E-Paper
Advertisement

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై కేస్ ఫైల్.. యువతికి హత్యా బెదిరింపులు!

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై కేస్ ఫైల్.. యువతికి హత్యా బెదిరింపులు!
Advertisement

Singer Rahul Sipligunj: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ సింగర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన పాటలతో, తన గాత్రంతో శ్రోతలను అలరిస్తూ ఏకంగా ఆస్కార్ రెడ్ కార్పెట్ పై కూడా సందడి చేసిన ఈయనపై తాజాగా విశాఖపట్నంలో కేసు నమోదయింది. తనను బెదిరిస్తున్నారు అంటూ ఒక యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో రాహుల్ పై ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం కాస్త వెలుగులోకి వచ్చింది. అసలు రాహుల్ పై ఒక అమ్మాయి కేస్ ఫైల్ చేయడం ఏంటి? రాహుల్ ఆ అమ్మాయిపై బెదిరింపులకు దిగడం ఏంటి? అసలు ఏం జరిగింది? అంటూ నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.

రాహుల్ తో పాటు 11 మందిపై కేస్ ఫైల్..

పూర్తి వివరాల్లోకి వెళితే.. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ పోలీసులు రాహుల్ సిప్లిగంజ్ తో పాటు మరో 11 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నా. సదరు యువతి తన ఫిర్యాదులో రాహుల్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించినట్లు సమాచారం. అంతేకాదు యువతి సమర్పించిన వివరాలు, ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారట. పైగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రేమ, పెళ్లి పేరుతో మోసం..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. రాహుల్ సిప్లిగంజ్ బావమరిది రాహుల్ రెడ్డి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేశాడని , ప్రైవేటు వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఒక యువతి ఫిర్యాదు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.. అయితే సెటిల్మెంట్ చేస్తానని రాహుల్ సిప్లిగంజ్ తనను హైదరాబాద్ కి పిలిపించి, ఆ తర్వాత చంపుతానని బెదిరించాడు అంటూ బాధితురాలు తన పిటీషన్ లో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో పలు సెక్షన్ల కింద రాహుల్ సిప్లిగంజ్ అలాగే తన బావమరిది రాహుల్ రెడ్డి తో పాటు మరో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

also read: 13 ఏళ్లుగా యాంకర్ ప్రదీప్ పై ప్రేమ.. ఎట్టకేలకు ఓపెన్ అయిన బ్రహ్మముడి సీరియల్ నటి!

గల్లీ నుండి ఆస్కార్ వరకు..

Advertisement

రాహుల్ సిప్లిగంజ్ విషయానికొస్తే.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈయన ఎక్కువగా తెలుగు సినిమా పాటలు, జానపద పాటలతో గాయకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. తెలంగాణ యాసలో మగజాతి అనే జానపద పాటతో యూట్యూబ్లో భారీ ఆదరణ పొందిన రాహుల్.. 2009లో వచ్చిన జోష్ సినిమాలోని కాలేజ్ బుల్లోడా పాటతో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఈయన కాలభైరవతో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలోని “నాటు నాటు” పాటను పాడినందుకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు లభించింది. ఆస్కార్ వేదికపై కాలభైరవతో కలిసి ఈ పాటతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు రాహుల్. ఈ సందర్భంగా 2025 బోనాలు పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాహుల్ గౌరవానికి కోటి రూపాయల నగదు పురస్కారాన్ని కూడా ప్రకటించింది. అలాంటి ఈయన ఇప్పుడు హత్యా బెదిరింపుల కేసులో చిక్కుల్లో పడ్డారని చెప్పవచ్చు.

Related News

చచ్చిపోతామని డ్రామా ఆడారు.. పూరి, ఛార్మి లీలలు బయటపెట్టిన ప్రొడ్యూసర్!

బూతులు తిడుతూ..చచ్చిపో అంటూ శాపాలు… రేణు దేశాయ్ ఎమోషనల్!

‘ముంజ్యా’ బ్యూటీ శర్వరీకి క్రేజీ అవార్డ్… ఆమె చేసిన సినిమాల లిస్ట్ ఇదే!

ప్రమోషన్లలో రణబాలి సరికొత్త స్ట్రాటజీ.. సినిమాకు ప్లస్ అయ్యేనా?

ఆదర్శ కుటుంబం నుంచి ‘నారాయణమ్మ’ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్

వెంకటేష్ అంటే త్రివిక్రమ్ కు అంత భయమా.. ఎందుకో తెలుసా?

అమ్మ హీరోయినే..కూతురు హీరోయినే..ఇండస్ట్రీలో తల్లీకూతుర్ల హవా!

రూ.200 కోట్లు సాధ్యమేనా..? ‘ప్యారడైజ్’కి అసలు పరీక్ష ఇప్పుడే!

Big Stories

Advertisement
×