E-Paper
Advertisement

నా ఓటు గల్లంతయ్యింది -ప్రకాష్ రాజ్

నా ఓటు గల్లంతయ్యింది -ప్రకాష్ రాజ్
Advertisement

Prakash Raj: విలక్షణ నటుడిగా, భాషతో సంబంధం లేకుండా భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు ప్రకాష్ రాజ్ (Prakash Raj). ఒకవైపు తన సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటూనే.. మరొకవైపు సామాజిక అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటికీ మొన్న ప్రశ్నా రావణ్ కు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan), ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) లకు వ్యతిరేకంగా పోస్ట్ పెడుతూ “#జస్ట్ ఆస్కింగ్” అంటూ చెలరేగిపోయిన ప్రకాష్ రాజ్.. ఇటీవల ఢిల్లీ వేదికగా నీట్ పేపర్ లీక్ పై కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఉద్యమానికి అండగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు.

నా ఓటు కనిపించట్లేదు – ప్రకాష్ రాజ్..

అలాంటి ఈయన ఇప్పుడు తాజాగా మరో పోస్ట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చారు.. ఏకంగా తన ఓటు కనిపించట్లేదు అంటూ వదిలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఆయన చేస్తున్న కామెంట్లను బట్టి చూస్తే భారతదేశ ప్రధానమంత్రి మోదీని ఉద్దేశించి కామెంట్లు చేసినట్లు తెలుస్తోంద మరి ప్రకాష్ రాజ్ అసలు ఏం చెప్పారు? ఆ వీడియోలో ఏముంది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

మోదీ.. గేమ్ ఆన్..

Advertisement

ప్రకాష్ రాజ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక వీడియో విడుదల చేస్తూ..” ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ లిస్టు నుంచి తన ఓటు తొలగించారు” అంటూ భారత ప్రధాని మోదీపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ సెటైరికల్ వీడియో విడుదల చేశారు. బెంగళూరులో తొలగించిన 65 లక్షల ఓటర్లలో నేను కూడా ఒకరిని. అయితే నేను ఇక్కడే పెరిగాను. ఇక్కడే చదువుకున్నాను. నా కాలేజీ చదువు కూడా ఇక్కడే పూర్తయింది. అంతేకాదు నేను ఎంపీగా కూడా ఇక్కడే పోటీ చేశాను .ఇదంతా మర్చిపోయారేమో.. అయితే ఏ ఏ పేపర్స్ అడుగుతారో చూద్దాం.. మోదీ.. గేమ్ ఆన్..” అంటూ కామెంట్ చేశారు.

మిమ్మల్ని ఓడించకుండా ఆపేదెవరు?

ఇదే వీడియోలో ప్రకాష్ రాజు మాట్లాడుతూ.. “మీకు ఓటు వేయని వారిని తొలగించే అధికారం మీ వద్ద ఉండవచ్చు. కానీ మిమ్మల్ని గద్దె దింపకుండా మమ్మల్ని ఆపగలరా?” అంటూ ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. ఇక ప్రస్తుతం ఈయన విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏది ఏమైనా భారత ప్రధాని మోదీని ఉద్దేశించి మిమ్మల్ని ఓడించకుండా ఆపేదెవరు అంటూ ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

also read: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై కేస్ ఫైల్.. యువతికి హత్యా బెదిరింపులు!

SIR ముసాయిదా ఓటర్ జాబితాపై విమర్శలు ..

SIR ముసాయిదా ఓటర్ జాబితా ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే.ముఖ్యంగా అనర్హులైన ఎంతోమందిని ఈ ఓటర్ జాబితా నుండి తొలగించడం జరిగింది. ఇక అందులో భాగంగానే మరి కొంతమందికి అర్హత ఉన్నా ఓటు హక్కు లేకపోవడంపై పలు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రకాష్ రాజ్ కూడా తన ఓటు కనిపించట్లేదు అంటూ చేసిన కామెంట్లు, వదిలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News

ఆగస్టు 15న మూవీ మజా.. ఏకంగా 7 సినిమాలు.. ఆ 2 మూవీస్ మస్ట్ వాచ్!

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై కేస్ ఫైల్.. యువతికి హత్యా బెదిరింపులు!

స్టోరీ రైటర్స్ కు లక్కీ ఛాన్స్.. అన్నపూర్ణ స్టూడియోలో అవకాశం..!

ఆ విషయంలో అమల చాలా లక్కీ – నాగార్జున

ఆ మాట చెబుతూ.. వేదిక పైనే బోరున ఏడ్చేసిన కామాక్షి భాస్కర్ల

నడుము వయ్యారాలతో గిలిగింతలు పెడుతున్న రీతూ వర్మ.. ఫోటోలు వైరల్!

బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటూ హాట్ బాంబు పేల్చిన హీరోయిన్!

Big Stories

Advertisement
×