E-Paper
Advertisement

ఆ మాట చెబుతూ.. వేదిక పైనే బోరున ఏడ్చేసిన కామాక్షి భాస్కర్ల

ఆ మాట చెబుతూ.. వేదిక పైనే బోరున ఏడ్చేసిన కామాక్షి భాస్కర్ల
Advertisement

Kamakshi Bhaskarla: ప్రముఖ హీరోయిన్ కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రియురాలు సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఈమె.. చైనాలో ఎంబీబీఎస్ చేసి.. అపోలో హాస్పిటల్ లో కొంతకాలం డాక్టర్ గా కూడా పనిచేసింది. ఆ తర్వాత మోడల్ రంగంలో అడుగుపెట్టిన ఈమె.. 2018లో మిస్ తెలంగాణ టైటిల్ అందుకున్న కామాక్షి… అదే ఏడాది మిస్ ఇండియా పోటీలలో పాల్గొని ఫైనల్ వరకు చేరుకుంది. డాక్టర్ వృత్తిని పక్కనపెట్టి 2017 ఆగస్టులో ఇండియాకి వచ్చిన కామాక్షి భాస్కర్ల పలు చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఎన్నో చిత్రాలలో నటించింది. కానీ ఈమెకు మా ఊరి పొలిమేర సినిమా మంచి పేరును అందించింది.

అగధ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కామాక్షి భాస్కర్ల..

ఇకపోతే ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ ఎమ్మెస్ రాజు(MS Raju) దర్శకత్వంలో ‘అగధ’ అనే ఒక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. అందులో ఎన్నో విషయాలను పంచుకుంటూ స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకుంది. కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ.. నా జీవితంలో ఈరోజు చాలా స్పెషల్ అని చెప్పడానికి మూడు కారణాలు ఉన్నాయి. ఇన్ని రోజులు ఎమ్మెస్ రాజు గారు క్రియేట్ చేసిన అగధ అనే ఒక ప్రపంచంలో ఉంటూ.. ఆక్ట్ చేస్తూ.. వేరే యాక్టర్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ.. ఆఫ్ కెమెరా కబుర్లు చెప్పుకుంటూ.. టెక్నీషియన్స్ అందరితో సరదాగా మాట్లాడుతూ.. వారి నుంచి ఎంతో కొంత నేర్చుకుంటూ.. ఇంటర్వ్యూలు ఇస్తూ.. రిలీజ్ కి చాలా దగ్గరగా వచ్చేసాం.. ఫోర్ డేస్ లో మీ ముందుకు రాబోతున్నాం. ఇన్ని రోజులు వెనకుండి చూసుకుంటూ.. ఇప్పుడు ఆడియన్స్ చూస్తారు అన్న విషయం తెలియగానే చాలా ఎక్సైట్ అవుతున్నాను.

Advertisement

ALSO READ:నడుము వయ్యారాలతో గిలిగింతలు పెడుతున్న రీతూ వర్మ.. ఫోటోలు వైరల్!

ఆ మాట చెబుతూ స్టేజ్ పైనే కన్నీళ్లు..

నాకు స్పెషల్ గా అనిపించిన రెండవ కారణం.. 2017 ఆగస్టులో నేను ఇండియాకి వచ్చా. మళ్లీ 2026 ఆగస్టులో ఈ అగధ సినిమా విడుదల కాబోతోంది. మొత్తానికి ఇంత మంచి సినిమా లభించడానికి 9 సంవత్సరాలు పట్టింది. ముఖ్యంగా మీ వల్లే నా కష్టానికి ప్రతిఫలం లభించింది. ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకి అవకాశాలు రావడమే చాలా తక్కువ. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారిపోతున్నాయి. అలాంటిది మీరు క్రియేట్ చేసిన ఒక వరల్డ్ లో ఒక సెంటర్ క్యారెక్టర్ ఇచ్చి.. నన్ను నమ్మినందుకు చాలా ధన్యవాదాలు రాజు గారూ అంటూ స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకుంది కామాక్షి భాస్కర్ల.

9 ఏళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం – కామాక్షి భాస్కర్ల

Advertisement

మూడో కారణం నా కుటుంబం.. ఇక్కడే ఉంది.. మా అన్నయ్య, మా అమ్మ, మా పిన్ని.. అంటే మీరు నన్ను స్క్రీన్ మీద చూసేది చాలా తక్కువ. నా క్యారెక్టర్స్ చూసి తను ఇలాంటి క్యారెక్టర్లే చేస్తుంది.. ఏముంది అనుకుంటారు. కానీ ఈ తొమ్మిదేళ్లు నేను పడిన కష్టం నా కుటుంబ సభ్యులు చూశారు. నేను ఈరోజు ఇలా నిలబడడానికి వాళ్లు ఎన్నో త్యాగాలు చేశారు. డాక్టర్ గా ఒక ప్రొఫెషన్ వదిలేసి.. యాక్టర్ గా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు చాలామంది చాలా రకాలుగా అంటారు. ముఖ్యంగా మన తల్లిదండ్రులను ప్రశ్నిస్తారు. ఫ్యామిలీస్ నుంచి, బంధువుల నుంచి, బయట వాళ్ల నుంచి ఎన్నో ప్రశ్నలు వస్తాయి. అయితే అవేవీ కూడా వాళ్ళు నా వరకు తీసుకురాలేదు. ఇక అన్నింటికి చెక్ పెట్టే సమయం వచ్చింది . ఎమ్మెస్ రాజు గారు నన్ను నమ్మి ఈ రోజు ఒక పెద్ద బాధ్యతను ఇచ్చారు. పైగా ఇదే రోజున నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈ మూడు చాలు నేను సక్సెస్ అయ్యాను అని చెప్పడానికి. ఇండస్ట్రీలో స్టార్డమ్ ఉంటేనే సక్సెస్ అని అందరూ నమ్ముతారు.. అయితే ఏమీ లేని దగ్గర ఒక బేస్ ను క్రియేట్ చేసుకుని.. దానిని నిలబెట్టుకోవడం అనేది చాలా పెద్ద సక్సెస్” అంటూ కామాక్షి భాస్కర్ల చెప్పుకొచ్చింది.

Related News

నడుము వయ్యారాలతో గిలిగింతలు పెడుతున్న రీతూ వర్మ.. ఫోటోలు వైరల్!

బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటూ హాట్ బాంబు పేల్చిన హీరోయిన్!

ప్రముఖ డైరెక్టర్ అరెస్ట్.. లైంగిక దాడి ఆరోపణల కేసులో!

ప్రియాంక చోప్రా స్పెషల్ ఫోటో.. మహేష్ బాబు పెట్టుకున్న క్యాప్ ధర ఎంతంటే?

అన్నం పెట్టి.. ఛాతి, మెడపై కాలితో తన్ని హత్య.. దర్శన్ కేసులో సంచలన నిజాలు

మీరు AI క్రియేటర్లా? హైదరాబాద్‌లో EROS సంస్థ ఆడిషన్‌ మిస్ కాకండి, ఎప్పుడంటే?

ఏ.ఆర్.రెహమాన్ కొడుకుకు యాక్సిడెంట్.. పరిస్థితి ఎలా ఉందంటే?

Big Stories

Advertisement
×