరి హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఆమె మరణ వార్త గురించి తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే ఆమె నటించిన తొలి చిత్రం, నటించిన చివరి చిత్రాలతో పాటు ఆమె కెరియర్ గురించి పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

15 ఏళ్లకే పెళ్లి.. 18 ఏళ్లకే సినీ ఇండస్ట్రీలోకి..

ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో 1931 డిసెంబర్ 12న శంకరమంచి జానకి గా జన్మించారు. ఈమె తండ్రి పేరు వెంకోజీ రావు.. ఈయన పేపర్ పరిశ్రమ నిపుణులు కాగా, తల్లి శచీదేవి గృహిణి. చిన్ననాటి నుంచే కలలపై ఆసక్తి పెంచుకున్న ఈమె తన 11వ యేటనే రేడియో నాటికల ద్వారా నటన రంగంలోకి అడుగుపెట్టారు. ఈమెకు 15 ఏళ్లకు వివాహమైనప్పటికీ నటన పట్ల ఉన్న అభిరుచితో రంగస్థలం నాటకాలలో పలు పాత్రలు పోషిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఇక 18 ఏళ్ల ప్రాయంలో విజయ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘షావుకారు’ అనే చిత్రం ద్వారా ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమయ్యారు. షావుకారు చిత్రంలో ఈమె నటించిన పాత్రకు విశేష ఆదరణ లభించడంతోపాటు సినిమా అఖండ విజయం అందుకోవడంతో షావుకారు జానకిగా చిత్ర సీమలో స్థిరపడిపోయారు.

Advertisement

also read:కన్నుమూసిన షావుకారు జానకి.. స్పందిస్తున్న సెలబ్రిటీలు!

ఏడాదికి 20కి పైగా చిత్రాలు:

ఏడాదికి 20కి పైగా చిత్రాలలో నటించిన ఈమె.. తన ఏడు దశాబ్దాల సినీ ప్రయాణంలో సుమారుగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కలుపుకొని.. 400కు పైగా చిత్రాలలో నటించారు. ఇకపోతే ఈమె నటించిన చిత్రాల విజయానికి వస్తే.. ముగ్గురు కొడుకులు, డాక్టర్ చక్రవర్తి , మంచి మనుషులు, రోజులు మారాయి వంటి చిత్రాలలో నటించిన ఈమె.. సీనియర్ ఎన్టీఆర్ కి జోడిగా వద్దంటే డబ్బు, కన్యాశుల్కం, సొంత ఊరు, జయం మనదే వంటి చిత్రాలలో నటించారు. అక్కినేని నాగేశ్వరరావు తో రోజులు మారాయి , డాక్టర్ చక్రవర్తి, అక్క చెల్లెలు వంటి చిత్రాలు కూడా చేశారు.ఇక షావు కారు జానకికి మంచి పేరు తీసుకొచ్చిన చిత్రాల విషయానికొస్తే తాయారమ్మ బంగారయ్య, సంసారం ఒక చదరంగం వంటి చిత్రాలు కాగా, కథానాయిక, తల్లి, నానమ్మ, అమ్మమ్మ పాత్రల్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు షావుకారు జానకి.

షావుకారి జానకి నటించిన చివరి చిత్రం..

Advertisement

ఇకపోతే నందిని రెడ్డి దర్శకత్వంలో 2023లో విడుదలైన అన్నీ మంచి శకునములే చిత్రంలో చివరిగా నటించారు షావుకారు జానకి. ఏడు దశాబ్దాల పాటు సాగిన సినీ ప్రస్థానంలో 2022లో 90 ఏళ్ల వయసులో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఇక సంసారం ఒక చదరంగం చిత్రానికి ఉత్తమ సహాయనటిగా నంది అవార్డు అందుకున్న ఈమె.. అమూల్య చిత్రానికి కూడా నంది అవార్డు అందుకున్నారు. వీటితోపాటు మరెన్నో పురస్కారాలను కూడా సొంతం చేసుకున్నారు షావుకారు జానకి.

Related News

అందరినీ తొక్కి చిరు మెగాస్టార్ అయ్యాడా.. కళ్యాణ్ దిలీప్ కామెంట్స్ వైరల్!

షావుకారు జానకికి ‘షావుకారు’ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

కన్నుమూసిన షావుకారు జానకి.. స్పందిస్తున్న సెలబ్రిటీలు!

పెద్ద వయసు అబ్బాయిలనే ఎందుకు ఇష్టపడతారు? రాశీ సింగ్ కామెంట్స్ వైరల్

ఇండస్ట్రీలో విషాదం.. షావుకారు జానకి కన్నుమూత!

స్పిరిట్ మూవీ నుండి దీపికాను తొలగించడంపై సందీప్ సోదరుడు క్లారిటీ!

వరుణ్ దావన్ బిగ్ అచీవ్‌మెంట్.. రియల్లీ గ్రేట్ అంతే..

Big Stories

Advertisement
×