E-Paper
Advertisement

టాలీవుడ్‌కు తెలంగాణ సర్కార్ ఫుల్ సపోర్ట్.. గిల్డ్ ప్రొడ్యూసర్స్ ఫుల్ హ్యాపీ

టాలీవుడ్‌కు తెలంగాణ సర్కార్ ఫుల్ సపోర్ట్.. గిల్డ్ ప్రొడ్యూసర్స్ ఫుల్ హ్యాపీ
Advertisement

Movie Ticket: తాజాగా తెలంగాణా సర్కార్ టికెట్ రేట్లని సవరిస్తూ కొత్త జీవో తీసుకొచ్చిన సంగతి తెల్సిందే.అయితే దీనిపై భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నాయి.ఈ రేట్లు మాకేమాత్రం గిట్టు బాటు కావంటూ థియేటర్, ఎగ్జిబిటర్ అసోసియేషన్ మండిపడితే తెలంగాణా ప్రభుత్వం తెచ్చిన జీవో కేవలం టికెట్ రేట్లు పెంచడం కోసం ఒకటే కాదని, భవిష్యత్ లో తెలుగు సినిమా స్థాయిని మార్చే ఒక అధ్బుతమైన నిర్ణయం అని ఆకాశానికి ఎత్తేసింది తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్.

ప్రస్తుతం స్పిరిట్,వారణాసి,కల్కి 2 వంటి భారీ ప్రాజెక్ట్స్ కోసం నిర్మాతలు కోట్లాది రూపాయల పెట్టుబడులు పెడుతున్నారని, ఐమాక్స్, డాల్బీ అట్మాస్, అత్యున్నత హెచ్‌డీఆర్ టెక్నాలజీతో ప్రపంచ స్థాయి క్వాలిటీతో విజువల్ వండర్స్‌ను మన ముందుకు తెస్తున్నారని తెలిపారు.ఇలాంటి హై-బడ్జెట్ సినిమాలకు అయిన భారీ ఖర్చును తిరిగితీసుకోవడం, కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిన అవసరం సినీ ఇండస్ట్రీ మనగడకి ఎంతో అవసరమని చెప్పుకొచ్చారు.ప్రభుత్వం ఈ విషయన్ని గుర్తించే అందరికి రేట్లు అందుబాటులో ఉంచుతూనే ఇండస్ట్రీ అభివృద్ధి చెందేలా ఒక స్పష్టమైన, సరసమైన టికెట్ రేట్ల విధానాన్ని తెచ్చిందని ఆకాశానికి ఎత్తేసింది.

పెద్ద సినిమాలకు మాత్రమే 

Advertisement

ఇక చాలామంది అనుకుంటున్నట్లు ఈ కొత్త జీవో వల్ల మార్కెట్‌లోకి వచ్చే ప్రతీ సినిమాకీ టికెట్ రేట్లు ఆటోమేటిక్‌గా ఏమీ పెరిగవని కేవలం భారీ బడ్జెట్‌తో, అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన అర్హత ఉన్న పెద్ద చిత్రాలు మాత్రమే రేట్ల పెంచు మని దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది.

ఇక మీడియం బడ్జెట్ సినిమాలు గనుక టికెట్ రేట్లు పెంచుమని అడిగితే ప్రభుత్వ అధికారులు సదరు సినిమా బడ్జెట్, టెక్నికల్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతి ఇస్తారని వివరించింది.ఇక టికెట్ రేట్లు పెరిగితే కామన్ ఆడియన్స్ థియేటర్ కి దూరం అవకుండా తగు జాగ్రత్తలు తీసుకుందని అందులో భాగంగానే థియేటర్ సింగిల్ స్క్రీన్ ఏసీ అయినా, నాన్-ఏసీ అయినా, లేదా పెద్ద మల్టీప్లెక్స్ అయినా సరే, ఎక్కడ ఉన్నా సరే థియేటర్లోని మొత్తం సీట్లలో తప్పనిసరిగా 25 శాతం సీట్లను నాన్-ప్రీమియం కేటగిరీ కింద తక్కువ ధరలకే కేటాయించాలన్న నిబంధనని తీసుకొచ్చిందని వివరించింది.

రోజుకు 5 షోల ప్రదర్శన మంచి నిర్ణయం 

Advertisement

అంతేకాకుండా రోజుకు 5 షోల ప్రదర్శనకు అనుమతి ఇవ్వడం మంచి నిర్ణయమని, దీని వల్ల పెద్ద సినిమాలకు మొదటి వారంలో భారీ స్థాయిలో ఉండే డిమాండ్ క్లియర్ అవుతుందని, దీంతో చిన్న మరియు మీడియం సినిమాలకి రెండో వారం నుండే థియేటర్లు దొరికే అవకాశం ఉంటుందని పేర్కొంది.

అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఈ విధానం ద్వారా సినీ కార్మికుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక నిధి ఏర్పాటు కాబోతోందని ,పెద్ద సినిమాల ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో కొంత భాగం రాత్రింబవళ్లు కష్టపడే వేలాది మంది కార్మికుల భద్రత, ఆరోగ్య అవసరాలకు ఉపయోగపడుతుందని వివరించింది.

 అసోసియేషన్ ఎలా రియాక్ట్ అవుతుందో !

మొత్తానికి ఈ కొత్త జీవో అనేది కేవలం టికెట్ల ధరలకు మాత్రమే పరిమితం కాకుండా, కొత్త పెట్టుబడులను ఆకర్షించేలా, అత్యాధునిక టెక్నాలజీని ప్రోత్సహించేలా, చిన్న సినిమాలకు అండగా నిలిచేలా ఉందని ప్రభుత్వం తెచ్చిన ఈ జీవో కి మా సంపూర్ణమైన మద్దతు ఉంటుందని తెలిపింది తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్. చూడాలి మరి తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయంపై థియేటర్, ఎగ్జిబిటర్ అసోసియేషన్ ఎలా రియాక్ట్ అవుతుందో !

also read :అందరినీ తొక్కి చిరు మెగాస్టార్ అయ్యాడా.. కళ్యాణ్ దిలీప్ కామెంట్స్ వైరల్!

Tags

Related News

ఒకే ఫ్రేమ్ లో దేవిశ్రీ.. ఐశ్వర్య రాజేష్? మ్యాటర్ ఏంటీ బ్రో?

ఆదర్శ కుటుంబం ఎఫెక్ట్… ఆందోళనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్..

డబ్బు విషయంలో బ్రహ్మీ ఎందుకంత నిక్కచ్చిగా ఉంటారంటే?

మానసా చౌదరి అందాల విందు.. ఈ పోజ్‌కి ఫిదా అవ్వాల్సిందే!

‘దొంగ నా కొడుకు’గా మౌళి.. ఈసారి నవ్వించడానికి రెడీ!

ప్రభాస్‌తో శ్రీవిష్ణు ఫొటో.. అసలు మ్యాటర్ ఏంటంటే!

మహారాష్ట్రలోనూ తగ్గని అల్లు అర్జున్ క్రేజ్… తగ్గేదే లే అంటున్న ఫ్యాన్స్!

వరంగల్ నుంచి వచ్చిన ఈ అమ్మాయి.. ఒక్క సినిమాకు లక్షల్లో రెమ్యునరేషన్!

Big Stories

Advertisement
×