E-Paper
Advertisement

పోస్టర్లు అదిరిపోయాయి.. సినిమాలు మాత్రం బొక్కబోర్లా పడ్డాయి!

పోస్టర్లు అదిరిపోయాయి.. సినిమాలు మాత్రం బొక్కబోర్లా పడ్డాయి!
Advertisement

September Box Office:సెప్టెంబర్.. 2026 లో మరో నెల గడిచిపోయింది కానీ టాలీవుడ్ బాక్సాఫీస్ కి ఈ నెల కూడా మొండి చేయి చూపించింది. పలు పెద్ద సినిమాలు వస్తున్నాయని సంబరపడ్డ బాక్సాఫీస్ కి ఈ నెల చుక్కలు చూపించింది. ముఖ్యంగా భారీ అంచనాలతో వచ్చిన బడా సినిమాలు సోదిలో లేకుండా పోవడంతో సెప్టెంబర్ నెల డీలా పడిపోయింది.

మొదటగా ఈనెలలో వచ్చిన సినిమాల విషయానికి వస్తే సందీప్ రెడ్డి వంగ రోమాంచకం, అల్లరి నరేష్ రంబ, ఊర్వశి ,మేనక సినిమాలు పర్లేదు అనిపించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సరైన వసూల్లని రాబట్ట లేకపోయాయి. అలా ఈ రెండు సినిమాలు అంచనాలను అందుకోలేకపోవడంతో సెప్టెంబర్ ఖాతాని నిరాశతోనే మొదలెట్టింది.

Advertisement

ఇక పండగ సీజన్లో అయినా మారెమ్మ సినిమా ఆడియన్స్ ని అలరిస్తుంది అనుకుంటే అది కూడా చేతులెత్తేసింది.పైగా రవితేజ ఈ సినిమాకి ప్రమోషన్ చేసినా కూడా ఆడియన్స్ ఈ సినిమా వైపు చూడకపోవడం గమనార్హం. ఇక సుహాస్ మండాడి సినిమా కోలీవుడ్లో 100 కోట్లను వసూలు చేసినప్పటికీ తెలుగు నాట ఈ సినిమా అంతంతమాత్రంగానే ఆడటం గమనార్హం.

ఇక అదే రోజు వచ్చిన సర్దార్ 2 సినిమా తొందరగానే దుకాణం సర్దేసింది .ముఖ్యంగా సర్దార్ మీద నమ్మకంతో థియేటర్స్ కి వచ్చిన ఆడియన్స్ కి ఈ సినిమా చుక్కలు చూపించింది.మొత్తానికి కార్తీ హిట్ కోసం మరో సినిమా దాకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి .

Advertisement

ఇక భారీ అంచనాలతో వచ్చిన ఎపిక్ సినిమా ఎటు వెళ్లిపోయిందో తెలియదు. బేబి కాంబినేషన్ అంటూ ఆనంద్ దేవరకొండ ,వైష్ణవి చైతన్య జోడితో సితారా ఎంటర్టైన్మెంట్స్ తీసిన ఈ సినిమా అత్తపత్తా లేకుండా పోయింది.ఆదిత్య హసన్ తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ తోనే ఆడియన్స్ కి డిస్కనెక్ట్ అయిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలోని కంటెంట్ ఆడియన్స్ ఎంత మాత్రం అలరించలేకపోయింది. పైగా ఇందులో బూతు కంటెంట్ ఉందన్న టాక్ స్ప్రెడ్ అవటంతో ఫ్యామిలీస్ దీనికి దూరంగా ఉండిపోయారు.ఇక చివర్లో వచ్చిన మహేంద్రగిరి వారాహి సినిమా పై సుమంత్ భారీ అంచనాలే పెట్టుకున్నప్పటికీ ఇదీ నిరాశనే మిగిల్చింది.

ఇక అన్నింటికీ మించి ఈ ఏడు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది అనుకున్న పారడైజ్ సినిమా బొక్క బోర్లా పడిపోయింది .మొదటి రోజున డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా క్రమంగా నెగెటివ్ టాపిక్ మూట కట్టుకుంది. అయితే మొదటి రోజే ఈ సినిమా ఏకంగా 100 కోట్లను వసూలు చేయడం విశేషం. ఇక క్రమంగా కలెక్షన్స్ డ్రాప్ అవుతూ ప్రస్తుతానికి 156 కోట్ల వద్ద ఆగింది. మరి బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ సినిమా మరో పాతిక కోట్లను వెనకయ్యాలి.థియేటర్లలో ఈ సినిమా రన్ అవుతున్న తీరు చూస్తుంటే అంత రాబట్టడం ఆసాధారణమనే చెప్పాలి.

also read :జానీ మాస్టర్ లవ్ స్టోరీ తెలుసా?..అసలు ట్విస్ట్ ఇదే!

ఇక మొత్తానికి టాలీవుడ్ కి హ్యాండ్ ఇచ్చిన సెప్టెంబర్ అయిపోవడంతో ఇక అందరి కళ్ళు అక్టోబర్ మీదే ఉన్నాయి.మరి ఈ నెలలో వచ్చే ఆదర్శ కుటుంబం,జైలర్ 2,రణబాలి,కామ్రేడ్ కళ్యాణ్ వంటి సినిమాలు బాక్సాఫీస్ కి ఏ మాత్రం ఊపిరినిస్తాయో చూడాలి. ఏది ఏమైనా కంటెంట్ లేకపోతే ఎంత బడ్జెట్ కుమ్మరించినా సినిమాలను అసలు చూడలేమంటూ ఆడియన్స్ మరోసారి తీర్పుని చాటి చెప్పారు!

Tags

Related News

గాయం తర్వాత బాలయ్య ఫుల్ స్వింగ్‌లోకి.. ‘దాదా’కు ఇక పరుగులే!

చీరలో స్రవంతి చొక్కారపు.. చూపు తిప్పుకోనివ్వడం లేదుగా!

జానీ మాస్టర్ లవ్ స్టోరీ తెలుసా?..అసలు ట్విస్ట్ ఇదే!

రెండు వారాల్లోనే రూ. 1.3 కోట్ల ఆదాయం.. విజయ్ దేవరకొండ ‘అన్ హైప్’ దూకుడు!

చిట్టి ఈసారి ఏం చేస్తుందో..ఫరియా పోస్ట్‌తో ఫ్యాన్స్‌లో జోష్!

చిరంజీవి బ్లడ్ అమ్ముకుంటున్నారట.. తమ్మారెడ్డి ఇచ్చిన లాజిక్ అదిరిపోయిందిగా!

ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారంటే?

Big Stories

Advertisement
×